పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పురంజను కథ

  •  
  •  
  •  

4-742-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భూమీశ! విను మయ్య పూర్వకాలమునఁ బు-
రంజనుం డను నొక్క రాజు గలఁడు;
తని కవిజ్ఞాతుఁ నుపేరఁ దగిలి వి-
జ్ఞాతచేష్టితుఁ డగు ఖుఁడు కలఁడు;
పురంజనుఁడు పురాన్వేషియై ధరా-
క్రంబుఁ గలయంగ సంచరించి
కనురూపమై పెనుపొందు పుర మెందు-
వీక్షింపఁ జాలక విమనుఁ డగుచు

4-742.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నే పురము లుర్విఁ బొడఁగనె నా పురములు
గామములఁ గోరు తనకు న క్కామములను
బొందుటకు వానిని ననర్హములుగఁ దన మ
మునఁ దలఁచి యొకానొకనాఁ డతండు.
పురంజనుని కథ – వ్యాసం

టీకా:

భూమీశ = రాజా {భూమీశ - భూమికి ప్రభువు, రాజు}; వినుము = వినుము; అయ్య = తండ్రి; పూర్వ = పూర్వపు; కాలమునన్ = కాలములో; పురంజనుండును = పురంజనుడు {పురంజనుడు - పురమున (దేహమున) వసించెడివాడు (ఉండెడివాడు), జీవుడు, ఆత్మ}; అను = అనెడి; ఒక్క = ఒక; రాజున్ = రాజు; కలడు = ఉన్నాడు; అతనిన్ = అతని; కిన్ = కి; అవిజ్ఞాతుడు = అవిజ్ఞాతుడు {అవిజ్ఞాత- పరమాత్మ, అవిజ్ఞాత విష్ణుసహస్రనామాలలో 482వ నామం. తెలుసుకొనువాని కంటెను విలక్షణమైనవాడు అని అర్థం, ఆత్మ యందలి కల్పిత కర్తృత్వాది విజ్ఞాన వాసన కలవాడు విజ్ఞాత తద్విలక్షుణుడగు విష్ణువు అవిజ్ఞాత}; అను = అనెడి; పేరన్ = పేరుతో; తగిలి = పూని; విజ్ఞాత = తెలిసిన; చేష్టితుడు = చేష్టలుగలవాడు; అగు = అయిన; సఖుడున్ = స్నేహితుడు; కలడు = ఉన్నాడు; ఆ = ఆ; పురంజనుడు = పురంజనుడు; పుర = పురమును; అన్వేషి = వెదకెడివాడు; ఐ = అయ్యి; ధరా = భూ; చక్రంబున్ = మండలము; కలయంగన్ = కలియ; సంచరించి = తిరుగుతూ; తన = తన; కున్ = కు; అనురూపము = అనుకూలమైనది; ఐ = అయ్యి; పెనిపొందు = అతిశయించెడి; పురమున్ = పురము; ఎందున్ = ఎక్కడను; వీక్షింపజాలక = చూడలేక; విమనుడు = వికలమైనమనస్సుకలవాడు; అగుచున్ = అగుతూ; ఏ = ఏ.
పురముల్ = పురములు; ఉర్విన్ = భూమిని; పొడగనెన్ = కాంచెను; ఆ = ఆ; పురములు = పురములు; కామముల్ = కోరికలను; కోరు = కోరెడి; తన = తన; కున్ = కు; కామములను = కోరికలను; పొందుట = పొందుట; కున్ = కు; వానిని = వాటిని; అనర్హములుగన్ = తగినవి కానట్లుగ; తన = తన; మనమునన్ = మనసులో; తలచి = భావించి; ఒకానొక = ఒక్క; నాడున్ = దినమున; అతండున్ = అతడు.

భావము:

“రాజా! విను. పూర్వకాలంలో పురంజనుడు అనే రాజు ఉండేవాడు. అతనికి విజ్ఞాత చేష్టితుడైన అవిజ్ఞాతుడు అనే పేరు కలిగిన మిత్రుడు ఉండేవాడు. ఆ పురంజనుడు తనకోసం తగిన పురాన్ని అన్వేషిస్తూ భూమండలమంతా తిరిగి అటువంటి పురాన్ని ఎక్కడా చూడక వికల మనస్కుడై తాను భూమిమీద చూచిన పురాలు తన కోరికలను పొందటానికి తగినవి కావని మనస్సులో భావించి ఒకనాడు…

4-743-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చనుచున్న సమయంబున హిమవత్పర్వత దక్షిణసానువు లందు.

టీకా:

చనుచున్న = వెళుతున్న; సమయంబున = సమయములో; హిమవత్పర్వత = హిమాలయపర్వతము; దక్షిణ = దక్షిణవైపు; సానువులు = చరియలు; అందున్ = లో.

భావము:

తనకు తగిన పురంకోసం సంచరిస్తున్న్ సమయంలో హిమవత్పర్వతం దక్షిణ సానువులలో…

4-744-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర నవద్వార కవాట గవాక్ష తో-
ణ దేహళీగోపుముల నొప్పి
ప్రాకార యంత్రవప్రప్రతోళీ పరి-
ట్టాల కోపవనాళిఁ దనరి
సౌవర్ణ రౌప్యాయ ఘన శృంగంబుల-
మణీయ వివిధ గేముల మించి
థ్యాసభా చత్వధ్వజ క్రీడాయ-
న సుచైత్యాపణతిఁ దనర్చి

4-744.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రకతస్పటిక విదూరణి వినూత్న
మౌక్తికాయుత ఖచిత హర్మ్యములు గలిగి
విద్రుమద్రుమ వేదుల వెలయు నొక్క
పురముఁ గనియె భోగవతినిఁ బోలు దాని.

టీకా:

వర = శ్రేష్టమైన; నవ = తొమ్మిది; ద్వార = ద్వారములు; కవాట = తులుపులు; గవాక్ష = కిటికీలు; తోరణ = తోరణములు; దేహళీ = వాకిళ్ళు; గోపురములన్ = గోపురములతో; ఒప్పి = చక్కగనుండి; ప్రాకారయంత్ర = ప్రహారీయంత్రములు; వప్ర = బురుజులు; ప్రతోళీ = పెద్దవీధులు; పరిఘ = కందకములు; అట్టాలక = ప్రాకారములు; ఉపవనా = పెరటితోటలు; ఆళిన్ = సమూహములతో; తనరి = అతిశయించి; = సౌవర్ణ = బంగారపు; రౌప్య = వెండి; ఆయస = ఇనుప; ఘన = పెద్ద; శృంగంబుల = శిఖరములతో; రమణీయ = మనోహరమైన; వివధ = రకరకములైన; గేహములన్ = గృహములతో; మించి = అతిశయించి; రథ్యా = రథమార్గములు; సభా = కొలువుకూటములు; చత్వర = నాలుగుదార్ల వేగవంత మార్గములు; ధ్వజ = ధ్వజస్తంభములు; క్రీడాయతన = ఆటస్తలములు; సుచైత్య = మంచిఅరుగులు; అపణ = ధనము,భాగ్యముల (వస్తువుల); తతిన్ = సమూహములతో; తనర్చి = అతిశయించి.
మరకత = పచ్చలు; స్పటిక = స్పటికములు; విదూర = వైదూర్యములు; మణి = మణులు; వినూత్న = కొంగ్రొత్త; మౌక్తిక = ముత్యాలు; ఆయుత = సిద్దపరచిన; ఖచిత = పొదగబడిన; హర్మ్యములున్ = మేడలు; విద్రుమద్రుమ = పగడాలచెట్లు; వేదులన్ = అరుగులు; వెలయు = విలసిల్లెడి; ఒక్క = ఒక; పురమున్ = పురమును; కనియెన్ = చూసెను; భోగవతినిన్ = భోగవతీనగరమును {భోగవతి - భోగములకి నివాసము, భోగవతి అనెడి నాగలోకపు ముఖ్యపట్టణము}; పోలు = పోలెడి; దానిన్ = దానిని.

భావము:

తొమ్మిది ద్వారాలు, తలుపులు, కిటికీలు, బయటి ద్వారం, గుమ్మాలు, ప్రహరిపై యంత్రాలు, కోటగోడలు, పెద్ద వీథులు, కోట బురుజులు, ఉద్యానవనాలు, బంగారు వెండి ఇనుముతో చేసిన పెద్ద శిఖరాలతో మెరిసే సుందర గృహాలు, రాజమార్గాలు, కొలువు కూటాలు, చతుష్పథాలు, జెండా స్తంభాలు, జూదగృహాలు, రచ్చబండలు, అంగళ్ళు, పచ్చలు స్ఫటికాలు రత్నాలు మణులు క్రొత్త ముత్యాలు తాపిన మేడలు, పగడాలు కూర్చి కట్టిన తిన్నెలు మున్నగు సర్వలక్షణాలు కలిగి, నాగులపురమైన పాతాళంలాగా ఉన్న ఒక పురాన్ని చూశాడు.

4-745-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు గనుంగొని యనంతరంబ ముందటం బురబాహ్యాంతరంబున దివ్యద్రుమ లతాకుంజ పుంజంబును, సమద నదద్విహంగ మత్త మధుకరకుల కోలాహల సంకుల జలాశయ శోభితంబును, హిమనిర్ఝరబిందు సందోహ పరిస్పంద కందళిత మందమలయ మరుదుచ్ఛలిత ప్రవాళవిటప నళినీతటంబును, పాంథజన మనోరంజ నాహ్వాన బుద్ధిజనక కలహంస రాజకీర కోకిలాలాప విరాజమానంబును; మునివ్రత నానావిధ వనమృగవ్రాత బాధారహితంబును నైన పురబాహ్యోద్యానవనంబు నందు యాదృచ్ఛికంబుగ నేకైక శతనాయకం బైన యనుచర దశకంబును, బంచమస్తకసర్ప ప్రతీహారుండును, దోడరాఁ జనుదెంచుచున్న భర్త్రన్వేషిణియుం గామరూపిణియు నవోఢయు నయినట్టి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; కనుంగొని = చూసి; అనంతరంబ = తరువాత; ముందటన్ = ఎదురుగ; పుర = పురము యొక్క; బాహ్య = బయట; అంతరంబునన్ = ఆవరణము నందు; దివ్య = దివ్యమైన; ద్రుమ = చెట్లు; లతా = లతలు; కుంజ = పొదరిళ్ళ; పుంజంబునున్ = గుంపులు; సమతన్ = చక్కటి; నద = నదులు; విహంగ = పక్షులు; మత్త = మత్తెక్కిన; మధుకర = తేనెటీగలచే; కుల = సమూహముల; కోలాహల = కోలాహలములు; సంకుల = వ్యాపించిన; జలాశయ = సరస్సులతో; శోభితంబునున్ = శోభిల్లుతున్నది; హిమ = మంచు; నిర్ఝర = సెలయేళ్ళ; బిందు = నీటిబిందువుల; సందోహ = సమూహములు కలిగి; పరిస్పంద = కదలుతున్న; కందళిత = వికసించిన; మంద = మెల్లని; మలయ = గంధం చెట్లనుండి వస్తున్న; మరుత్ = గాలిచే; ఉచ్ఛలిత = ఊపబడుతున్న; ప్రవాళ = చిగురుటాకులు కలిగిన; విటప = చెట్లుగల; నళినీ = పద్మములు ఉన్న; తటంబును = చెరువులు; పాంథ = బాటసారులు యైన; జన = వారి; మనో = మనసును; రంజన = రంజిల్లజేయుటకు; ఆహ్వాన = పిలుస్తున్న; బుద్ధి = భావము; జనక = కలిగిస్తున్న; కలహంస = కలహంసలు; రాజకీర = రామచిలుకలు; కోకిల = కోకిలల; ఆలాప = పాటలతో; విరాజమానంబునున్ = విరాజిల్లుతున్నది; ముని = మునుల; వ్రత = సమూహములు; నానా =అనే; విధ = రకములైన; వన = అడవి; మృగ = జంతువుల; వ్రాత = సమూహముల; బాధా = బాధలు; రహితంబును = లేనిది; ఐన = అయిన; పుర = పురము యొక్క; బాహ్య = బయటి; ఉద్యానవనంబునన్ = తోటలో; అందున్ = లో; యాదృచ్ఛికంబు = అనుకోకుండగ; ఏకైక = ఒక్కొక్కరికి; శత = నూరుమందికి (100); నాయకంబున్ = నాయకత్వము కలిగినవారు; ఐన = అయిన; అనుచర = అనుచరుల; దశకంబును = పదిమంది కలది; పంచ = ఐదు (5); మస్తక = తలల; సర్ప = పాము యైన; ప్రతీహారుండును = ద్వారపాలకుడు; తోడన్ = కూడా సహాయకరముగ; రాన్ = వస్తుండగా; చనుదెంచుచున్న = వెళుతున్న; భర్తృ = భర్త యొక్క; అన్వేషియున్ = వెతుకుతున్నట్టి; కామరూపిణియున్ = కోరిన రూపము ధరించగలది; నవోఢయున్ = కొత్తగా యౌవనము కలిగినది; అయినట్టి = అయినట్టి.

భావము:

ఈ విధంగా చూచిన పురంజనుడు ఆ పురం వెలుపల దివ్య వృక్షాలతో నిండిన ఒక ఉద్యానవనంలో ప్రవేశించాడు. అక్కడ పక్షులు, తుమ్మెదలు చేసే ధ్వనులతో సరస్సులు కోలాహలంగా ఉన్నాయి. సెలయేళ్ళలోని మంచునీటి మీదుగా వచ్చే పిల్లగాలులకు కొలనుల ఒడ్డున ఉన్న చెట్ల కొమ్మలు, చిగుళ్ళు ఊగుతున్నాయి. బాటసారులను పిలుస్తున్నవేమో అన్నట్లుగా రాజహంసలు, చిలుకలు, కోయిలలు తియ్యగా కూస్తున్నాయి. పెక్కురకాల వన్యమృగాలు ఎవ్వరికీ హానిచేయకుండా తిరుగుతున్నాయి. ఆ తోటలో పురంజనుడు యాదృచ్ఛికంగా ఒక యువతిని చూశాడు. పదిమంది అనుచరులు ఆమెతో వస్తున్నారు. వారిలో ఒక్కొక్కడు నూరుమందికి నాయకుడు. ఆమెకు కావలిగా ఐదు తలల పాము ముందు నడుస్తున్నది. ఆ స్త్రీ కామరూపిణి. వరునికోసం వెదకుతున్నది.

4-746-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న సమవిన్యస్త ర్ణ కుండల రుచుల్-
గండభాగంబుల నిండి పర్వఁ
మ్మిఱేకులసిరిఁ టమటింపగఁ జాలు-
మెఱుఁగుఁ గన్నులు దలఁ దిరిగి రాఁగ
ఘన సంకలిత పిశంగ నీవీద్యుతి-
నక కాంచీరుచిఁ రము పెనుపఁ
ణ సరోజ భాసు చలన్నూపుర-
ణఝణ ధ్వని నర్మ రణిఁ జూప

4-746.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లిత యౌవన లక్ష్మీవిలాస భాసు
రోదయవ్యంజితప్రభాయుక్త పీన
మ నిరంతర కుచకుట్మముల వ్రీడఁ
జెంది పయ్యెదఁ గప్పు బాలేందుముఖిని.

