పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

  •  
  •  
  •  

4-847-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యడిగి వెండియును ని
ట్లనియెను నీ సృష్టి పూర్వమందును నీ వె
వ్వనితోడి సఖ్య సౌఖ్యము
వరతము ననుభవించి ట్టి సఖుండన్.

టీకా:

అని = అని; అడిగి = అడిగి; వెండియునున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; ఈ = ఈ; సృష్టిన్ = సృష్టికి; పూర్వము = ముందు; అందున్ = సమయములో; నీవున్ = నీవు; ఎవ్వని = ఎవని; తోడన్ = తోటి; సఖ్య = స్నేహము యొక్క; సౌఖ్యముల్ = సౌఖ్యములు; అనవరతమున్ = ఎల్లప్పుడున్; అనుభవించితివి = అనుభవించితివో; అట్టి = అటువంటి; సఖుండన్ = స్నేహితుడను.

భావము:

అని ప్రశ్నించి ఇంకా ఇలా అన్నాడు “నేను నీ మిత్రుడను. ఈ సృష్టికి పూర్వం నీవు ఎవరి స్నేహంతో ఎడతెగని సౌఖ్యములను అనుభవించావో ఆ స్నేహితుడను నేను.