పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

  •  
  •  
  •  

4-854.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుకరింపంగ నర్థిఁ జేయంగఁ బడుట
నవరత మాత్మమహిషిని నుసరించు
యు నెఱుఁగఁ జెప్పి యిట్టు లనియెను మఱియు
నవరేణ్యునితో యోగిత్తముండు.

టీకా:

అనఘాత్మ = పుణ్యాత్మ; వినుము = వినుము; జాయా = భార్య; ఆత్మజుల్ = పుత్రులకు; అనుగుణా = అనుకూలముగా; ఆక్తంబున్ = ప్రవర్తించునది; అగు = అయిన; మఱి = ఇంక; బుద్ధి = బుద్ధి యొక్క; తత్త్వము = తత్త్వము; అర్థిన్ = కోరి; వెలయన్ = ప్రకటమగునో; ఏయే = ఏయే; గతిన్ = విధముగ; వికృతిన్ = మార్పులను; చేయంబడు = చేయబడునో; ఏయే = ఏయే; తెఱంగులన్ = విధములుగ; ఇంద్రియములున్ = ఇంద్రియములును; ఏయే = ఏయే; తెఱంగులన్ = విధములుగ; ఇంద్రియములున్ = ఇంద్రియములు; ఏయే = ఏయే; తెఱంగులన్ = విధములుగ; వికృతిన్ = మార్పులను; పొందున్ = పొందునో; ఆ = ఆ; విధమునన్ = విధముగా; తత్ = ఆయా; గుణ = గుణములతో; ఆన్వితుండునున్ = కూడినవాడు; వరుసన్ = వరుసగా; తత్ = ఆయా; వృత్తులు = వర్తనలు; కునున్ = కు; ఘనుడునున్ = గొప్పవాడు; ఉపద్రష్టయునున్ = గమనించువాడు; తగున్ = అన తగిన; ఆత్మయున్ = ఆత్మ; తత్ = ఆయా; వృత్తులను = వర్తనలను; బలాత్కారమునను = బలవంతముగ; అనుకరింపంగన్ = అనుకరించుటలు; అర్థిన్ = కోరి; చేయంగబడుటన్ = చేయబడుటలు; అనవరతమున్ = ఎల్లప్పుడు; ఆత్మ = తనయొక్క; మహిషిన్ = పట్టపురాణిని; అనుసరించుటయున్ = అనుయరించుట; ఎఱుగంగగన్ = తెలియునట్లు; చెప్పి = చెప్పి.
= = ఇటులు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; మఱియున్ = ఇంకనూ; జనవరేణ్యుని = రాజు {జనవరేణ్యుడు - జనులచే గౌరవింపబడువాడు, రాజు}; తోన్ = తో; యోగి = యోగులలో; సత్తముండు = సత్తువగలవాడు.

భావము:

“పుణ్యాత్మా! విను. భార్యాపుత్రులు అనే గుణలిప్తమైన బుద్ధితత్త్వం ఏయే విధంగా వికారాన్ని పొందుతుందో, ఏయే విధాలుగా ఇంద్రియాలు వికారాన్ని పొందుతాయో ఆ గుణాలు కలిగి ఆ వృత్తులను అనగా తమస్సత్త్వరజోధర్మలైన మోహ, ప్రసాద, హర్షాలను బలవంతంగా పురంజనుడు అనుకరించేవాడు” అని చెప్పి యోగివర్యుడైన నారదుడు రాజశ్రేష్ఠుడైన ప్రాచీనబర్హితో ఇలా అన్నాడు.