టీకా:

ఘన = గొప్పగా; సమ = చక్కగా; విన్యస్త = పెట్టుకొన్న; కర్ణ = చెవుల; కుండల = కుండలముల; రుచుల్ = కాంతులు; గండభాగంబులన్ = చెక్కిళ్ళపైన; నిండి = నిండి; పర్వన్ = పరుచుకొనగా; తమ్మి = పద్మముల; ఱేకుల = రేకుల; సిరిన్ = శోభని; అటమటింపగన్ = తొట్రుపడవేయ; చాలు = కలిగిన; = మెఱుగు = మెరుస్తున్న; కన్నులు = కన్నులు; తలదిరిగిరాగ = తలచుట్టుతిరిగివచ్చినంతేసియై; జఘన = పిరుదులపై; సంకలిత = చక్కగాకట్టబడిన; పిశంగ = వంగపండురంగు; నీవీ = మొలకట్టు; కనక = బంగారపు; కాంచీ = ఒడ్డాణము; రుచిన్ = కాంతి; కరమున్ = మిక్కిలి; పెనుపన్ = అతిశయింపగా; చరణ = పాదములు అనెడి; సరోజ = పద్మములయొక్క; భాసుర = మెరుస్తున్న; చలత్ = చలిస్తున్న; నూపుర = అందెల; ఝణఝణ = ఝణఝణమనెడి; ధ్వని = శబ్దము; నర్మసరణిన్ = భావగర్భితముగ; చూపన్ = కనబడగా.
లలిత = అందమైన; యౌవన = యౌవన; లక్ష్మీ = శోభ; విలాస = లీలగా; భాసుర = ప్రకాశిస్తున్న; ఉదయ = సూర్యోదయమున; వ్యంజిత = వ్యక్తమగుతున్న; ప్రభా = కాంతులతో; యుక్త = కూడిన; పీన = బలిసిన; సమ = చక్కటి; నిరంతర = సందులేని; కుచ = కుచములనెడి; కుట్మములన్ = మొగ్గలను; వ్రీడన్ = సిగ్గు; చెంది = పడి; పయ్యెదన్ = పైటతో; కప్పు = కప్పెడి; బాలేందుముఖిని = స్త్రీని {బాలేందుముఖి - బాల ఇందు (బాల చంద్రుని వంటి) ముఖి (మోముకలామె), స్త్రీ}.

భావము:

ఆమె చెవికుండలాల కాంతి చెక్కిళ్ళపై వ్యాపిస్తున్నది. ఆమె కన్నులు తామరపూల రేకులవలె సోగలై తలను చుట్టి వస్తున్నాయి. ఆమె పిరుదులపై ధరించిన పసుపు పచ్చని వలువ బంగారు మొలనూలి కాంతిని అధికం చేస్తున్నది. ఆమె కాలి అందెల ఝణఝణ ధ్వనులు మేలమాడుతున్నట్లుగా ఉన్నాయి. యౌవనం వల్ల నిండుగా అందంగా ఉన్న చందోయి సిగ్గు పడుతూ పైటతో కప్పుతున్నది.

4-747-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియును బాలయు సుదతియు గజగామినియు నయిన యొక్క ప్రమదోత్తమం గాంచి.

టీకా:

మఱియును = ఇంకను; బాలయున్ = చిన్నపిల్ల యైన; సుదతి = స్త్రీ {సుదతి - మంచి పలువరుస కలామె, స్త్రీ}; గజగామిని = స్త్రీ {గజగామిని - ఏనుగువంటి నడక కలామె, స్త్రీ}; అయిన = అయిన; ఒక్క = ఒకామెను; ప్రమద = స్త్రీలలో {ప్రమద - మిక్కిలి యౌవన సంపద కలామె, స్త్రీ}; ఉత్తమన్ = ఉత్తమురాలిని; కాంచి = కనుగొని.

భావము:

వయస్సులో ఉండి మంచి పలువరుస గలిగి, గజగామిని అయిన ఆ ఉత్తమ స్త్రీని చూచి…

4-748-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మిడి ప్రేమోద్గతమై
రువిండ్లం బోలు కన్బొలు గల తరుణీ
సాపాంగ విలోకన
పరివిద్ధాంగుఁ డగచు నవిభుఁ డనియెన్.

టీకా:

తరిమిడి = బలవత్తరమైన; ప్రేమ = ప్రేమ; ఉద్గతము = వచ్చినది; ఐ = అయ్యి; మరు = మన్మథుని; విండ్లను = ధనుస్సుల; పోలు = వంటి; కన్బొమలు = కనుబొమలు; కల = కలిగిన; తరుణీ = స్త్రీ; సరస = రసస్ఫూర్తి గల; అపాంగ = కడకంటి; విలోకన = చూపు లనెడి; శర = బాణములచే; పరివిద్ధ = బాగా కొట్టబడిన; అంగుడు = దేహము కలవాడు; అగుచున్ = అగుతూ; జనవిభుడున్ = రాజు {జన విభుడు - జన (ప్రజల)కు విభుడు (ప్రభువు), రాజు}; అనియెన్ = పలికెను.

భావము:

కనుబొమలు మన్మథుని ధనుస్సువలె, కడకంటి చూపులు బాణాలవలె ఉన్న ఆమె చూపులు తన శరీరానికి తగిలి వలపు ఉద్భవించగా ఆ రాజు ఇలా అన్నాడు.

4-749-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఎవ్వరి దానవు? జనకుం
డెవ్వఁడు? పేరేమి? భృత్యు లీ పదియొక రిం
దెవ్వరు? సతు లెవ్వరు? మఱి
యివ్వనమున నుండఁ గార్యమెద్ది? మృగాక్షీ!

టీకా:

ఎవ్వరి = ఎవరికి చెందిన; దానవు = దానివి; జనకుండు = తండ్రి; ఎవ్వడు = ఎవడు; పేరు = పేరు; ఏమి = ఏమిటి; భృత్యుల్ = సేవకులు; ఈ = ఈ; పదియొకరు = పదకొండుమంది; ఇందు = వీరు; ఎవ్వరు = ఎవరు; సతులు = చెలికత్తెలు; ఎవ్వరు = ఎవరు; మఱి = మరింక; ఈ = ఈ; వనమునన్ = అడవిలో; ఉండన్ = ఉండుటకు; కార్యమున్ = కారణము, పని; ఎద్ది = ఏమిటి; మృగాక్షీ = స్త్రీ {మృగాక్షీ - లేడివంటి కన్నులు కలామె, స్త్రీ}.

భావము:

“మృగనయనా! నీవు ఎవ్వరి దానవు? నీ తండ్రి ఎవరు? నీ పేరేమిటి? ఈ పది మంది సేవకులు ఎవరు? ఈ స్త్రీలు ఎవ్వరు? ఈ అడవిలో ఎందుకున్నవు?

4-750-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దీయ పురస్సరుఁ డగు
నాశనుఁ డెవ్వఁ? డతికృపామతి నాకున్
విరింపు" మనుచు వెండియు
ళేక్షణఁ జూచి ధరణివుఁ డిట్లనియెన్.

టీకా:

భవదీయ = నీ యొక్క; పురస్సరుడు = ముందు నడచెడివాడు; అగు = అయిన; పవనాశనుడున్ = పాము {పవనాశుడు - పవనము (గాలి)ని అశనుడు (తినువాడు), పాము}; ఎవ్వడు = ఎవడు; అతి = మిక్కిలి; కృపా = దయా; మతిన్ = భావముతో; నాకున్ = నాకు; వివరింపుము = వివరముగా తెలుపుము; అనుచున్ = అంటూ; వెండియున్ = ఇంకను; ధవళేక్షణన్ = స్త్రీని {ధవళేక్షణ - ధవళ (తెల్లని, స్వచ్ఛమైన) ఈక్షణ (చూపులు ఉన్నామె), స్త్రీ}; చూచి = చూసి; ధరణిధవుడున్ = రాజు {ధరణిధవుడు - ధరణి (భూమి)కి ధవుడు (భర్త), రాజు}; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

నీ ముందు నడుస్తున్న ఈ పాము ఎవ్వరు? నాకు దయతో వివరించు” అని రాజు మళ్ళీ ఇలా అన్నాడు.

4-751-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రళాక్షి! పతి యగు ర్ము నన్వేషింపఁ-
రియించు హ్రీయను తివొ, కాక
రుద్రు నన్వేషించు రుద్రాణివో, కాక-
బ్రహ్మను వెదకు భాతివొ, కాక
నారాయణుని భక్తిఁ గోరి యన్వేషించు-
నిందిరవో, కాక యెవ్వ రీవు?
త్వత్పాద కామనత్వము నను సంప్రాప్త-
కల కాముండగు రసు నెట్టి

4-751.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వాని వెదకెదు? తరుణీ? భత్కరాగ్ర
ద్మకోశంబు నేఁ డెందుఁ తిత మయ్యె?
నాకు నెఱిఁగింపఁ దగుదు వివేచరిత!"
ని నృపాలుఁడు మఱియు నిట్లనియె సతికి.

టీకా:

తరళాక్షి = స్త్రీ {తరళేక్షణ - తరళ (చలించెడి) అక్షి (కన్నులుగలామె), స్త్రీ}; పతి = భర్త; అగు = అయిన; ధర్మున్ = ధర్మదేవతను; అన్వేషింపన్ = వెదకుటకు; చరియించు = తిరుగుతున్న; హ్రీ = హ్రీ; అను = అనెడి; సతివొ = సతివి ఏమో; కాక = కాకపోతే; రుద్రున్ = శివుని; అన్వేషించు = వెదికెడి; రుద్రాణివో = పార్వతీ దేవివి ఏమో {రుద్రాణి - రుద్రుని (శివుని) రాణి (భార్య), పార్వతి}; కాక = కాకపోతే; బ్రహ్మను = బ్రహ్మదేవుని; వెదకు = వెదకెడి; భారతివొ = భారతీదేవివి ఏమో; కాక = కాకపోతే; నారాయణుని = విష్ణుమూర్తిని; భక్తిన్ = భక్తితో; కోరి = కోరి; అన్వేషించు = వెదకెడి; ఇందిరవొ = లక్ష్మీదేవివి ఏమో; కాక = కాకపోతే; ఎవ్వరు = ఎవరు; ఈవు = నీవు; త్వత్ = నీ యొక్క; పాద = పాదములను; కామనత్వముననున్ = కోరుటలను; సంప్రాప్త = చక్కగా లభించెడి; సకల = సర్వమైన; కాముండు = కోరికలుకలవాడు; అగు = అయిన; సరసున్ = రసస్పూర్తిగలవానిని; ఎట్టి = ఎటువంటి.
వానిన్ = వానిని; వెదకెదు = వెదుకుతున్నావు; తరుణీ = స్త్రీ {తరుణి - తరుణ వయసున ఉన్నామె, స్త్రీ}; భవత్ = నీ యొక్క; కరాగ్ర = అరచేతిలో గల; పద్మ = పద్మము; కోశంబున్ = మొగ్గ; నేడు = ఈ నాడు; ఎందు = ఎక్కడ; పతితము = పడినది; అయ్యెన్ = అయ్యెను; నాకున్ = నాకు; ఎఱిగింపన్ = తెలుపుటకు; తగుదు = అర్హత కలవాడిని; వివేకచరిత = వివేకము కలిగి వర్తించెడియామె; అని = అని; నృపాలుడు = రాజు {నృపాలుడు - నృ (నరులకు) పాలుడు (పాలించెడివాడు), రాజు}; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; సతి = స్త్రీ; కిన్ = కి.

భావము:

“చంచలాక్షీ! నీవు ధర్ముని భర్తగా కోరి వెదుకుతున్న హ్రీవా? లేక పరమశివుని వెదికే పార్వతివా? బ్రహ్మను వెదికే భారతివా? శ్రీహరిని వెదికే శ్రీదేవివా? నీ వెవరవు? నీ పాదాలను కోరిన రసికుడు సకల కామాలను పొందుతాడు కదా! నీవు వెదికే సరసు డెవరు? ఓ యౌవ్వనవతీ! వివేకము గలదానా! నీ చేతిలోని కలువమొగ్గ నేడు ఎక్కడ పడింది? ఇవన్నీ నాకు తెలియజెప్పుము.” అని ఆ రాజు మరల ఆ స్త్రీతో ఇలా అన్నాడు.

4-752-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"క మొప్పఁగ నీ విటు భూ
వగుటను హ్రీవి శివవు శారదవును సా
కన్యవుఁ గాకుండుటఁ
రుణీ! పొడగంటి" నని పదంపడి పలికెన్.

టీకా:

కరము = మిక్కిలి; ఒప్పగా = చక్కగా; నీవు = నీవు; ఇటు = ఇలా; భూచరవు = నేలపై తిరిగెడి యామెవు; అగుటను = అగుటచేత; హ్రీవిన్ = హ్రీవి; శివవున్ = పార్వతీ దేవివి; శారదవున్ = శారదవును; సాగరకన్యవున్ = లక్షీదేవివి; కాకుండుటన్ = కాకపోవుటను; తరుణీ = స్త్రీ; = పొడగంటిని = కనుగొంటిని; అని = అని; పదంపడి = అటు పైన; పలికెన్ = పలికెను.

భావము:

“నీవు నేలపై అడుగులు మోపి తిరుగుతున్నందున నీవు హ్రీవి, పార్వతివి, సరస్వతివి, లక్ష్మివి కావు అని గ్రహించాను” అని మళ్ళీ ఇలా అన్నాడు.

4-753-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మొనసి యదభ్రకర్ముఁడ నైన నాచేత-
నిపుడు పాలితమైన యీ పురంబు
రసిజోదరుని భుజాపాలితోదాత్త-
లిత వైకుంఠ మలంకరించు
నిందిరా సుందరి చందంబునను నీ వ-
లంకరింపఁ గడంగు పంకజాక్షి!
ది గాక తావకీనాపాంగరుచి మోహి-
తాంతరంగుండ నైట్టి నన్ను

4-753.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హిత సవ్రీడభావ సన్మందహాస
చారు విభ్రమ భ్రూలతా ప్రేరితుఁడుగఁ
నరు భగవంతుఁ డగునట్టి నసిజుండు
డఁతి! యుడుగక పీడింపఁ దొడఁగె నిపుడు.

టీకా:

మొనసి = పూని; అదభ్ర = విస్తారమైన; కర్ముడను = కర్మలను చేయువాడను; ఐన = అయిన; నా = నా; చేతన్ = చేత; ఇపుడున్ = ఇప్పుడు; పాలితమున్ = పాలింపబడుతున్నది; ఐన = అయిన; ఈ = ఈ; పురంబున్ = పురమును; సరసీజోదరునిన్ = విష్ణుని {సరసిజోదరుడు - సరసిజము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు}; భుజా = భుజబలముతో; పాలిత = పాలింపబడుతున్న; ఉదాత్త = గొప్పది; లలిత = అందమైన; వైకుంఠమున్ = వైకుంఠమును; అలంకరించు = అలంకరించెడి; ఇందిరాసుందరి = లక్ష్మీదేవి; చందంబుననున్ = వలె; నీవున్ = నీవు; అలంకరింపన్ = అలంకరించుటకు; కడంగు = పూనుకొనుము; పంకజాక్షి = స్త్రీ {పంకజాక్షి - పంకజము (పద్మము)లవంటి అక్షి (కన్నులుగలామె), స్త్రీ}; అది = అదే; కాక = కాకుండగ; తావకీన = నీ యొక్క; అపాంగ = కడకంటిచూపు యొక్క; రుచిన్ = అందము వలన; మోహిత = మోహింపబడిన; అంతరంగుండను = మనసుకలవాడను; ఐన = అయిన; అట్టి = అటువంటి; నన్నున్ = నన్ము.
మహిత = గొప్ప; సవ్రీడ = సిగ్గుతోకూడిన; భావ = భావముగల; సత్ = మంచి; మందహాస = చిరునవ్వులతో; చారు = అందముగా; విభ్రమ = చలిస్తున్న; భ్రూ = కనుబొమలు యనెడి; లతా = లతలచే; ప్రేరితుడుగన్ = ప్రేరేపింపబడినవానిగా; తనరు = అతిశయించెడి; భగవంతుడు = మహాత్మ్యముగలవాడు; అగునట్టి = అయినట్టి; మనసిజుండు = మన్మథుడు; పడతి = స్తీ; ఉడుగుక = వదలక; పీడింపన్ = పీడించుట; తొడగె = మొదలిడెను; ఇపుడున్ = ఇప్పుడు.

