పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

 •  
 •  
 •  

4-864-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రనాథ! వినుము స్వప్నంబు చందంబున-
జ్ఞాన విలసితం గుటఁ జేసి
తివిరి మిథ్యాభూత దేహాదికమునకు-
రయ నివర్తనాయాస మేటి
ని యంటివేనియు ర్థంబు లేకున్న-
ర్థి సోపాధికం బైన మనము
వాంఛతో స్వప్నము ర్తింపఁ బురుషునిఁ-
బూని జాగ్రద్బోధచే నుపాధి

4-864.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

చెడక స్వాప్నిక సంసృతి విడువనట్లు
త్త్వ విజ్ఞానమున నవిద్యా నివృత్తి
దార దేహాదిక నివృత్తి గులకున్నఁ
దివుట సంసృతి దా నివర్తింప కుండు.

టీకా:

నరనాథ = రాజా {నరనాథుడు - నరుల (మానవుల)కు నాథుడు, రాజు}; వినుము = వినుము; స్వప్నంబున్ = కల; చందంబునన్ = వలె; అజ్ఞాన = అజ్ఞానముతో; విలసితంబున్ = విలసిల్లునది; అగుటన్ = అగుట; చేసి = వలన; = తివిరి = పూని; మిథ్యాభూత = మిథ్యయైనట్టి; దేహ = శరీరము; ఆదికమున్ = మొదలగువాని; కున్ = కి; అరయన్ = తరచిచూసిన; నివర్తన = మానిపించెడి; ఆయాసము = శ్రమ; ఏటికి = దేనికి; అని = అని; అంటివేనియున్ = అనినచో; అర్థంబున్ = ప్రయోజనము; లేకున్నన్ = లేనిచో; అర్థిన్ = కోరి; స ఉపాధికంబున్ = ధారణములుతో కూడినది; ఐన = అయిన; మనమున్ = మనసు; వాంఛ = కోరిక; తోన్ = తోటి; స్వప్నమున్ = కలలో; వర్తింపన్ = ప్రవర్తిల్లిన; పురుషునిన్ = పురుషుని; పూని = యత్నముతో; జాగ్రత్ = మెలకువలోని; ఉద్భోధ = తెలియగలుగట; చేన్ = అందును; ఉపాధిన్ = ధారణమును.
చెడకన్ = చెరపివేయక; స్వాప్నిక = కలలోని; సంసృతిన్ = ప్రవృత్తిని; విడువన్ = వదలని; అట్లు = విధముగా; తత్త్వ = తత్త్వము, యదార్థస్థితిని; విజ్ఞానమున్ = విజ్ఞానమున, తెలియుటవలన; అవిద్యా = అజ్ఞానమును; నివృత్తిన్ = పోగొట్టుకొనుటద్వారా; దార = క్రమముగా; దేహ = శరీరము; ఆదిన్ = మొదలగువానిని; నివృత్తిన్ = తొలగుట; తగులకున్నన్ = స్పృశింపకపోయినను; తివుటన్ = కోరికతో; సంసృతిన్ = సంసారము; దానిన్ = దానిలో; వర్తింపకుండు = ప్రవర్తిల్లదు.

భావము:

“రాజా! విను. దేహం స్వప్నం వలె అజ్ఞానంవల్ల ప్రాప్తిస్తుంది కాబట్టి అసత్యమైనదే కదా! దానిని ప్రయాసపడి తొలగించుకోవటం ఎందుకు అని అనరాదు. ప్రయోజనం లేకపోయినా కలలో ఉపాధితో కూడిన మనస్సు పురుషుని ఆశ్రయించి మెలకువ వచ్చిన తరువాత కూడా స్వప్న సంసారాన్ని విడిచిపెట్టదు. అలాగే వైరాగ్య చేత అజ్ఞానాన్ని తొలగించుకోలేక పోయినా, భార్యను శరీరాన్ని విడిచిపెట్ట లేకపోయినా సంసారం నుండి విడుదల లేదు.