పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

  •  
  •  
  •  

4-860-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యన్ క్షుత్పరిపీడఁ గుంది శునకం బింటింటికిం బోవఁ బూ
నినఁ దద్దైవిక మైన దండహతిఁ గానీ, కాక చౌర్యాన్న మై
ను గానీ తగఁ బొందు చందమున నెన్నన్ దైవయోగంబు పెం
పు నీ జీవుఁడు దాఁ బ్రియాప్రియములం బొందుం ద్రిలోకంబులన్.

టీకా:

ఎనయన్ = మిక్కిలిగా; క్షుత్ = ఆకలిచే; పరిపీడన్ = బాధ యందు; కుంది = దుఃఖపడి; శునకంబున్ = కుక్క; ఇంటింటికిని = ప్రతి ఇంటికి; పోవన్ = వెళ్ళగా; పూనిన = దొరకిన; తత్ = తత్కాలపు; దైవికము = యాదృచ్ఛికతను, దేవనిర్ణయానుసారము; ఐన = అయిన; దండహతిన్ = కఱ్ఱదెబ్బలు; కానీ = కానీ; కాక = కాకపోతే; చౌర్య = దొంగతనము చేయబడిన; అన్నము = ఆహారము; ఐననున్ = అయిన; కానీ = కానీ; తగన్ = అవశ్యము; పొందున్ = పొందెడి; చందమునన్ = విధముగా; ఎన్నన్ = ఎంచి చూసిన; దైవ = దేవుని యొక్క; యోగంబున్ = కలసివచ్చుట; పెంపునన్ = అతిశయించుట వలన; ఈ = ఈ; జీవుడు = పురుషుడు; తాన్ = తాను; ప్రియా = ఇష్టమైనవి; అప్రియములన్ = అయిష్టమైనవి; పొందున్ = పొందును; త్రిలోకంబునన్ = ముల్లోకములలోను {ముల్లోకములు - 1భూలోకము 2భువర్లోకము 3సువర్లోకము}.

భావము:

ఆకలి బాధతో కుక్క ఇంటింటికీ తిరిగి దైవికంగా కఱ్ఱ దెబ్బలనో, దొంగకూడునో తిన్నట్లు జీవుడు దైవికంగా ప్రాప్తించిన ప్రియాప్రియాలను మూడు లోకాలలోను అనుభవిస్తాడు.