భావము:

“కమలాక్షీ! విష్ణువు పాలించే వైకుంఠాన్ని లక్ష్మీదేవి అలంకరించినట్లు నేను పరిపాలించే ఈ పురాన్ని నీవు అలంకరించు. నీ కడగంటి చూపుల కాంతికి నా మనస్సు లొంగిపోయింది. నీ సిగ్గు, చిరునవ్వు, విలాసాలను వెదజల్లే కనుబొమల చేత పురుకొల్పబడిన మన్మథుడు నన్ను బాధిస్తున్నాడు.

4-754-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున.

టీకా:

కావునన్ = అందుచేత.

భావము:

కనుక…

4-755-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుణి! సుతారలోచన యుతంబును మంజుసుధాసమానభా
సు మృదువాక్య యుక్తమును శోభిత కోమల లంబమాన సుం
చికురాభిరామము నుదారము నైన భవన్ముఖాబ్జమున్
సురుచిరలీల నెత్తి ననుఁ జూడుము; సిగ్గును జెంద నేటికిన్?"

టీకా:

తరుణి = స్త్రీ {తరుణి - తరుణ వయసున యున్నామె, స్త్రీ}; సుతార = సున్నితమైన; లోచన = చూపులు; యుతంబునున్ = కలిగినది; మంజు = మనోజ్ఞమైన; సుధా = అమృతమునకు; సమాన = సమానమైన; భాసుర = ప్రకాశించెడి; మృదు = మృదువైన; వాక్య = మాటలతో; యుక్తమును = కూడినది; శోభిత = శోభిల్లుతున్న; కోమల = సుకుమారమైన; లంబమాన = పొడుగైన; సుందర = అందమైన; చికుర = ముంగురులతో; అభిరామమునున్ = చక్కనైనది; ఉదారమున్ = విస్తారమైనది; ఐన = అయినట్టి; భవత్ = నీ యొక్క; ముఖ = మోము అనెడి; అబ్జమున్ = పద్మముతో; సు = చక్కటి; రుచిర = ప్రీతికరమైన; లీలన్ = విధముగ; ననున్ = నన్ను; చూడుము = చూడుము; సిగ్గున్ = సిగ్గును; చెందన్ = పడుట; ఏటికిన్ = ఎందులకు.

భావము:

పడతీ! కమనీయమైన కనీనికలు గల కన్నులతో, అమృతంలాగా తీయనైన పలుకులతో, పొడవైన తలవెంట్రుకలతో, సొగసులు విరజిమ్మే నీ ముఖ పద్మాన్ని ఎత్తి నా వంక చూడు. సిగ్గు పడకు”.

4-756-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యివ్విధంబున నధీరుండై పలుకు పురంజనుం జూచి యా ప్రమదోత్తమ వీరమోహితయై సస్మితానన యగుచు నానందంబునొంది యిట్లనియె.

టీకా:

అని = అని; ఇవ్విధంబునన్ = ఈ విధముగ; అధీరుండు = ధైర్యము లేనివాడు. చంచలుడు; ఐ = అయ్యి; పలుకు = పలికెడి; పురంజనున్ = పురంజనుని {పురంజనుడు - పురమున (దేహమున) వసించెడివాడు (ఉండెడివాడు), జీవుడు, ఆత్మ}; చూచి = చూసి; ఆ = ఆ; ప్రమద = స్త్రీలలో {ప్రమద - యౌవ్వనాది మదము గలామె, స్త్రీ}; ఉత్తమ = ఉత్తమురాలు; వీరమోహిత = మిక్కిలి మోహములో పడినది; ఐ = అయ్యి; సస్మిత = నవ్వు కలిగిన; ఆనన = మోము కలిగినది; అగుచున్ = అగుచూ; ఆనందంబున్ = ఆనందమును; ఒంది = పొంది; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

అని ఈ విధంగా ధైర్యాన్ని కోల్పోయి పలుకుతున్న వీరుడైన పురంజనుని చూచి, వలచి, చిరునవ్వు చిందిస్తూ ఆమె ఇలా అన్నది.

4-757-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"పురుషవర! నాకు నీకును
గురువును నామమును గులముఁ గోరి యెఱుఁగ నీ
పుమున నుండుదుఁగా; కీ
పుమును నిర్మించి నట్టి పురుషు నెఱుంగన్!

టీకా:

పురుష = పురుషులలో; వర = ఉత్తముడ; నాకున్ = నాకు; నీకునున్ = నీకును; గురువును = గురువు; నామమున్ = పేరు; కులమున్ = కులము; కోరి = యత్నించిన; ఎఱుంగన్ = నాకు తెలియదు; ఈ = ఈ; పురమునన్ = పురములో; ఉండుదున్ = ఉంటాను; కాక = కాని; ఈ = ఈ; పురమున్ = పురమును; నిర్మించిన = సృష్టించిన; అట్టి = అటువంటి; పురుషున్ = పురుషుని; ఎఱుంగన్ = తెలియను.

భావము:

“పురుషశ్రేష్ఠా! నన్ను, నిన్ను ఎవరు సృష్టించారో నాకు తెలియదు. నీకూ, నాకూ, కులమూ, పేరూ ఏర్పరచిన వారెవరో నాకు తెలియదు. నేను ఈ పురంలో ఉంటాను. కాని ఈ పురాన్ని ఎవరు నిర్మించారో నాకు తెలియదు.

4-758-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వీలు నా సఖు లీ లల
నాత్నము లార్యవినుత !నా చెలు; లీ వృ
ద్దోగ మే నిద్రింపఁగ
ధీత మేల్కాంచి పురము ధృతిఁ బాలించున్.

టీకా:

వీరలు = వీరు; నా = నా; సఖులు = సఖులు; ఈ = ఈ; లలనా = స్త్రీలలో {లలన - విలసనశీల యైనామె, స్త్రీ}; రత్నములు = రత్నముల వంటివారు; ఆర్యవినుత = పెద్దలు మెచ్చుకొనెడి వాడ; నా = నా యొక్క; చెలులు = చెలికత్తెలు; వృద్ధ = ముసలి; ఉరగమున్ = పాము; ఏన్ = నేను; నిద్రింపగన్ = నిద్రించినపుడు; ధీరతన్ = ధీశక్తితో; మేల్కాంచి = మెళకువగా నుండి; పురమున్ = పురమును; ధృతిన్ = పూని; పాలించున్ = కాపాడును.

భావము:

ఈ పురుషులు నా స్నేహితులు. ఈ స్త్రీలు నా చెలికత్తెలు. ఈ ముసలి పాము నేను నిద్రించినప్పుడూ మేల్కొని ఉండి పురాన్ని రక్షిస్తుంది”.

4-759-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెండియు నిట్లనియె.

టీకా:

వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఇంకా ఇలా అన్నది.

4-760-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుజ నాయక; నీవు ద్భాగ్య వశమున-
నిటకు నేతెంచితి; విపుడు నీకు
మంగళంబగు; నీవు హితేంద్రియగ్రామ-
భోగ్యంబులగు కామపుంజములను
ర్థి సంపాదింతు; నఘాత్మ; యీ నవ-
ద్వార ప్రయుక్త మై నరు పురము
నీవు గైకొని యేలు; నీ కంటె దీనికి-
ధిపుఁ డన్యుండు లేఁ నఘ; యిందు

4-760.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దుపనీతములైన కాముల ననుభ
వింపఁగా సమాశత మధిష్టింపు మెలమిఁ;
గోరి నీకంటెఁ బ్రియులు నెవ్వారు నాకు?
రసి చూడంగ మనుజేంద్ర; దియుఁ గాక.

టీకా:

మనుజనాయక = రాజా {మనుజనాయక - మనుజ (మనువుకిపుట్టినవారు, మానవుల) యొక్క నాయకుడు, రాజు}; నీవున్ = నీవు; మత్ = నా యొక్క; భాగ్య = అదృష్టము; వశమున = వలన; ఇట = ఇక్కడ; కున్ = కి; ఏతెంచితివి = వచ్చితివి; ఇపుడున్ = ఇప్పుడు; నీ = నీ; కున్ = కు; మంగళంబున్ = శుభములు; అగు = కలుగును; నీవున్ = నీవు; మహిత = గొప్ప; ఇంద్రియ = ఇంద్రియముల; గ్రామ = సమూహములచే; భోగ్యంబులున్ = అనుభవించదగినవి; అగు = అయినట్టి; కామ = కోరికల; పుంజములు = సమూహములను; అర్థిన్ = కోరి; సంపాదింతువు = పొందెదవు; అనఘాత్మ = పుణ్యాత్మ; ఈ = ఈ; నవ = తొమ్మిది; ద్వార = గుమ్మములచే; ప్రయుక్తము = చక్కగాకలది; ఐ = అయ్యి; తనరున్ = అతిశయించెడి; పురమున్ = పురము; నీవున్ = నీవు; కైకొని = పూని; ఏలున్ = పాలించుటకు; నీ = నీ; కంటెన్ = కంటే; దీని = దీని; కిన్ = కి; అధిపుడు = గొప్పవాడు; అన్యుడు = ఇతరుడు; లేడు = లేడు; అనఘ = పుణ్యుడా; ఇందున్ = దీనిలో.
మత్ = నాచేత; ఉపనీతంబులు = తీసుకొనిరాబడినవి; ఐన = అయినట్టి; కామమములను = కోరికలను; అనుభవింపగా = అనుభవించుటకు; సమాశతమున్ = వందేళ్ళు; అధిష్టింపుము = ఆశ్రయించి యుండుము; కోరి = పూని; నీ = నీ; కంటెని = కంటే; ప్రియులు = ఇష్టమైనవారు; ఎవ్వారు = ఇంక ఎవరు; నాకున్ = నాకు; అరసి = తరచి; చూడంగ = చూచినచో; మనుజేంద్ర = రాజా {మనుజేంద్రుడు - మనుజుల (మానవుల)లో ఇంద్రునివంటి వాడు, రాజు}; అదియున్ = అంతే; కాక = కాకుండగ.

భావము:

“రాజా! నా అదృష్టం వల్ల నీవు ఇక్కడికి వచ్చావు. నీకు శుభం కలుగుతుంది. నీవు ఇంద్రియాలచేత అనుభవింపదగిన సుఖాలను పొందుతావు. తొమ్మిది ద్వారాలు కలిగిన ఈ పురాన్ని నీవు స్వీకరించి పరిపాలించు. ఇందుకు నీకంటె తగిన రాజు మరొకడు లేడు. నేను అందించే సౌఖ్యాలను ఈ పురంలో నూరేండ్లు అనుభవించు. నీకంటె నాకు ఇష్టులైనవారు లేరు. అంతేకాక…

4-761-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు రతిజ్ఞాన విహీనుండు నకోవిదుండు నిహపరచింతాశూన్యుండుఁ బశుప్రాయుండుఁ ద్వదన్యుండు నైన వాని నెవ్వని వరియింతు? గృహస్థాశ్రమమందు ధర్మార్థ కామ మోక్ష ప్రజానందంబులును యశంబును యతివేద్యంబులు గాని రజస్తమో విహీన పుణ్యలోకంబులును గలుగు; పితృ దేవర్షి మర్త్య భూతగణంబులకుం దనకు నీ లోకంబున గృహస్థాశ్రమంబు సర్వక్షేమార్థం బయిన యాశ్రమంబండ్రు; గావున వదాన్యుండవు, వీరవిఖ్యాతుండవుఁ, బ్రియదర్శనుండవు, స్వయంప్రాప్తుండవు నయి భోగి భోగ సదృశ భుజాదండంబులచే నొప్పు భవాదృశుం దగిలి మాదృశ యగు కన్య వరియింపకుండునే” యని వెండియు.

టీకా:

మఱియున్ = ఇంకను; రతి = రతి; జ్ఞాన = జ్ఞానము; విహీనుడునున్ = లేనివాడు; అకోవిదుండును = నైపుణ్యములేనివాడు; ఇహ = భూలోకేచ్ఛలందు; పర = లగ్నమైన; చింత = వలపు; శూన్యుండు = లేనివాడు; పశు = పశువుతో; ప్రాయుడు = సమానమైనవాడు; త్వత్ = నీకంటె; అన్యుండున్ = ఇతరమైనవాడు; ఐన = అయినట్టి; వానిన్ = వీనిని; ఎవ్వనిన్ = ఎవనిని; వరియింతున్ = వరించెదను; గృహస్థాశ్రమమున్ = గృహస్థాశ్రమము; అందున్ = లో; ధర్మ = ధర్మము; అర్థ = సంపదలు; కామ = కోరికలు; మోక్ష = ముక్తి; ప్రజా = సంతానము; ఆనందంబులును = సంతోషములును; యశంబును = కీర్తి; అతి = మిక్కిలి; వేద్యంబులుకాని = తెలియుటకు వీలుకాని; రజః = రజోగుణము; తమః = తమోగుణము; విహీన = లేనట్టి; పుణ్య = పుణ్యవంతమైన; లోకంబులునున్ = లోకములును; కలుగున్ = కలుగును; పితృ = పితృదేవతలు, పితరులు; దేవర్షి = దేవఋషులు; మర్త్య = మానవులు; భూత = జంతు; గణంబుల్ = సమూహముల; కున్ = కు; తన = తన; కున్ = కి; ఈ = ఈ; లోకంబునన్ = లోకములో; గృహస్థాశ్రమంబున్ = గృహస్థాశ్రమము; సర్వ = అఖిల; క్షేమ = శుభములు; అర్థంబున్ = కలిగించెడిది; అయిన = అయినట్టి; ఆశ్రమంబున్ = ఆశ్రమము; అండ్రు = అంటారు; కావున = అందుచేత; వదాన్యుండవు = దాతవు; వీరవిఖ్యాతుండవు = వీరునిగా ప్రసిద్ధిపొందిన వాడవు; ప్రియ దర్శనుండవు = ప్రీతిగా చూచువాడవు; స్వయంప్రాప్తుండవు = తనంతతాను కలిగిన వాడవు; అయి = అయ్యి; భోగి = భోగములను, పాము; భోగ = అనుభవించుటకు, పడగ; సదృశ = వంటి; భుజా = భుజములు అనెడి; దండంబుల = దండముల; చేన్ = చేత; భవ = నీ; ఆదృశుని = వంటివానిని; మా = మా; దృశ = వంటివారు; అగు = అయిన; కన్య = స్త్రీ; వరియింపకుండునే = వరింపదా ఏమి; అని = అని; వెండియున్ = ఇంకను.

