పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

  •  
  •  
  •  

4-848-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్నెఱుగు దేని మనమున
న్నెఱుఁగక యున్న నైన ళినదళాక్షీ!
న్నుఁ బురాతన సఖుఁగా
నెన్నంగలదాన; వైన నెఱుఁగవె చెపుమా?

టీకా:

నన్నున్ = నన్ను; ఎఱుగుదు = తెలియుదువు; ఏని = అయినచో; మనమునన్ = మనసులో; నన్నున్ = నన్ను; ఎఱుగక = తెలియక; ఉన్నన్ = ఉండినట్లు; ఐనన్ = అయినను; నళినదళాక్షీ = స్త్రీ {నళినదళాక్షి - నళినము (పద్మము) దళ (రేకుల) వంటి అక్షి (కన్నులుగలామె), స్త్రీ}; నన్నున్ = నన్ను; పురాతన = పాతకాలపు; సఖున్ = స్నేహితునిగా; ఎన్నంగల = ఎంచగలిగిన; దానవు = దానివి; ఐనన్ = అయినచో; ఎఱుగవె = ఎరుగవా; చెపుమా = చెప్పుము.

భావము:

నీవు నన్ను ఎరిగినా, ఎరుగక పోయినా నన్ను పూర్వమిత్రునిగా తెలుసుకో.