పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

  •  
  •  
  •  

4-850-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీవు వైదర్భివి గావు; వీరుఁ డితండు-
వివరింపఁగాఁ గాఁడు విభుఁడు నీకు;
నొగి మున్ను పురమున నుపరుద్ధుఁ జేసిన-
యా పురంజన పతి రయఁ గావు;
ఱియు నీ వన్య సీమంతిని యనియును-
ర్చింపఁగా బూర్వ న్మమందుఁ
బురుషుం డవనియును బుద్ధిఁ దలంచుట-
రయంగ నీ యుభము నసత్య;

4-850.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మింతయును మామకీనమై యెసఁగు మాయఁ
జేసి కల్పిత మయ్యెఁ; జర్చింప మనము
పూర్వమున హంసలమ యని పూని యెఱుఁగఁ
లికితిఁ దెలియు మనల రూపంబుఁ జూడు.

టీకా:

నీవున్ = నీవు; వైదర్భివి = విదర్భరాకుమారివి; కావు = కావు; వీరుడు = శూరుడు; ఇతండు = ఇతడు; వివరింపగా = తరచిచూడగా; కాడున్ = కాడు; విభుడు = భర్త; నీకున్ = నీకు; ఒగిన్ = వరుసగా; మున్ను = పూర్వము; పురముననున్ = పురములో; అనుపరుద్దు = ఆపబడినవానినిగా; చేసిన = చేసినట్టి; ఆ = ఆ; పురంజన = పురంజనుడు అనెడి; పతివి = భర్తవి; అరయన్ = తరచిచూసిన; కావు = కావు; మఱియున్ = ఇంకను; నీవున్ = నీవు; అన్య = వేరే; సీమంతిని = స్త్రీవి; అనియునున్ = అని; చర్చింపన్ = విచారించగా; పూర్వ = పాత; జన్మము = జన్మము; అందున్ = లో; పురుషుండవు = పురుషుడవు; అనియునన్ = అని; = బుద్దిన్ = మనసులో; తలంచుట = భావించుట; అరయంగన్ = తరచిచూసిన; ఈ = ఈ; ఉభయమున్ = రెండును; అసత్యమున్ = నిజముకాదు; ఇంతయునున్ = ఇదియంతయు.
మామకీనము = నాచేచేయబడినది; ఐ = అయ్యి; ఎసగు = అతిశయించెడి; మాయన్ = మాయ; చేసి = వలన; కల్పితమున్ = కల్పింపబడినట్టిది; అయ్యెన్ = అయినది; చర్చింపన్ = తర్కించిచూసిన; మనము = మనము; పూర్వమున = పూర్వకాలమున; హంసలమ = హంసలమే; అని = అని; పూని = నిశ్చయముగా; ఎఱుగన్ = తెలియునట్లు; పలికితి = చెప్పితిని; తెలియుము = తెలిసికొనుము; మనల = మన యొక్క; రూపంబున్ = స్వరూపమును; చూడు = చూడుము.

భావము:

నీవు విదర్భరాజు పుత్రికవు కావు. ఈ మలయధ్వజుడు నీకు మగడు కాడు. పూర్వజన్మలో పురంలో నివసించిన ఆ పురంజనుడవు కావు. నీవు ఈ జన్మలో ఇతని భార్యను అని, పూర్వజన్మలో పురుషుడను అని అనుకోవటం కూడా అసత్యమే. ఇదంతా నేను నా మాయచేత సృష్టించాను. మనం ఇద్దరం పూర్వం హంసలం (పరమ పరిశుద్ధులం) అని చెప్పాను కదా! మన స్వరూపాన్ని చూడు.