భావము:

నిన్ను కాదని రతిజ్ఞానం లేనివాడు, పండితుడు కానివాడు, ఇహపర చింతాశూన్యుడు, పశుప్రాయుడు అయిన మరొకని ఎలా వరిస్తాను? గృహస్థాశ్రమంలో ధర్మార్థ కామమోక్షాలు, సంతాన సుఖం, కీర్తి, రజస్తమస్సులు లేని పుణ్యలోకాలు లభిస్తాయి. పితృదేవతలకు, దేవర్షులకు, మానవులకు, భూతగణాలకు, తనకు గృహస్థాశ్రమం ఈ లోకంలో సర్వక్షేమాలు కలిగించే ఆశ్రమం అని అంటారు. కాబట్టి దాతవు, వీరుడవు, సుందరుడవు, స్వయంగా లభించినవాడవు, సర్పాల వంటి భుజదండాలు కలిగినవాడవు అయిన నిన్ను నావంటి కన్య వరించకుండా ఎలా ఉండగలదు?” అని మళ్ళీ ఇలా అన్నది.

4-762-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కరుణారస పరిపూర్ణ
స్ఫురితస్మిత రుచి విలోక పుంజముచేతం
మర్థి దీన జన భయ
ణుఁడవై సంచరింపు ఖిల జగములన్. "

టీకా:

కరుణా = దయా; రస = రసము; పరిపూర్ణ = నిండుగా; స్ఫురిత = స్ఫురించెడి; స్మిత = చిరునవ్వుల; రుచిన్ = కాంతితో; విలోక = చక్కటి చూపుల; పుంజము = సమూహము; చేతన్ = వలన; కరమున్ = మిక్కిలి; అర్థిన్ = కోరి; దీన = దీనులైన; జన = వారి; భయ = భయమును; హరణుడవు = పోగొట్టువాడవు; ఐ = అయ్యి; సంచరింపుము = చక్కగా తిరుగుము; అఖిల = సమస్తమైన; జగములన్ = లోకములను.

భావము:

“కరుణారసంతో నిండి, చిరునవ్వు కాంతులు విరజిమ్మే చూపులతో దిక్కులేనివారి భయాన్ని తొలగిస్తూ సర్వలోకాలలో విహరించు”.

4-763-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యీ గతిఁ బలికిన యా
జాక్షిఁ బురంజనుండు రియించి ముదం
బు నన్యోన్యప్రీతిం
రుచుఁ దత్పురము చొచ్చి న్యుం డగుచున్

టీకా:

అని = అని; ఈ = ఈ; గతిన్ = విధముగ; పలికిన = పలుకగా; ఆ = ఆ; వనజాక్షిన్ = స్త్రీని {వనజాక్షి - వనజము (పద్మముల వంటి) అక్షి (కన్ను గలామె), స్త్రీ}; పురంజనుండు = పురంజనుడు {పురంజనుడు - పురమున (దేహమున) వసించెడివాడు (ఉండెడివాడు), జీవుడు, ఆత్మ}; వరియించి = వరించి; ముదంబునన్ = సంతోషముతో; అన్యోన్య = ఒకరినొకరు; ప్రీతిన్ = ప్రేమ యందు; తనరుచున్ = అతిశయించుచున్; తత్ = ఆ; పురమున్ = పురమును; = చొచ్చి = ప్రవేశించి; ధన్యుండు = భాగ్యవంతుడు; అగుచున్ = అవుతూ.

భావము:

అని ఈ విధంగా పలికిన ఆ స్త్రీని పురంజనుడు వరించాడు. వారిద్దరూ ఒకరిపై ఒకరు ప్రీతి కలవారై ఆ పట్టణంలో ప్రవేశించారు.

4-764-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సమకాల మప్పురి నస్రము భూరిసమస్త సౌఖ్య సం
తులఁ దనర్చి వందిజన గాయక సద్వినుతోరు గాన మో
ది మతి నొప్పి సుందరసతీ జనసేవితుఁడై నృపాల కో
చి లలితస్థలంబుల వసించుచుఁ గ్రీడలు సల్పుచుండఁగన్.

టీకా:

శత = వంద (100); సమ = సంవత్సరముల; కాలమున్ = కాలము; ఆ = ఆ; పురిన్ = పురమున; అజస్రము = ఎల్లప్పుడు; భూరి = అత్యధికమైన {భూరి - అతి పెద్ధసంఖ్య 1 తరవాత 34 సున్నాలు కలది అదే లక్ష అయితే 5 సున్నాలు మాత్రమే}; సమస్త = సమస్తమైన; సౌఖ్య = సుఖకరమైన; సంగతులన్ = సాంగత్యము లందు; తనర్చి = అతిశయించి; వంది = స్తోత్రము చేయు; జన = వారు; గాయక = సంగీతము పాడెడివారి యొక్క; సత్ = చక్కగా; వినుత = వినబడెడి; ఉరు = గొప్ప; గాన = గానములచే; మోదిత = సంతోషించిన; మతిన్ = మనసుతో; ఒప్పి = ఒప్పియుండి; సుందర = అందమైన; సతీజన = స్త్రీజనముచే; సేవితుండు = సేవింపపడినవాడు; ఐ = అయ్యి; నృపాల = రాజులకు; ఉచిత = తగిన; లలిత = సుందరమైన; స్థలంబులన్ = ప్రదేశములలో; వసించుచున్ = ఉంటూ; క్రీడలు = సుఖించుట; సలుపుచుండగన్ = చేయుచుండగా.

భావము:

పురంజనుడు ఆ పురంలో సర్వసౌఖ్యాలు పొందుతూ, వందిమాగధుల గానాలను విని సంతోషిస్తూ, అందగత్తెల సేవలు అందుకుంటూ, రాజులకు తగిన సుందర ప్రదేశాలలో నివసిస్తూ వంద సంవత్సరాలు క్రీడించాడు.

4-765-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాథుఁడు లోకభయం
గతి వర్తించు గ్రీష్మకాలము దోఁపం
ళ లహరీ మనోహర
హ్రాదిని సలిలమందు సియించెఁ దగన్.

టీకా:

నరనాథుడు = రాజు {నర నాథుడు - నరులకు నాథుడు (పాలించువాడు), రాజు}; లోక = లోకములకు; భయంకర = భయము గొలిపెడి; గతిన్ = విధముగ; వర్తించు = నడచెడి; గ్రీష్మ = వేసవి; కాలమున్ = కాలము; తోపన్ = తెలియుచుండగా; తరళ = చలిస్తున్న; లహరీ = అలలతో; మనోహర = అందమైన; వర = చక్కటి; హ్రాదినిన్ = సరసు నందలి; సలిలము = నీటి; అందున్ = లో; వసియించెన్ = నివసించెను; తగన్ = చక్కగా.

భావము:

అంతలో లోక భీకరమైన వేసవి కాలం వచ్చింది. పురంజనుడు తళతళ మెరుస్తున్న కెరటాలతో మనస్సుకు విందు చేస్తున్న ఏటినీటిలో ప్రవేశించాడు.

4-766-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వసియించి కతిపయి దినంబు లరుగు సమయంబున.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; వసియించి = నివసించి; కతిపయి = కొన్ని; దినంబులు = దినములు; అరుగు = జరిగిన; సమయంబునన్ = సమయమునందు.

భావము:

ఈ విధంగా జీవిస్తూ కొద్ది రోజుల తరువాత…

4-767-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వనీశ్వరోత్తమ! ప్పురంబున నాల్గు-
వంకలనున్న గవఁకులు వినుము
తూర్పు దిక్కునకు నైదును దక్షిణోత్తరం-
బుల రెండుఁ బశ్చిమంబు నను రెండు
గాఁగ నా తొమ్మిది వఁకుల నుపరి ది-
క్కున నేఁడు గ్రింది దిక్కునను రెండు
యి యుండు; మఱి వాని యందుఁ పృథగ్విధ-
విషయ గత్యర్థమై వెలయు నీశ్వ

4-767.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుం డొకం డరయఁ గలండు రూఢిఁ దత్పు
రంబుఁ బాలించునట్టి పురంజనుండు
నా పురద్వార నవకంబు; నందులోన
ర్థిఁ బ్రాగ్ద్వార పంచకమందు వరుస.

టీకా:

అవనీశ్వర = రాజులలో {అవనీశ్వరుడు - అవని (భూమి)కి ఈశ్వరుడు (ప్రభువు), రాజు}; ఉత్తమ = ఉత్తముడ; ఆ = ఆ; పురంబునన్ = పురములో; నాల్గు = నాలుగు (4); వంకలన్ = వైపులను; ఉన్న = ఉన్నట్టి; గవకులు = ద్వారములు; వినుము = వినుము; తూర్పు = తూర్పు; దిక్కునన్ = వైపున; ఐదును = అయిదు (5); దక్షిణ = దక్షిణపు; ఉత్తరంబులన్ = ఉత్తపు వైపున; రెండు = రెండు (2); పశ్చిమంబుననున్ = పశ్చిమము వైపున; రెండు = రెండు (2); కాగన్ = అగునట్లు; ఆ = ఆ; తొమ్మిది = తొమ్మిది (9); గవకులన్ = ద్వారములలోను; ఉపరి = పై; దిక్కునన్ = వైపున; ఏడున్ = ఏడు (7); క్రింద = కింది; దిక్కుననున్ = వైపున; రెండున్ = రెండు (2); అయి = అయ్యి; ఉండున్ = ఉండును; మఱి = ఇంక; వాని = దాని; అందున్ = లో; పృథక్ = విస్తారమైన; విధ = విధములైన; విషయ = ఇంద్రియార్థముల; గతిన్ = వర్తనను; అర్థము = పొందుట కొరకు; ఐ = అయ్యి; వెలయున్ = విలసిల్లెడి; ఈశ్వరుండు = ప్రభువు; ఒకండు = ఒకడు; అరయన్ = తరచిచూసిన; కలండు = ఉండెను.
రూఢిన్ = నమ్మకముగ; తత్ = ఆ; పురంబున్ = పురమును; పాలించున్ = పరిపాలించుండెడు; అట్టి = అటువంటి; పురంజనుండున్ = పురంజనుడు; ఆ = ఆ; పుర = పురము యొక్క; ద్వార = ద్వారముల; నవకంబున్ = తొమ్మిదింటి (9); అందులోననన్ = అందలోను; అర్తిన్ = కోరి; ప్రాక్ = పశ్చిమము వైపు; ద్వార = ద్వారముల; పంచక = ఐదింటి (5); అందున్ = లోను; వరుసన్ = క్రమముగా.

భావము:

రాజా! ఆ పురంలో తూర్పున ఐదు, దక్షిణాన ఒకటి, ఉత్తరాన ఒకటి, పడమట రెండు, ఈ విధంగా నాలుగు దిక్కులలో మొత్తం తొమ్మిది ద్వారాలు ఉన్నాయి. ఆ తొమ్మిది ద్వారాలలో పై భాగంలో ఏడు, క్రింది భాగంలో రెండు ఉన్నాయి. అందులో వేరువేరుగా విషయాలను పొందటానికి ఒక పురుషుడు ఉన్నాడు. అతడు ఆ పురాన్ని పరిపాలించే పురంజనుడు.

4-768-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఖద్యోతయు హవిర్ముఖియు నను నామంబులుగల ద్వారయుగంబున ద్యుమత్సఖుఁడై విభ్రాజితాఖ్య జనపదంబును బొందు; వెండియు నళినియు నాళినియు నను పేళ్ళు గల వాకిళ్లు రెంటి యందు నవధూత సఖుండై సౌరభరూపంబు లయిన విషయంబులం బొందు; మఱియు ముఖ్యానామకం బైన ప్రధాన ప్రాగ్ద్వారంబున రసజ్ఞ విపణాన్వితుండై యాపణబహూదనంబులను విషయంబులనొందు; బితృహూ నామకం బయిన దక్షిణ ద్వారంబున శ్రుతధరాన్వితుం డై దక్షిణ పాంచాలంబను రాష్ట్రంబు నొందు; దేవహూ నామకంబయిన యుత్తరపు వాకిట శ్రుతధరాన్వితుండై యుత్తర పాంచాలంబను రాష్ట్రంబు నొందు; వెండియుం బడమటి వాకిళ్ళు రెంటియందు నాసురీ నామకం బైన వాకిట దుర్మదసమేతుండై గ్రామక నామకంబైన విషయంబును, నిరృతి నామకం బయిన వాకిటయందు లుబ్దక యుక్తుండై వైశసం బను విషయంబు నొందుచుండు; వెండియుం బురంజనుం డప్పురంబునం బౌరజనంబులందు నిర్వాక్పేశస్కరులను నిద్దఱంధులు గలరు; వారలచేత గమన కరణంబులను క్రియల నొందుచు నంతఃపురగతుం డగు నప్పుడు విషూచీ సమన్వితుండై జాయాత్మజోద్భవంబు లైన మోహ ప్రసాద హర్షంబుల నొందుచుండు; నివ్విధంబునం గర్మాసక్తుండుఁ గామాసక్తుండునై బుద్ధియను మహిషిచేత వంచితుం డయ్యె; నక్కామినియు.

