పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

  •  
  •  
  •  

4-858.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లుగుఁ గర్మానుగుణములు గాఁగ జగతిఁ
బుట్టి చచ్చుచుఁ గ్రమ్మఱఁ బుట్టు చిట్లు
దివిరి కామాశయుం డైన దేహి యెప్డు
నున్న తానత పదముల నొందుచుండు.

టీకా:

ధృతిన్ = ధారణతో; ఒప్పుచున్న = ఒప్పియున్నట్టి; సాత్విక = సత్త్వగుణముకల; కర్మముననున్ = కర్మములవలన; ప్రకాశ = ప్రభలు; భూయిష్ట = మిక్కుటమైన; లోకములన్ = లోకములను; భూరి = అత్యధికమైన; రాజస = రజోగుణముతో; ప్రకట = వ్యక్తమగు; కర్మమునన్ = కర్మలలో; దుఃఖ = దుఃఖము కలుగుట; ఉదర్క = రాగల ఫలముగా గల; లోల = చంచలములైన; క్రియా = పనుల వలన; ఆయాస = కష్టపడునట్టి; లోకములనున్ = లోకములను; కైకొని = పూని; తామస = తమోగుణముకల; కర్మమంబునన్ = కర్మములలో; తమః = ఆజ్ఞానము, చీకటి; శోక = దుఃఖము కలుగుట; మోహ = మోహములోపడుట; ఉత్కట = మోసపూరిత; లోకములనున్ = లోకములను; పొందుచున్ = పొందుతూ; పుం = పురుష; స్త్రీ = స్త్రీ; నపుంసక = నపుంసకములైన; మూర్తులన్ = రూపములను; దేవ = దేవతా, దైవత్వ; తిర్యక్ = జంతు, తిరుగట; మర్త్య = మానవ, మరణము యనెడి; భావములను = జన్మములను, భావములను; కలుగున్ = పొందును; కర్మా = కర్మములకు; అనుగుణములు = అనుకూలములు; కాగన్ = అగునట్లు.
జగతిన్ = ప్రపంచములో; పుట్టి = జన్మంచి; చచ్చుచున్ = చనిపోతూ; క్రమ్మఱన్ = మరల; పుట్టుచున్ = పుడతూ; ఇట్లు = ఈ విధముగా; తివిరి = యత్నిస్తూ; కామా = కామములయందు; ఆశయుండు = మనసుకలవాడు; ఐన = అయిన; దేహి = జీవుడు {దేహి - దేహమును ధరించెడివాడు, జీవుడు}; ఎప్డు = ఎల్లప్పుడును; ఉన్నత = ఉత్తమమైన, అభివృద్ధిగల; ఆనత = వంగిన; పదములన్ = స్థితులను; ఒందుచుండున్ = పొందుచుండును.

భావము:

సాత్త్విక కర్మల వల్ల ప్రకాశ భూయిష్ఠాలైన లోకాలను, రాజస కర్మల వల్ల దుఃఖ భూయిష్ఠాలైన లోకాలను, తామస కర్మల వల్ల తమశ్శోకమోహ భూయిష్ఠాలైన లోకాలను పొందుతాడు. ఒకప్పుడు పురుషుడై, ఒకప్పుడు స్త్రీయై, ఒకప్పుడు నపుంసకుడై ఆయా కర్మలకు తగినట్లు దేవ, మనుష్య, తిర్యక్ రూపాలతో జన్మిస్తాడు. ఈ విధంగా కామాసక్తుడైన పురుషుడు పుడుతూ, చస్తూ, మళ్ళీ పుడుతూ ఉన్నత స్థానాలను, నీచ స్థానాలను పొందుతూ ఉంటాడు.