పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

  •  
  •  
  •  

4-852-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విని భూమీశుఁడు నారద
ముని కను "భవదీయవచనములు సూరులు ద
క్కను గర్మ మోహితులమై
రెడు నే మెట్టు దెలియువారము చెపుమా."

టీకా:

విని = విని; భూమీశుండు = రాజు {భూమీశుడు - భూముకి ప్రభువు, రాజు}; నారద = నారదుడు యనెడి; ముని = ముని; కిన్ = కి; అను = అనెను; భవదీయ = నీ యొక్క; వచనంబులు = మాటలు; సూరులు = జ్ఞానులు; తక్కనున్ = తప్పించి; కర్మ = కర్మములందు; మోహితులము = మోహముచెందెడివారము; ఐ = అయ్యి; = వనరెడు = శోకించెడు; నేము = మేము; ఎట్టు = ఏ విధముగా; తెలియు = తెలిసికొనగల; వారము = వాళ్ళ మగుదుము; చెపుమా = చెప్పుము.

భావము:

ప్రాచీనబర్హి నారదమహర్షితో ఇలా అన్నాడు “నీ మాటలు పండితులు తప్ప కర్మబద్ధులమై దుఃఖించే మేము ఎలా తెలుసుకోగలం? కాబట్టి నాకు వివరించి చెప్పు”