టీకా:

ఖద్యోతయున్ = ఖద్యోత {ఖద్యోత - ఖ (ఆకాశము, అవకాశము, సమస్తము) జ్యోత (వెలిగించెడిది, చూపెడిది), నల్లగుడ్డు}; హవిర్ముఖియున్ = హవిర్ముఖి {హవిర్ముఖి - హవిస్ (ధరించెడి) ముఖి (ముఖ్య కార్యముగా కలది, ఆకారము కలది), తెల్లగుడ్డు}; అను = అనెడి; నామంబులున్ = పేర్లు; కల = కలిగిన; ద్వార = ద్వారముల; యుగంబున్ = ద్వయము (2); ద్యుమత్సఖుడు = ద్యుమత్సఖుడు {ద్యుమత్సఖుడు - ద్యుమత్ (వెలుగు) అనెడి సఖుడు (స్నేహితుడు)}; ఐ = అయ్యి; విభ్రాజిత = విభ్రాజితము అనెడి {విభ్రాజితము - మిక్కిలి రాజిత మగుట, వెలుగొందుట}; ఆఖ్య = పేరు కలిగిన; జనపదంబున్ = ఊరును; పొందున్ = పొందును; వెండియున్ = ఇంకను; నళినియున్ = నళిని; నాళినియున్ = నాళిని; అను = అనెడి; పేళ్ళు = పేర్లు; కల = కలిగిన; వాకిళ్ళు = వీధిగుమ్మములు; రెంటి = రెండింటి; అందున్ = లోను; అవధూత = అవధూత అనెడి; సఖుండు = స్నేహితుడు కలవాడు; ఐ = అయ్యి; సౌరభ = వాసనల; రూపంబులన్ = రూపములు గలవి; అయిన = అయిన; విషయంబులన్ = విషయములు, విషయార్థములను; పొందున్ = పొందును; మఱియున్ = ఇంకను; ముఖ్య = ముఖ్య అనెడి, నోరు అనెడి; నామకంబున్ = పేరు గలది; ఐన = అయిన; ప్రథాన = ముఖ్యమైన; ప్రాక్ = తూర్పు; ద్వారంబునన్ = ద్వారము నందు; రసజ్ఞ = రసజ్ఞ అనెడి, రుచిజ్ఞానమును; విపణా = అంగడి, అందించెడివాని; సమాన్వితుండు = కూడినవాడు; ఐ = అయ్యి; ఆపణ = ఆపణ, అన్నము {అపణ - అమ్మకూడనిది, అన్నము}; బహూదనంబులును = బహూదనము, పానీయము; అను = అనెడి; విషయంబులన్ = విషయములు, విషయార్థములను; పొందున్ = పొందును; పితృహూ = పితృహూ {పితృహూ - పితృదేవతలను ఆహ్వానించెడిది}; నామకంబున్ = పేరు కలది; అయిన = అయిన; దక్షిణ = దక్షిణపు; ద్వారంబునన్ = ద్వారము నందు; శ్రుతధర యనెడి = శ్రుతధరుడు యనెడి {శ్రుతధరుడు - శ్రుతులను (వేదములను, వినుటను) ధరించినవాడు}; ఆన్వితుండు = కూడినవాడు; ఐ = అయ్యి; దక్షిణ = దక్షిణపు; పాంచాలంబు = పాంచాలము {పాంచాల - పంచేంద్రియములు ప్రసరించ గలుగు ప్రదేశములు}; అను = అనెడి; రాష్ట్రంబున్ = దేశమును; ఒందున్ = పొందును; దేవహూ = దేవహూ యనెడి {దేవహూ - దేవతలను పిలుచుట}; నామకంబున్ = పేరుకలది; అయిన = అయినట్టి; ఉత్తరపు = ఉత్తరపు; వాకిటన్ = వాకిట్లో; శ్రుతధర యనెడి = శ్రుతధరుడు యనెడి {శ్రుతధరుడు - శ్రుతులను (వేదములను, వినుటను) ధరించినవాడు}; ఆన్వితుండు = కూడినవాడు; ఉత్తరపాంచాలంబున్ = ఉత్తరపాంచాలము; అను = అనెడి; రాష్ట్రంబున్ = దేశమును; ఒందున్ = పొందును; వెండియున్ = ఇంకను; పడమటి = పశ్చిమవైపు; వాకిళ్ళు = వాకిళ్ళలో; రెంటి = రెండిటి; అందున్ = లోను; ఆసురీ = ఆసురి యనెడి {ఆసురి - (అసుర సంబంధ) రాక్షసపు లక్షణములు కలది}; నామకంబున్ = పేరుకలది; ఐ = అయ్యి; వాకిటన్ = వాకిట్లో; దుర్మద = దుర్మద యనెడివాని {దుర్మద - దుర్ (చెడ్డది) మద (మదము) కలది}; సమేతుండు = కూడినవాడు; గ్రామక = గ్రామక అనెడి {గ్రామకము - మోటుతనము, సురతము}; నామకంబున్ = పేరు కలది; ఐన = అయిన; విషయంబున్ = విషయములను; నిరృతి = నిరృతి యనెడి; నామకంబున్ = పేరుకలది; అయిన = అయిన; వాకిటన్ = వాకిట్లో; లుబ్దక = పిసినిగొట్టువానితో; యుక్తుండు = కూడినవాడు; ఐ = అయ్యి; వైశసంబునున్ = వైశసంబు, విసర్జకంబు; అను = అనెడి; విషయంబున్ = విషయమును; ఒందుచుండు = పొందుచుండు; వెండియున్ = ఇంకను; పురంజనుండు = పురంజనుడు {పురంజనుడు - పురమున (దేహమున) వసించెడివాడు (ఉండెడివాడు), జీవుడు, ఆత్మ}; ఆ = ఆ; పురంబునన్ = పురమున; పౌర = పురమున నుండెడి {పౌరులు – పురమున నుండెడివారు}; జనంబుల్ = వారి; అందున్ = అందు; నిర్వక్పేశస్కరులున్ = నిర్వక్పేశస్కరులు {నిర్వక్పేశస్కరులు - నిర్వక్ (మూగవాడు) పేశస్కరుడు (కుంటివాడు)}; అను = అనెడి; ఇద్ధఱు = ఇద్దరు; అంధులున్ = గుడ్డివారు; కలరు = ఉండిరి; వారలన్ = వారి; చేతన్ = వలన; గమన = నడచుట; కరణంబులునున్ = పనిచేయుట; అను = అనెడి; క్రియలన్ = పనులను; ఒందుచున్ = పొందుతూ; అంతఃపుర = అంతఃపురమునకు (మనసు); గతుండు = వెళ్లువాడు; అగు = అయిన; అప్పుడు = సమయము నందు; విషూచి = ప్రమదోత్తమతో {విషూచి - మనసు, విష్వచ్ఛ, విషూచీన, (విష అంటే వ్యాపతౌ, వాచస్పతం) అన్ని వైపులకు (పరిపరి విధాల) పోవునది.}; సమన్వితుడు = కూడినవాడు; ఐ = అయ్యి; జాయా = భార్య; ఆత్మజ = బిడ్డల వలన; ఉద్భవంబులున్ = కలిగినవి; ఐన = అయిన; మోహ = మోహములు; ప్రసాద = అనుకూలతలు; హర్షంబులు = సంతోములు; ఒందుచుండు = పొందుతుండును; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; కర్మా = కర్మలు యెడ; ఆసక్తుండున్ = ఆసక్తి కలవాడు; కామ = కామముల యెడ; ఆసక్తుండున్ = ఆసక్తి కలవాడు; ఐ = అయ్యి; బుద్ధి = బుద్ధి; అను = అనెడి; మహిషి = పట్టపురాణి; చేతన్ = వలన; వంచితుడు = వంచన చేయబడినవాడు; అయ్యెన్ = అయ్యెను; ఆ = ఆ; కామినియున్ = స్త్రీ {కామిని – కామముల యందు ఆసక్తి కలామె, స్త్రీ}.

భావము:

ఖద్యోతం, హవిర్ముఖి అనే రెండు తూర్పు ద్వారాలు ఒక్కచోట ఉంటాయి. ఆ పురుషుడు ద్యుమంతుడు అనే చెలికాని తోడ్పాటుతో ఆ ద్వారాలలో నుండి విభ్రాజితం అనే జనపదానికి వెళ్ళుతుంటాడు. నళిని, నాళిని అనే రెండు తూర్పు ద్వారాలు ఒక్కచొట ఉంటాయి. వాటినుండి అవధూత అనే స్నేహితుని తోడ్పాటుతో సౌరభం అనే విషయానికి వెళ్ళుతుంటాడు. తూర్పున ఉన్న ప్రధాన ద్వారం పేరు ముఖ్య. అది ఒక్కటే ఒకచోట ఉంటుంది. ఆ పురరాజు రసజ్ఞుడు, విషణుడు అనే మిత్రుల తోడ్పాటుతో ఆపణ బహూదనాలు అనే విషయాలకు పోతూ ఉంటాడు. దక్షిణ ద్వారం పేరు పితృహువు. శ్రుతధరునితో కూడి దానినుండి దక్షిణ పాంచాలం అనే రాష్ట్రానికి పోతుంటాడు. ఆసురి అనే పడమటి వాకిలినుండి దుర్మదునితో కూడి గ్రామకం అనే దేశానికి పోతుంటాడు. నిరృతి అనే పడమటి వాకిలి నుండి లుబ్ధకునితో కూడి వైశసం అనే విషయానికి వెళ్ళుతుంటాడు. దేవహువు అనే పేరు కల్గిన ఉత్తరపు వాకిలినుండి శ్రుతధరునితో కూడి ఉత్తర పాంచాలం అనే రాష్ట్రానికి పోతుంటాడు. పురంజనుడు ఆ పురంలోని పౌరులలో నిర్వాక్కు, పేశస్కరుడు అనే ఇద్దరు గ్రుడ్డివారి సాయంతో గమనం, కరణం అనే పనులను నెరవేరుస్తాడు. అంతఃపురంలో ఉన్నప్పుడు విషూచి (ప్రమదోత్తమ)తో కూడి (కలిసి) భార్యాపుత్రుల వల్ల కలిగిన మోహ ప్రసాద హర్షాలను పొందుతుంటాడు. ఈ విధంగా పురంజనుడు కామాసక్తుడై కామసాధనాలైన కర్మలలో తగుల్కొని బుద్ధి అనే పట్టపుదేవి చేత మోసగింపబడ్డాడు.

4-769-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పానంబు చేసినఁ దానుఁ బానము చేయుఁ-
గుడిచినఁ దానును గుడుచు; మఱియు
క్షింపఁ దానును క్షించు; నడచిన-
డచును; నవ్విన వ్వు; నేడ్వ
నేడుచుఁ; బాడినఁ బాడు; విన్నను వినుఁ-
జూచినఁ జూచుఁ; గూర్చున్న నుండు;
దుఃఖింప దీనుఁడై దుఃఖించు; నిలిచిన-
నిలుచు; నిద్రింపఁగ నిద్రబోవు;

4-769.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ముట్టినను ముట్టు; మూర్కొన్న మూరు కొనును;
లుకఁ బలుకును; బవళింపఁ వ్వళించు;
ర్షమును బొంద నాత్మను ర్ష మొందు;
మోదమును బొందఁ దానును మోద మందు.

టీకా:

పానంబున్ = తాగుట; చేసినన్ = చేసినచో; తానునున్ = తను కూడ; పానమున్ = తాగుట; చేయున్ = చేయును; కుడిచినన్ = తినినచో; తానునున్ = తను కూడ; కుడుచున్ = తినును; మఱియున్ = ఇంకను; భక్షింపన్ = భక్షించినచో; తానునున్ = తను కూడ; భక్షించున్ = భక్షించును; నడచినన్ = మడచినచో; నడచును = నడచును; నవ్వినన్ = నవ్వినచో; నవ్వున్ = నవ్వును; ఏడ్వన్ = ఏడ్చినచో; ఏడుచున్ = ఏడుచును; పాడినన్ = పాడినచో; పాడున్ = పాడును; విన్నున్ = విన్నచో; వినున్ = వినును; చూచినన్ = చూచినచో; చూచున్ = చూచును; కూర్చున్నన్ = కూర్చొనినచో; ఉండు = ఉండును; = దుఃఖింపన్ = దుఃఖించినచో; దీనుడు = దీనమైనవాడు; ఐ = అయ్యి; దుఃఖించున్ = దుఃఖించును; నిలిచినన్ = నిలిచినచో; నిలుచున్ = నిలబడును; నిద్రింపన్ = నిద్రించినచో; నిద్రపోవున్ = నిద్రపోవును.
ముట్టినన్ = ముట్టుకొన్నచో; ముట్టు = ముట్టుకొనును; మూర్కొన్నన్ = వాసనచూసిన; మూరుకొనును = వాసనచూసును; పలుకన్ = మాట్లాడిన; పలుకున్ = మాట్లాడును; పవ్వళింపన్ = పడుకొనిన; పవ్వళించున్ = పడుకొనును; = హర్షమును = సంతోషమును; పొందన్ = పొందినచో; ఆత్మను = తనుకూడ; హర్షమున్ = సంతోషమును; ఒందున్ = పొందును; మోదమునున్ = ఆనందమును; పొందన్ = పొందినచో; తానునున్ = తనుకూడ; మోదమున్ = ఆనందమును; అందున్ = పొందును.

భావము:

పురంజనుడి రాణి అతను త్రాగితే తాను త్రాగుతుంది. అతను భుజిస్తే తాను భుజిస్తుంది. నవ్వితే నవ్వుతుంది. ఏడిస్తే ఏడుస్తుంది. పాడితే పాడుతుంది. వింటే వింటుంది. చూస్తే చూస్తుంది. కూర్చుంటే కూర్చుంటుంది. దుఃఖిస్తే దుఃఖిస్తుంది. నిలబడితే నిలబడుతుంది. నిద్రిస్తే నిదురిస్తుంది. ముట్టుకుంటే ముట్టుకుంటుంది. వాసన చూస్తే వాసన చూస్తుంది. పలికితే పలుకుతుంది. పవళిస్తే పవళిస్తుంది. అతను సంతోషిస్తే ఆమె సంతోషిస్తుంది.

4-770-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇవ్విధంబున నతండు మహిషీ విప్రలబ్ధుండును వంచిత స్వభావుండును నై పారవశ్యంబునంజేసి యజ్ఞుండును నితరేచ్ఛా విరహితుండును నై క్రీడామృగంబు చాడ్పున వర్తించుచు నా పురంబునఁ గాపురంబుండఁ గొన్ని దినంబుల కా పురంజనుం డొకానొక దినంబున ధనుర్ధరుండై.

టీకా:

ఈ = ఈ; విధంబునన్ = విధముగా; అతండు = అతడు; మహిషి = పట్టపురాణిచేత; విప్రలబ్ధుండును = మిక్కిలి మోసగింపబడిన వాడు; వంచిత = మోసగించెడి; స్వభావుండును = స్వభావము కలవాడును; ఐ = అయ్యి; పారవశ్యంబునన్ = పరవశత; చేసి = వలన; అజ్ఞుండును = తెలివిలేని వాడును; ఇతర = మరియొక; ఇచ్ఛా = కోరిక; విరహితుండును = లేనివాడును; ఐ = అయ్యి; క్రీడా = పెంపుడు; మృగంబున్ = జంతువు; చాడ్పునన్ = విధముగా; వర్తించుచున్ = తిరుగుతూ; ఆ = ఆ; పురంబునన్ = పురమునందు; కాపురంబున్ = కాపురము; ఉండన్ = ఉండగా; కొన్ని = కొన్ని; దినంబుల్ = దినముల; కున్ = కి; ఆ = ఆ; పురంజనుండు = పురంజనుడు; ఒకానొక = ఒకానొక; దినంబునన్ = దినమున; ధనుర్ధరుండు = ధనుస్సు; ధరుండు = ధరించినవాడు; ఐ = అయ్యి.

భావము:

ఈ విధంగా అతడు రాణి చేత మోసగింపబడి పరవశం చేత అజ్ఞానుడై, మరే ఇతర కోరిక లేనివాడై పెంపుడు జంతువు వలె ఆ పురంలో తిరుగుతూ నివసిస్తూ కొన్ని దినాలకు ధనుస్సును ధరించి….

4-771-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పంచాశ్వ యుక్తంబు పంచ బంధనముఁ జ-
క్రద్వితయమును యుద్వయంబు
నాశు వేగంబు నేకాక్షంబు కూబర-
ద్వయముఁ బతాకాత్రియ యుతంబు
నేక రశ్మి యుతంబు నేకసారథికంబు-
ప్తవరూథంబు స్వర్ణ భూష
మును బంచ విక్రమమును నేక నీడంబుఁ-
బ్రకట పంచప్రహణము నయిన

4-771.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

థము కాంచన రచిత వర్మము ధరించి
విస దక్షయ తూణీర లితుఁ డగుచుఁ
డఁక దీపింప నెక్కి యేకాదశప్ర
సంఖ్య సేనాసమేతుఁడై రభసముగ.

