పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

  •  
  •  
  •  

4-861-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గొకొని యిట్టి దుఃఖములకుం బ్రతికారము మానవేంద్ర! క
ల్గి విను తత్ప్రతిక్రియ యకించనవృత్తి జనుండు మస్తకం
బు నిడుమోపు మూఁపునను బూనినఁ దద్భరదుఃఖ మాత్మఁ బా
ని గతి జీవుఁడుం ద్రివిధమై తగు దుఃఖముఁ బాయఁ డెన్నడున్.

టీకా:

గొనకొని = పూని; ఇట్టి = ఇటువంటి; దుఃఖముల్ = దుఃఖముల; కున్ = కి; ప్రతీకారము = విరుగుడు; మానవేంద్ర = రాజా {మానవేంద్రుడు - మానవులకు ప్రభువు, రాజు}; కల్గినన్ = ఉన్నప్పటికిని; విను = వినుము; తత్ = ఆ; ప్రతిక్రియ = విరుగుడు; అకించన = దరిద్రుని; వృత్తిన్ = విధముగా నున్న; జనుండు = వాడు; మస్తకంబున్ = తలపైని; ఇడు = పెట్టుకొన్న; మోపు = బరువును; మూపునన్ = భుజముపైకి; పూనినన్ = ధరించినను; తత్ = ఆ; భర = బరువు వలని; దుఃఖమున్ = బాధ; ఆత్మన్ = తనను; పాయని = విడువని; గతిన్ = వలె; జీవుడు = జీవుడు; త్రివిధము = మూడు (3) రకములు {త్రివిధదుఃఖములు - 1ఆదిభౌతికము 2అధ్యాత్మికము 3అధిదైవికము}; ఐ = అయ్యి; తగు = ఒప్పు; దుఃఖము = దుఃఖము; పాయదు = తొలగదు; ఎన్నడున్ = ఎప్పటికిని.

భావము:

ఇటువంటి దుఃఖాలకు ప్రతిక్రియ లేదు. ఒకవేళ ఉన్నా అది తాత్కాలికమే. బరువు మోసే నిరుపేద తన తలమీది బరువును భుజం మీదికి మార్చుకున్నా దాన్ని మోయటం వల్ల కలిగే దుఃఖాన్ని తప్పించుకోలేడు. అలాగే జీవుడు మూడు రకాలైన దుఃఖాన్ని తప్పించుకోలేడు.