పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

  •  
  •  
  •  

4-846-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుదెంచి యత్తలోదరి
సుయోక్తుల ననునయించుచుం దగ ననియెన్
"వనితా! నీవెవ్వతె? వె
వ్వని దాన? వితం డెవండు? గచెద వేలా?"

టీకా:

చనుదెంచి = వచ్చి; ఆ = ఆ; తలోదరిన్ = స్త్రీని {తలోదరి - తల (సన్నని) ఉదరము కలామె, స్త్రీ}; సు = చక్కటి; నయ = మెత్తటి; ఉక్తులన్ = మాటలతో; అనునయించుచున్ = బుజ్జగించుతూ; తగన్ = తగినట్లు; అనియెన్ = పలికెను; వనితా = స్త్రీ; నీవున్ = నీవు; ఎవ్వతెవున్ = ఎవరివి; ఎవ్వనిదానవున్ = ఎవరి దానవు; ఇతండున్ = ఇతడు; ఎవండున్ = ఎవడు; వగచెదవున్ = దుఃఖించెదవు; ఏలా = ఎందులకు.

భావము:

వచ్చి ఆమెను మంచిమాటలతో ఓదారుస్తూ ఇలా అన్నాడు “వనితా! నీ వెవరు? ఎవరి దానవు? ఇత డెవరు? ఇతని కోసం ఎందుకు దుఃఖిస్తున్నావు?”