టీకా:

పంచ = అయిదు (5); అశ్వ = గుర్రములు {పంచాశ్వములు - పంచజ్ఞానేంద్రియములు}; యుక్తంబున్ = కలిగినది; పంచ = అయిదు (5); బంధనమున్ = కట్లు కలది {పంచబంధనములు - పంచప్రాణములు}; చక్ర = చక్రములు {చక్రద్వితయము - పాపపుణ్యములు}; ద్వితయమునున్ = రెండు (2) కలిగినది; యుగ = కాడులు {యుగద్వయము - 1సంవత్సరము 2వయస్సులు}; ద్వయంబును = రెండు (2) కలిగినది; ఆశువేగంబున్ = మిక్కిలివేగము {ఆశువేగము - ఆశుగము(వాయు) వేగము}; ఏకాక్షంబున్ = ఒకేపోలుగర్ర గలది (1) {ఏకాక్షము - పోలుకర్ర, ప్రధానము, మాయ}; కూబర = యుగములు, గూడులు {కూబర ద్వయము - 1శోక 2మోహములు}; ద్వయమును = రెండు (2) కలిగినది; పతాకా = జెండాలు {పతాకాత్రితయము - 1సత్త్వ 2రజస్ 3 తమస్ అనెడి త్రిగుణములు}; త్రితయ = మూటిని(3); యుతంబునున్ = కలిగినది; ఏక = ఒకటే(1); రశ్మి = పగ్గము {ఏకరశ్మి - మనసు}; యుతంబునున్ = కలిగినది; ఏక = ఒకేఒక (1); సారథికంబున్ = సారథికలగినది {ఏక సారథి - బుద్ధి}; సప్త = ఏడు (7); వరూధంబున్ = కవచములుకలిగినది {సప్తవరూధము - సప్తధాతువులు}; స్వర్ణ = బంగారు; భూషమునున్ = అలంకారముకలిగినది {భూషము - స్వాప్నికమైన విచిత్ర సృష్టి}; పంచ = అయిదు (5); విక్రమమున్ = నడకలుకలిగినది {పంచవిక్రమము - పంచేంద్రియ ఇంద్రియముల వ్యాపారము}; ఏక = ఒకేఒక; నీడంబునున్ = నీడముకలది {నీడము - రధముపై రధికుడు కూర్చుండు చోటు, హృదయము}; ప్రకట = ప్రసిద్దముగ; పంచ = అయిదు (5); ప్రహరణమున్ = ఆయుధములు కలిగినది {ప్రహరణములు ఐదు - పంచకర్మేంద్రియములు}; అయిన = అయిన.
రథమున్ = రథమును {రథము - దేహము}; కాంచన = బంగారముతో {బంగారము - రజోగుణము}; రచిత = చేయబడిన; వర్మము = కవచముకలిగినది; ధరించి = పూని; విలసత్ = విలసిల్లుతున్న; అక్షయ = తరుగని; తూణీర = అమ్ములపొది {అక్షయ తూణీరము - అనంత వాసనా రూపమైన అహంకార ఉపాధి}; కలితుడు = కలిగినవాడు; అగుచున్ = అవుతూ; కడకన్ = పట్టుదల; దీపింపన్ = ప్రకాశించుతుండగా; ఎక్కి = ఎక్కి; ఏకాదశ = పదకొండు (11); ప్రసంఖ్య = ప్రసంఖ్యలుగల {ప్రసంఖ్యల సేనలు - పదకొండు ఇంద్రియ వృత్తులు}; సేనా = సేనలుతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; సరభసముగ = త్వరితముతోకూడి {సరభసము - కాలము}.

భావము:

ఐదు గుర్రాలు (పంచ జ్ఞానేంద్రియాలు), ఐదు కట్లు (పంచ బంధనాలు / పంచప్రాణాలు), రెండు చక్రాలు (పాప పుణ్యాలు), రెండు యుగాలు (ఒక సంవత్సరం, రెండు వయస్సులు), వాయువేగం, ఒక పోలుగర్ర (మాయ), రెండు నొగళ్ళు (శోక మోహాలు), మూడు ధ్వజాలు (సత్త్వరజస్తమో గుణాలు), ఒక పగ్గం (మనస్సు), ఒక సారథి (బుద్ధి), ఏడు కవచాలు (సప్త ధాతువులు), బంగారు నగలు (స్వాప్నికమైన విచిత్ర సృష్టి), ఐదు నడకలు (పంచేంద్రియ వ్యాపారం), ఒక గూడు (హృదయం) కలిగిన రథాన్ని (దేహాన్ని) అధిరోహించి, బంగారు కవచాన్ని ధరించి, అక్షయమైన అమ్ములపొదిని (అనంత వాసనా రూపమైన అహంకార ఉపాధిని) కలిగి పదకొండు సేనలతో (ఇంద్రియ వృత్తులతో) కూడి వేగంగా….

4-772-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పురంబు వెడలి పంచప్రస్థంబను వనంబునకుం జని యందు విడువరాని మహిషిని విడిచి మృగయాసక్తుండై దృప్తుండగుచు ధనుర్బాణంబులు ధరియించి సంచరించుచు నాసుర వర్తనంబునం దగిలి ఘోరాత్ముండు నదయుండునై నిశాతసాయకంబుల చేత నమ్మృగ వ్రాతంబులం బరిమార్చె; రాజులకు మృగయా వినోదంబు విహితానుష్ఠానం బగుచుండ నాసురవృత్తి యెట్లయ్యె; నని యంటివేని; నిది రాగ ప్రాప్తం బగుటను విహితంబుగాదు; వినుము; శ్రాద్ధాదులందే ప్రఖ్యాత శ్రాద్ధదివసంబుల యందే రాజైన వాఁడే, మేధ్యంబులయిన పశువులనే వనంబునందే యధోపయుక్తంబుగానే వధియింపంజను నను నియమ మాత్రంబు గలదు; గావున జ్ఞాని యైన విద్వాంసుం డాచరింపడు; గాక యాచరించినం గర్మానుష్ఠానజనితంబయిన జ్ఞానంబునం జేసి యందుఁ బొరయం; డట్లుగాక నియమోల్లంఘనంబునం గర్మాచరణుం డగువాఁ డభిమానంబు నొంది కర్మబద్ధుండై గుణప్రవాహ పతితుండును నష్టప్రజ్ఞుండునునై యధోగతిం గూలు; నిట్లగుటం జేసి సాధుజనులకు సర్వప్రకారంబుల నాసురవృత్తి మానం దగు” నని వెండియు నిట్లనియె “నంతం బురంజనుం డవ్వనంబున.

టీకా:

పురంబున్ = పురమును; వెడలి = వెలువడి; పంచప్రస్థంబున్ = పంచప్రస్థము {పంచప్రస్థము - పంచేద్రియము ప్రవృత్తులు}; అను = అనెడి; వనంబున్ = అడవి; కున్ = కి; చని = వెళ్ళి; అందున్ = దానికోసము; విడువరాని = విడువకూడని; మహిషిని = భార్యను {మహిషి - స్వంతబుద్ధి}; విడిచి = వదలి; మృగయా = వేట యందు; ఆసక్తుండు = ఆసక్తి కలవాడు; అయ్యి = అయ్యి; తృప్తుండు = తృప్తి పొందిన వాడు; అగుచున్ = ఔతూ; ధనుర్బాణంబులు = విల్లమ్ములు; ధరియించి = ధరించి; సంచరించుచున్ = తిరుగుతూ; ఆసుర = రాక్షస (క్రూరమైన); వర్తనంబునన్ = ప్రవర్తనములను; తగిలి = తగుల్కొని; ఘోర = ఘోరమైన; ఆత్మకుండున్ = మనసు కలవాడు; అదయుండున్ = దయమాలినవాడు; ఐ = అయ్యి; నిశాత = వాడియైన; సాయకంబుల్ = బాణములతో; ఆ = ఆ; మృగ = జంతు; వ్రాతంబులన్ = జాలమును; పరిమార్చె = సంహరించెను; రాజుల్ = రాజుల; కున్ = కు; మృగయా = వేటయనెడి; వినోదము = క్రీడ; విహిత = విధింపబడిన; అనుష్ఠానంబున్ = కర్మము; అగుచుండన్ = అవుతుండగా; ఆసుర = రాక్షస (క్రూరమైన); వృత్తి = విధానము; ఎట్లు = ఏ విధముగ; అయ్యెన్ = అయినది; అని = అని; అంటివేని = అన్నట్లయితో; రాగ = ఆసక్తి; ప్రాప్తంబున్ = కలిగినది; అగుటను = అగుటచేత; విహితంబు = పద్ధతి; కాదు = కాదు; వినుము = వినుము; శ్రాద్ధా = శ్రద్ధగా చేయవలసిన పితృకర్మలు; ఆదులు = మొదలగువాని; అందే = లోమాత్రమే; ప్రఖ్యాత = ప్రసిద్దమైన; శ్రాద్ధ = పితృకర్మలు చేసెడి; దివసంబులన్ = దినములు; అందే = లోమాత్రమే; రాజు = రాజు; ఐన = అయిన; వాడే = వాడు మాత్రమే; మేధ్యంబులు = యజ్ఞమునకు తగినవి; అయిన = అయిన; పశువులనే = పశువులను మాత్రమే; వనంబున్ = అడవి; అందే = లోమాత్రమే; యధా = అవసరానుసారము; ఉపయక్తంబుగానే = ఉపయోగమునకు తగినట్లు మాత్రమే; వధియింపన్ = సంహరించుటకు; చనును = తగినది; అను = అనెడి; నియమమాత్రంబున్ = నియమము; కలదు = ఉన్నది; కావున = అందుచేత; జ్ఞాని = జ్ఞానము కలవాడు; ఐన = అయిన; విద్వాంసుడు = పండితుడు; ఆచరింపడు = చేయడు; కాక = అలాకాక; ఆచరించినన్ = చేసినచో; కర్మ = వేదకర్మలను; అనుష్ఠాన = అనుసరించుచుండుటచే; జనితంబున్ = కలిగినది; అయిన = అయినట్టి; జ్ఞానంబునన్ = జ్ఞానము; చేసి = వలన; అందున్ = దానిలో; పొరయండు = పొందడు; అట్లు = ఆ విధముగా; కాక = కాకుండగ; నియమ = నియమమును; ఉల్లంఘనంబునన్ = దాటెడి; కర్మా = పనులను; ఆచరణుండు = చేయువాడు; అగు = అయిన; వాడు = వాడు; అభిమానంబున్ = ఆసక్తమును; ఒంది = పొంది; కర్మ = కర్మలకు; బద్దుండు = బంధింపబడినవాడు; ఐ = అయ్యి; గుణ = గుణములనెడి; ప్రవాహ = ప్రవాహమునందు; పతితుండును = పడిపోయినవాడు; నష్ట = పోయిన; ప్రజ్ఞుండునున్ = ప్రజ్ఞకలవాడు; ఐ = అయ్యి; అధోగతిన్ = అదోగతిని, నరకమున; కూలున్ = కూలిపోవును; ఇట్లు = ఈ విధముగ; అగుటన్ = అగుట; చేసి = వలన; సాధు = మంచి; జనుల్ = వారి; కున్ = కి; సర్వ = సకల; ప్రకారంబులన్ = విధములుగను; ఆసుర = రాక్షస (క్రూరమైన); వృత్తి = విధానము; మానన్ = మానుటకు; తగును = తగినది; అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; అంతన్ = అంతట; పురంజనుండు = పురంజనుడు; ఆ = ఆ; వనంబునన్ = అడవిలో.

భావము:

పురం నుండి బయలుదేరి పంచప్రస్థం (పంచేంద్రియ ప్రవృత్తులు) అనే అడవికి వెళ్ళి, వేటలో ఆసక్తితో విడువరాని భార్యను (స్వంత బుద్ధిని) విడిచి, ధనుర్బాణాలు ధరించి తిరుగుతూ రాక్షస ప్రవృత్తితో, క్రూర చిత్తంతో, ఘోరమైన మనస్సు కలవాడై దయ లేకుండ వాడి బాణాలతో జంతువులను సంహరించాడు. ‘రాజులకు వేట విధింపబడిన ఆచారమే కదా! అది రాక్షస ప్రవృత్తి ఎలా అయింది?’ అని అంటావేమో! విను. రాజులు లాలసతో వేటాడరాదు. సామాన్య నిత్య శ్రాద్ధాది సమయాలలో కాక, ప్రఖ్యాతాలైన శ్రాద్ధ దినాలలో మాత్రమే మేధ్య పశువులను మాత్రమే, వనాలలోనే, రాజు మాత్రమే, కావలసినన్ని మాత్రమే చంపాలి అన్న నియమం ఉంది. కాబట్టి జ్ఞాని అయిన విద్వాంసుడు నియమాన్ని బట్టి నడుచుకుంటాడు. కర్మాచరణం వల్ల పుట్టిన జ్ఞానం చేత ఆ కర్మను పొందడు. అలా కాకుండా నియమం మీరి నడిచేవాడు, కర్తృత్వాభిమానాన్ని పొంది కర్మబద్ధుడై ప్రజ్ఞ చెడి సంసార ప్రవాహంలో పడి అధోగతి పాలవుతాడు. అందుచేత సత్పురుషులు అన్ని విధాల రాక్షస ప్రవర్తనను మానుకోవాలి” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. “అప్పుడా పురంజనుడు ఆ అడవిలో…

4-773-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చిత్ర పక్ష సునిశిత
ములచే శశ వరాహ మరీ రురు కా
గవయ శల్య హరిణీ
రి హరి వృక పుండరీక పి ఖడ్గములన్.

టీకా:

వర = ఉత్తమమైన; చిత్ర = విచిత్రమైన; పక్ష = రెక్కలు కలిగిన; నిశిత = వాడియైన; శరముల్ = బాణముల; చేన్ = చేత; శశ = కుందేళ్ళు; వరాహ = అడవిపందులు; చమరీ = చమరీ మృగములు; రురు = నల్లచారల దుప్పులు; కాసర = అడవిదున్నలు; గవయ = గురుపోతులు; శల్య = ముండ్లపంది; హరిణీ = ఆడు జింకలు; కరి = ఏనుగులు; హరి = సింహములు; వృక = తోడేళ్ళు; పుండరీక = పెద్దపులి; కపి = కోతులు; ఖడ్గములన్ = ఖడ్గమృగములను.

భావము:

కుందేలు, పంది, ఆడు సవరపు మెకం, నల్ల చారల దుప్పి, కారెనుపోతు, గురుపోతు, ఏదుపంది, ఆడుజింక, ఏనుగు, సింహం, తోడేలు, పెద్దపులి, కోతి, ఖడ్గమృగం మొదలైన మృగాలను రెక్కలు గల తన వాడి బాణాల చేత…

4-774-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వధియించి మఱియును.

టీకా:

వధియించి = సంహరించి; మఱియును = ఇంకను.

భావము:

చంపి ఇంకా…

4-775-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుస మేధ్యా మేధ్య నమృగంబుల ఘృణ-
న దుస్సహక్రీడ సంహరించి
శ్రమయుక్తుఁడై వేఁట చాలించి మరలి మం-
దిరమున కర్థి నే తెంచి యందు
ముచిత స్నాన భోన కృత్యములు దీర్చి-
తి పరిశ్రాంతి శయానుఁ డగుచుఁ
రిమళ మిళిత ధూవ్రాత వాసిత-
ర్వాంగుఁ డగుచు స్రక్చందనములు

4-775.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వివిధ భూషణ చేలముల్ వెలయఁ దాల్చి
తుష్టుఁడును హృష్టుఁడున్ మఱి ధృష్టుఁడై య
న్యజాకృష్ట చిత్తుండునై రతిప్ర
సంగకౌతుక మాత్మను దొంగలింప.

