పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

  •  
  •  
  •  

4-857-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విను మెపుడు దగులు నప్పుడ
యొరంగ గుణాభిమానియును గర్మవశుం
నఁ దగు నా పురుషుఁడు దా
మగు త్రైగుణ్యకర్మ లితుం డగుచున్.

టీకా:

వినుము = వినుము; ఎపుడున్ = ఎప్పుడున్; తగులున్ = ఆసక్తి కలవా డగు; అప్పుడు = అప్పుడు; ఒనరంగన్ = పొసగునట్లుగా; గుణా = గుణముల యందు; అభిమానియున్ = అభిమానము కలవాడు; కర్మ = కర్మమములకు; వశుండును = లొంగినవాడును; అనన్ = అనుటకు; తగు = తగును; ఆ = ఆ; పురుషుడు = పురుషుడు; తాన్ = తను; ఘనము = గొప్పది; అగు = అయిన; త్రైగుణ్య = త్రిగుణాత్మకమైన; కర్మ = కర్మములు; కలితుండున్ = కలిగినవాడు; అగుచున్ = అగుచూ.

భావము:

ఎప్పుడైతే అలా ప్రకృతి గుణాలలో ఆసక్తుడు ఔతాడో, అప్పుడు మానవుడు గుణాభిమాని అయి, త్రిగుణాలకు సంబంధించిన కర్మలలో మునిగి తేలుతూ, కర్మవశుడు అయి ఉంటాడు. …