టీకా:

వరుసన్ = వరసపెట్టి; మేధ్యా = యజ్ఞమునకు తగినవి; అమేధ్య = యజ్ఞమునకు అనర్హములైనవి యైన; వన = అడవి; మృగంబులన్ = మృగములను; ఘృణసన = దయతప్పి; దుస్సహ = సహింపరాని; క్రీడన్ = విధముగా; సంహరించి = వేటాడి; శ్రమ = అలసట; యుక్తుడు = కలిగినవాడు; ఐ = అయ్యి; వేటన్ = వేటను; చాలించి = ఆపి; మరలి = వెనుదిరిగి; మందిరమున్ = గృహమున; కున్ = కు; అర్థిన్ = కోరి; ఏతెంచి = వచ్చి; అందున్ = దానిలో; సముచిత = తగిన; స్నాన = స్నానము; భోజన = భోజనములు వంటి; కృత్యంబులున్ = పనులను; తీర్చి = చేసికొని; అతి = మిక్కిలి; పరిశ్రాంతి = అలసట; శయానుడు = పడుకొనెడివాడు; అగుచున్ = అగుచూ; పరిమళ = సువాసనలు; మిళిత = కలిపిన; ధూప = ధూపముల; వ్రాత = సమూహములు; వాసిత = పట్టిన; సర్వ = సకలమైన; అంగుండు = అవయవములు కలవాడు; అగుచున్ = అవుతూ; స్రక్ = పూలదండలు; చందనములు = మంచిగంధములు.
వివిధ = అనేకరకములైన; భూషణ = అలంకారములు; చేలముల్ = వస్త్రములు; వెలయన్ = ప్రసిద్దముగ; తాల్చి = ధరించి; తుష్టుండును = తృప్తి చెందినవాడు; హృష్టుండును = సంతోషించినవాడు; మఱి = ఇంకా; ధృష్టుడు = దిట్టదనము గల నాయకుడు, {ధృష్టుడు - అనుకూలుఁడు, దక్షిణుఁడు, ధృష్టుఁడు, శఠుఁడు. అను చతుర్విధశృంగార నాయకులలో నొకఁడు, ధృష్టుడు దోషములు బయటపడిననూ భయపడడు, అనుకూలుడు ఒకనాయికయందే అనురాగము కలవాడు, దక్షిణుడు పెక్కురు భార్యలను సమముగా ప్రేమించువాడు, శఠుడు నాయికకు దక్క ఇతరులకు తెలియకుండునట్లు అపరాధములు చేయువాడు}; ఐ = అయ్యి; అనన్యజా = మన్మధునిచేత; ఆకృష్ఠ = ఆకర్షింపబడిన; చిత్తుండ = మనసుకలవాడు; ఐ = అయ్యి; రతి = సంభోగ; ప్రసంగ = భాషణములందు; కౌతుకమున్ = ఆసక్తి; ఆత్మన్ = మనసును; తొంగిలింపన్ = ఆక్రమించుకోగా.

భావము:

పురంజనుడు వరుసగా మేధ్యామేధ్య విచారం లేకుండా అడవిలోని జంతువులను నిర్దయుడై వేటాడి అలసిపోయి, వేటమాని ఇంటికి తిరిగి వచ్చాడు. ఉచితాలైన స్నాన భోజనాదులను నిర్వర్తించి, అలసట తీర్చుకున్నాడు. శరీరానికి గంధం పూసుకున్నాడు. దండలు ధరించాడు. పలురకాల నగలు, వలువలు ధరించాడు. ధూపం చేత దేహం ఘుమఘుమ లాడుతుండగా సంతోషంతో సెజ్జపై చేరాడు. అప్పుడు అతనికి నిలుపరాని రతివాంఛ కలుగగా…

4-776-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత స్వకీయ ప్రాణవల్లభ యగు మహిషియందు మనంబు నునిచి నా వరారోహయు గృహమేధినియు నయిన గృహిణిం గానక, విమనస్కుండై నిజాంతఃపుర కామినులం గనుంగొని యిట్లనియె.

టీకా:

అంతన్ = అంతట; స్వకీయ = తన యొక్క; ప్రాణవల్లభ = ప్రియభార్య; అగు = అయిన; మహిషి = పట్టపురాణి; అందున్ = ఎడల; మనంబున్ = మనసు; ఉనిచినన్ = పెట్టిన; ఆ = ఆ; వరారోహయున్ = ఉత్తమ స్త్రీ {వరారోహ - గొప్ప పిరుదులు గలామె, ఉత్తమస్త్రీ}; గృహమేధినియున్ = ఇంటి యజమానురాలు; అయిన = అయిన; గృహిణిన్ = ఇల్లాలు; కానక = కనిపించక; విమనస్కుండు = దిగాలు పడిన మనసు కలవాడు; ఐ = అయ్యి; నిజ = తన; అంతఃపుర = పురము లోపల ఉండెడి; కామినులన్ = స్త్రీలను {కామిని - కోరదగినామె, స్త్రీ}; కనుంగొని = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

రాణిపై మనస్సు నిలిపాడు. కాని రాణి కనిపించలేదు. అందుచేత మనస్సు కలత చెందగా అంతఃపురంలోని స్త్రీలను చూచి ఇలా అన్నాడు.

4-777-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రామాజన సంఘము లా
రా! మానవతీ లలామ రామామణి సా
రాలకృపచే మెలఁగుదు
రా మానుగఁ గుశలమా? పరామర్శింపన్.

టీకా:

రామాజన = స్త్రీల {రామాజనము - రామా (ఆనందమును) ఇచ్చువారైన జనము, స్త్రీలు}; సంఘములారా = సముహములోనువారా; మానవతీ = స్త్రీలలో {మానవతి - మానము కలామె, స్త్రీ}; లలామ = అందమైన ఆమె; రామా = స్త్రీలలో {రామ - రమించెడి ఆమె, స్త్రీ}; మణి = మణి వంటి ఆమె; స = కలిగిన; ఆ = ఆ; రామల = స్త్రీ యొక్క; కృప = దయ; చేన్ = చేత; మెలగుదురా = వర్తించెదరా; మానుగన్ = చక్కగా; కుశలమా = క్షేమమేనా; పరామర్శింపన్ = పరిశీలించినచో.

భావము:

“కాంతలారా! మీరు మానవతి యైన రాణి దయను పొంది సంచరిస్తున్నారు కదా! మీకు క్షేమమా?

4-778-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సా వివేకలార! గృహసంపద లీ యెడఁ బూర్వరీతిచే
నాయఁగా రుచింపవు గృస్థునకుం గృహమందు మాత గా
నీ మణానుకూల రమణీ మణి యై తనరారు భార్య గా
నీ రుచి నొందకున్నఁ గన నేర్చునె తద్గృహమేధి సౌఖ్యముల్.

టీకా:

సార = లోతైన; వివేకలారా = విచక్షణ జ్ఞానము గలవారా; గృహ = ఇంటిలోని; సంపదల్ = సంపదలు; ఈ = ఈ; ఎడన్ = సమయములో; పూర్వ = ఇంతకు ముందు; రీతిన్ = విధము; చేన్ = వలన; అరయగాన్ = పరిశీలించినచో; రుచింపవు = ఇష్టమగుట లేదు; గృహస్థున్ = గృహస్థుని; కున్ = కి; గృహము = ఇంటి; అందున్ = లో; మాత = తల్లి; కానీ = కాని; రమణన్ = ప్రీతిగా, మగనికి; అనుకూల = అనుకూలము ఉండెడి; రమణీ = స్త్రీలలో {రమణి - క్రీడించు నట్టి ఆడుది, స్త్రీ, భార్య}; మణి = మణి వంటి యామె; ఐ = అయ్యి; తనరారు = అతిశయించెడి; భార్య = భార్య; కానీ = కాని; రుచిన్ = మనోజ్ఞముగా; ఒందకున్నన్ = ఉండకపోతే; కననేర్చునే = పొడగ గలుగునా ఏమి; తత్ = ఆ; గృహమేధి = ఇంటియజమాని; సౌఖ్యముల్ = సుఖప్రదములను.

భావము:

వివేకవంతులారా! పూర్వంలాగా గృహంలోని సంపదలు నాకు ఆనందాన్ని కలిగించడం లేదు. ఇంట్లో తల్లిగాని, అనుకూలవతి అయిన భార్యగాని లేకపోతే గృహస్థునికి సుఖం లేదు కదా!

4-779-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియునుం గాక.

టీకా:

అదియునున్ = అంతే; కాక = కాకుండగ.

భావము:

అంతేకాక…

4-780-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పొ డొందు జనని గానీ
వున వర్తించునట్టి యితయ కానీ
నుండని గృహమున నుం
గుఁ జక్ర విహీన రథము నందుం టరయన్.

టీకా:

పొగడ = పొగడ్తలను; ఒందు = పొందెడి; జనని = తల్లి; కానీ = కాని; తగవునన్ = న్యాయముగ, పద్ధతిగ; వర్తించున్ = నడచు; అట్టి = అటువంటి; దయితయ = భార్య; కానీ = కాని; తగన్ = తప్పక; ఉండని = ఉండనట్టి; గృహమునన్ = ఇంట; ఉంటన్ = ఉండుట; చక్ర = చక్రములు; విహీన = లేనట్టి; రథమున్ = రథము; అందున్ = లో; ఉంటన్ = ఉండుటతో సమానము; అరయన్ = పరికించినచో.

భావము:

ప్రేమమూర్తి అయిన తల్లిగాని, అనుకూలవతి అయిన భార్యగాని లేని ఇంటిలో నివసించటం చక్రాలు లేని రథంపై కూర్చొవటం వంటిది.

4-781-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున.

టీకా:

కావునన్ = అందుచేత.

భావము:

కనుక…

4-782-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కొని నాకుఁ దాను సుపథంబునఁ బ్రజ్ఞ జనింపఁజేసి సం
దురు దుర్భరవ్యసన సాగరమగ్నుఁడ నైన నన్ను ని
శ్చమతి నుద్ధరించి యనిశంబును మత్ప్రియ యైన భార్య యే
నఁ జరించుచున్న దనివారణ నా కెఱిఁగింపరే దయన్? "

టీకా:

తలకొని = పూని; నాకున్ = నాకు; తాను = తను; సు = మంచి; పథంబునన్ = మార్గములో; ప్రజ్ఞ = తెలివి; జనింపన్ = పుట్టునట్లు; చేసి = చేసి; సంచలత్ = చలించిపోతుండెడి; ఉరు = మిక్కిలి; దుర్భర = భరింపరాని; వ్యసన = బాధ లనెడి; సాగర = సముద్రమున; మగ్నుడను = ములిగిపోతున్నవాడను; ఐన = అయిన; నన్నున్ = నన్ను; నిశ్చల = స్థిరమైన; మతిన్ = బుద్ధితో; ఉద్ధరించి = ఉద్ధరించి; అనిశంబున్ = ఎల్లప్పుడు; మత్ = నా యొక్క; ప్రియ = ఇష్టురాలు; ఐన = అయిన; భార్య = భార్య; ఏవలనన్ = ఎక్కడైతే; చరించుచున్నది = వర్తించుతున్నదో; అనివారణన్ = అడ్డులేక, తప్పక; నాకున్ = నాకు; ఎఱిగింపరే = తెలుపరే; దయన్ = దయతో.

భావము:

మంచి మార్గములో వెళ్ళే తెలివి నేర్పి, వ్యసన పూరితమైన కష్ట సముద్రంలో మునిగిన నన్ను పైకి లేవనెత్తి నిత్యమూ నాకు సంతోషం కలిగించే నా భార్య ఎక్కడ ఉన్నదో నాకు దయతో చెప్పండి”.

4-783-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వుడు విని యక్కాంతలు
పతి కిట్లనిరి "రాజత్తమ! యిదిగోఁ
కొంగైనను బఱపుగ
నొరింపక నేలఁ బొరలుచున్నది వగలన్.

టీకా:

అనవుడు = అనగా; విని = విని; ఆ = ఆ; కాంతలు = స్త్రీలు {కాంతలు - కోరదగిన మె, మనోహరమైన ఆమె, స్త్రీలు}; జనపతి = రాజు {జనపతి - జనులకు (ప్రజలకు) పతి (ప్రభువు), రాజు}; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి; రాజ = రాజులలో; సత్తమ = శ్రేష్ఠుడ; ఇదిగో = ఇదిగో; తన = తన; కొంగు = కొంగు; ఐననున్ = అయినప్పటికి; పఱపగన్ = పరుచుకొనుట; ఒనరింపక = చేయకుండగ; నేలన్ = నేలమీద; పొరలుచున్నది = దొర్లుచున్నది; వగలన్ = శోకించుతూ.

భావము:

అని వేడుకోగా విని రాణి చెలికత్తెలు రాజుతో ఇలా అన్నారు. “రాజేంద్రా! ఇదిగో రాణి! నేలమీద కొంగైనా పరచుకొనకుండా దుఃఖంతో పొర్లాడుతున్నది.

4-784-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మి కతమున నున్నదో యెఱుఁగ మేము
నీవు చూడు మ" టన్న నా భూరుండు
నేలఁ బడి పొరలెడు భార్యఁ బోలఁ జూచి
నములో దుఃఖ తాపంబు ల్లడింప.

టీకా:

ఏమికతమునన్ = ఏకారణముచేత; ఉన్నదో = ఉన్నదో; ఎఱుగము = తెలియము; మేము = మేము; నీవున్ = నీవు; చూడుము = చూడుము; అటన్ = అని; అన్నన్ = అనగా; ఆ = ఆ; భూవరుండు = రాజు {భూవరుండు - భూమికి వరుండు (పతి), రాజు}; నేలన్ = నేలమీద; పడి = పడి; పొరలెడు = దొర్లుతున్న; భార్య = భార్య; పోలన్ = వైపు; చూచి = చూసి; మనమున్ = మనసు; లోన్ = లో; దుఃఖ = దుఃఖమువలన; తాపంబున్ = సంతాపము; మల్లడింపన్ = అతిశయించగా.

భావము:

కారణం మాకు తెలియదు. చూడు” అని అన్నారు. అప్పుడు రాజు నేలమీద పొరలాడుతున్న భార్యను చూచి దుఃఖించాడు.

4-785-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత.

టీకా:

అంతన్ = అంతట.

భావము:

అప్పుడు…

4-786-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లజనేత్ర ప్రణయ సంజాత రోష భా
మున నయిన యట్టి క్రదృష్టి
న విభుండు చూచి నునయ కోవిదుఁ
గుచు నప్పయోరుహాక్షిఁ జేరి.

టీకా:

జలజనేత్ర = స్త్రీ; ప్రణయ = ప్రేమ భావము వలన; సంజాత = పుట్టిన; రోష = రోషపు; భావమునన్ = భావమున; అయిన = అయిన; అయిన = అటువంటి; వక్ర = వంకరగా; దృష్టి = చూచుటను; జనవిభుండు = రాజు; చూచి = చూసి; అనునయ = అనుయించుట యందు; కోవిదుడు = బహునేర్పరి; అగుచున్ = అవుతూ; ఆ = ఆ; పయోరుహాక్షిన్ = స్త్రీని {పయోరుహాక్షి - పయోరుహము (పద్మము)లవంటి కన్నులు గలామె, స్త్రీ}; చేరి = దగ్గరకు చేరి;

భావము:

కమలాక్షి అయిన రాణి ప్రణయ కోపంతో చూచిన వాలు చూపులను గమనించి నేర్పుతో ఓదార్చటం కోసం ఆమెను సమీపించి…

4-787-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పొలఁతుకఁ దన యుత్సంగం
బు నిడి తత్పాద యుగళమును నంటుచు మం
జు మృదు భాషణముల నా
నామణిఁ జూచి పలికె లాలన మొప్పన్.

టీకా:

పొలతుకన్ = స్త్రీని; తన = తన యొక్క; ఉత్సంగంబులన్ = తొడలపైన; ఇడి = ఉంచి; తత్ = ఆమె; పాద = పాద; యుగళమునున్ = ద్వయమును; అంటుచున్ = ముట్టుకొనుచు; మంజుల = మనోజ్ఞమైన; మృదు = మృదువైన; భాషణములన్ = మాటలతో; ఆ = ఆ; లలనా = స్త్రీలలో {లలన - విలాసవంతశీల యైన ఆడుది, స్త్రీ}; మణిన్ = మణివంటి ఆమెను; చూచి = చూసి; పలికెన్ = పలికెను; లాలనము = బుజ్జగింపు; ఒప్పన్ = ఒప్పుతుండగా.

భావము:

తన ఒడిలో ఆమె పాదాలను ఉంచుకొని తాకుతూ మృదు మధుర వాక్కులతో ఇలా బుజ్జగించాడు.

4-788-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ణిరొ! భృత్యులందు నపరాధము గల్గిన నాయకుల్ స్వప
క్షముఁ దలపోసి యుగ్రతర శాసనముం దెగి చేయ రట్లు గా
నములోని కిన్కఁ దమకంబున నాజ్ఞ యొనర్చిరేని ని
క్కముగ ననుగ్రహించుటయ కాక తలంపఁగ నాజ్ఞ చేయుటే?

టీకా:

రమణిరో = ఓ స్త్రీ {రమణి - మనోజ్ఞమైనామె, స్త్రీ}; భృత్యుల్ = సేవకుల; అందున్ = అందు; అపరాధము = తప్పులు; కల్గినన్ = జరిగినను; నాయకుల్ = యజమానులు; స్వపక్షమున్ = తన వర్గము వారు యని; తలపోసి = భావించి; ఉగ్రతర = మిక్కిలి భయంకరముగా {ఉగ్రము - ఉగ్రతరము - ఉగ్రతమము}; శాసనమున్ = శాసించుటను; తెగిన్ = తెగించి; చేయరున్ = చేయరు; అట్లు = ఆ విధముగా; కాక = కాకపోతే; మనమున్ = మనసు; లోని = లోపలి; కిన్కన్ = అలక వలని; తమకంబునన్ = మత్తులో; ఆజ్ఞ = శాసించుటను; ఒనర్చి = చేసిరి; ఏని = అయితే; నిక్కముగన్ = నిజముగా; అనుగ్రహించుటయ = అనుగ్రహించుటే; కాక = కాకపోతే; తలపగన్ = విచారించినచో; ఆజ్ఞ = శిక్షించుట; చేయుటే = చేయుటా ఏమి.

భావము:

“రమణీ! సేవకులు నేరం చేసినప్పుడు ప్రభువులు తమవాళ్ళు కదా అని దయ తలచి గట్టిగా శిక్షించరు. అలా కాకుండా కోపంతో శిక్ష విధిస్తే అది సేవకులను అనుగ్రహించటమే. అంతేకాని శిక్షించటం కాదు.

4-789-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లానన! బాంధవ కృ
త్యముఁ దలఁపక రోషచిత్తుఁ గు కుటిలాత్మున్
దా మర్షుఁడు నీతి
క్రరహితుఁడు నైన బాలుఁగా నెన్నఁ దగున్.

టీకా:

కమలానన = స్త్రీ {కమలానన - కమలము వంటి ఆనన (మోము) కలామె, స్త్రీ}; బాంధవ = బంధుత్వమున; కృత్యమున్ = చేయవలసిన పనులు; తలపక = తలచుకొనక; రోష = రోషము పూరిత; చిత్తుడు = భావము గలవాడు; అగు = అయిన; కుటిల = కపటపు; ఆత్మున్ = మనసు కలవానిని; స = కలిగిన; మద = మదము; అమర్షణుడు = రోషము గలవాడు; నీతి = నీతి; క్రమ = నియమము; రహితుడున్ = లేనివాడు; ఐన = అయిన; బాలున్ = పిల్లవానిగా; ఎన్న = తీసుకొన; తగున్ = తగును.

భావము:

పద్మముఖీ! బాంధవ్యాన్ని పరిగణించి శిక్ష విధించకుండా కోపం ప్రకటించే వానిని అజ్ఞాని ఐన బాలుడుగా భావించాలి”.

4-790-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని వెండియు నిట్లనియె “సుదతీ హృదయేశ్వరి వైన నీవు.

టీకా:

అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; సుదతీ = స్త్రీ {సుదతి - చక్కని పలువరుస కలామె, స్త్రీ}; హృదయేశ్వరి = హృదయరాణి; ఐన = అయిన; నీవున్ = నీవు.

భావము:

అని ఇంకా ఇలా అన్నాడు. “సుందరీ! నా హృదయరాణివైన నీవు…

4-791-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సోదార సుధా రసోపమ వచశ్చాతుర్య సౌభాగ్యమై
రినీలోపమ కోమలాలక యుతంబై విభ్రమభ్రూలతా
రిజుష్టస్మిత సద్విలోకనమునై భాసిల్లు యుష్మన్ముఖాం
బురుహంబున్ భవదీయ దాసునకుఁ బూఁబోఁడీ! కృపం జూపవే.

టీకా:

సరస = రసస్ఫూర్తిగల; ఉదార = వికాసముగల; సుధారస = అమృత; ఉపమ = సాటియైన; వచస్ = పలుకుల; చాతుర్య = నేర్పరితనము; సౌభాగ్యమున్ = శుభకరములు; ఐ = అయ్యి; హరినీల = ఇంద్రనీల; ఉపమ = సమానమైన; కోమల = మృదువైన; అలక = ముంగురులు; యుతంబున్ = కూడినది; ఐ = అయ్యి; విభ్రమ = మిక్కిలి చలిస్తున్న; భ్రూ = కనుబొమలు అనెడి; లతా = లతలచే; పరిజుష్ట = చక్కగా కలిసిన; స్మిత = చిరునవ్వు; సత్ = స్వచ్ఛమైన; విలోకన = చూపులు కలది; ఐ = అయ్యి; భాసిల్లు = ప్రకాశించుతున్న; యుష్మత్ = నీ యొక్క; ముఖ = మోము యనెడి; అంబురుహంబున్ = పద్మము; భవదీయ = నీ యొక్క; దాసున్ = సేవకుని; కున్ = కి; పూబోడీ = స్త్రీ {పూబోడి - పూలవంటి సౌకుమార్యము కలామె, స్త్రీ}; కృపన్ = దయతో; చూపవే = చూపుము.

భావము:

అమృతంలాగా తీయనైన చతుర వాక్కులతోను, ఇంద్రనీలాల లాగా నల్లనైన నెఱి వెంట్రుకలతోను, విలాసాలు విరజిమ్మే కనుబొమలతోను, చిరునవ్వులు చిందించే చూపుతోను ప్రకాశించే నీ ముఖ పద్మాన్ని దయతో నీ దాసునికి చూపించు.

4-792-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విను; వీరపత్ని! నీ యెడ
యంబును బ్రాహ్మణులును రిభక్తులుఁ ద
క్కను నితరు లెగ్గు చేసిన
నితా! శిక్షింతు నెంతవారల నయినన్.

టీకా:

విను = వినుము; వీరపత్ని = వీరుని భార్యా; నీ = నీ; ఎడన్ = అందు; అనయంబునున్ = ఎల్లప్పుడును; బ్రాహ్మణులును = బ్రాహ్మణులును; హరి = విష్ణుని; భక్తులు = భక్తులు; తక్కను = తప్పించి; ఇతరుల్ = మరింకెవరైనను; ఎగ్గు = అపకారము; చేసినన్ = చేసినచో; వనితా = స్త్రీ {వనిత - మిక్కిలి అనురాగము కలామె, సేవింపబడినామె, స్త్రీ}; శిక్షింతున్ = శిక్షంచెదను; ఎంత = ఎంతటి; వారలన్ = వారిని; ఐనన్ = అయినప్పటికిని.

భావము:

వనితా! విను. నీవు వీరపత్నివి. నీకు బ్రాహ్మణులు, విష్ణుభక్తులు తప్ప ఇతరులు అపకారం చేసినట్లయితే వారు ఎంతటి వారైనా నేను దండిస్తాను.

4-793-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ముల్లోకము లందును
నా నమున రోష మొదవినన్ భయ రహితుం
డై దిలోఁ బరితోషము
తో మెలఁగెడువానిఁ గానఁ దోయజనేత్రా!

టీకా:

ఈ = ఈ; ముల్లోకముల్ = మూడులోకముల {ముల్లోకములు - భూరః భువస్సువర్లోకములు అనడి త్రిలోకములు}; అందునున్ = లోను; నా = నా యొక్క; మనమునన్ = మనసులో; రోషము = కోపము; ఒదవినన్ = పుట్టినచో; భయ = భయము; రహితుండు = లేనివాడు; ఐ = అయ్యి; మది = మనసు; లోన్ = లో; పరితోషమున్ = సంతోషము; తోన్ = తోటి; మెలగెడు = తిరిగెడు; వానిన్ = వానిని; కానన్ = చూడలేదు; తోయజనేత్ర = స్త్రీ {తోయజనేత్ర - తోయజము (పద్మము) వంటి నేత్రములు కలామె, స్త్రీ}.

భావము:

కమలాక్షీ! నేను కోపిస్తే భయపడకుండా సంతోషంగా తిరుగ గల్గినవాడు ఈ ముల్లోకాలలో ఒక్కడైనా లేడు.

4-794-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇందీవరేక్షణ! యే నెందు భవదీయ-
తిక విరహితము లినయుతము
ర్ష శూన్యంబు నపాస్తరాగంబును-
త్యమర్షయుతంబు యిన ముఖము
ళితాశ్రుబిందు సంలిత సంచిత శోభ-
మాన పీనస్తన మండలమును
మణీయ తాంబూలరాగ విహీన మై-
ట్టి సుపక్వ బింబాధరంబు

4-794.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గాఁగ నిట్లుంట కిపు డేమి తము? నాకు
ర్థి నెఱిఁగింపవే మృగయాతిసక్తి
బల; నీ కెఱిఁగింపక రిగి నట్టి
ప్పు సైరించి కావంగఁ గుదు నేను.

టీకా:

ఇందీవరేక్షణ = స్త్రీ {ఇందీవరేక్షణ - ఇందీవరము (నల్లకలువల వంటి) ఈక్షణ (కన్నులుగలామె), స్త్రీ}; ఏను = నేను; ఎందున్ = ఎప్పుడును; భవదీయ = నీ యొక్క; తిలక = తిలకము; విరహితమున్ = లేనట్టిది; మలిన = మాసిపోవుట; యుతమున్ = కూడినది; హర్ష = సంతోషము; శూన్యంబున్ = లేనిది; నపాస్తరాగంబునున్ = విడిచిపెట్టబడ్డ అనురాగము గలది; అతి = మిక్కిలి; అమర్ష = రోషము; యుతంబున్ = కూడినది; అయిన = అయినట్టి; ముఖమున్ = మోమును; గళిత = కారుతున్న; బిందు = బిందువులుతో; సంకలిత = కూడిన; సంచిత = పూజ్యనీయమైన; శోభమాన = శోభించుతున్న; పీన = బలిసిన; స్తనమండలము = చనుకట్టు; రమణీయ = మనోజ్ఞమైన; తాంబూల = తాంబూలముయొక్క; రాగ = రంగు; విహీనము = లేనిది; ఐ = అయ్యి; అట్టి = అటువంటి; సు = చక్కగా; పక్వ = పండిన; బింబ = దొండపండు వంటి; అధరంబున్ = కిందిపెదవి; కాగ = అగునట్లు; ఇట్లు = ఈ విధముగ; ఉంట = ఉండుట; కున్ = కి; ఇపుడున్ = ఇప్పుడు; ఏమి = ఏమిటి; కతమున్ = కారణము.
నాకున్ = నాకు; అర్థిన్ = కోరి; ఎఱిగింపవే = తెలుపుము; మృగయా = వేటాడే; అతిసక్తిన్ = మిక్కిలి ఆసక్తి వలన; అబల = స్త్రీ {అబల - బలము లేనిది, స్త్రీ}; నీ = నీ; కున్ = కు; ఎఱిగింపక = తెలుపక; అరిగిన = వెళ్ళిన; అట్టి = అటువంటి; తప్పు = అపరాధమును; సైరించి = సహనము వహించి; కావగన్ = కాపాడుటకు; తగుదున్ = తగినవాడను; నేను = నేను.

భావము:

పద్మాక్షీ! నీవు బొట్టు పెట్టుకోలేదు. నీ ముఖం వాడిపోయింది. కోపంగా ఉన్నది. నీ ముఖంలో సంతోషం కనపడడం లేదు. కారిన నీ కన్నీటి బిందువులు పడి నీ స్తనద్వయం శోభాశూన్యంగా ఉంది. దొండపండు వంటి నీ పెదవి తాంబూలరాగం లేకుండా ఉన్నది. నీవు ఈ విధంగా ఉండటం నేనెప్పుడూ చూడలేదు. ఇందుకు కారణ మేమిటి? నాకు చెప్పు. వేట తమకంతో నీకు చెప్పకుండా వెళ్ళిపోయాను. ఆ తప్పును క్షమించి నన్ను కాపాడు.

4-795-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నితాజన పరవశుఁడై
సిజ శర బాధ్యమాన మానసుఁ డగు వా
నిని దగఁ గర్తవ్యార్థము
ను భజియింపక తొలంగు లనలు గలరే? "

టీకా:

వనితాజన = స్త్రీల ఎడ; పరవశుడు = పరవశించినవాడు; ఐ = అయ్యి; మనసిజ = మన్మథుని {మనసిజుడు – మనసున కలుగువాడు, మన్మథుడు}; శర = బాణములచేత; బాధ్యమాన = బాధింపబడిన; మానసుడు = మనసు కలవాడు; అగు = అయిన; వానిని = వానిని; తగన్ = శ్రీఘ్రమే; కర్తవ్య = కర్తవ్యములైన; అర్థములను = అవసరములను; = భజియింపక = సేవించకుండగ; తొలంగు = తొలగెడి; లలనలు = స్త్రీలు {లలన - విలాసవంతమైన శీలము గలామె, స్త్రీ}; కలరే = ఉన్నారా ఏమి.

భావము:

స్త్రీలకు వశుడైన వాడు మన్మథుని బాణాలు మనస్సున నాటి తపిస్తుంటే, వానిని తగిన ఉపచారాలతో సేవించకుండా ఉపేక్షించే స్త్రీలు ఉండరు కదా!”

4-796-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనుచుం దదీయ విభ్రమ వశంగతుండై పలికిన విని.

టీకా:

అనుచున్ = అంటూ; తదీయ = ఆమె చుట్టును; విభ్రమ = మిక్కిలి తిరుగుట యందు; వశన్ = లగ్నమై; గతుండు = మెలగెడివాడు; ఐ = అయ్యి; పలికినన్ = పలుకగా; విని = విని.

భావము:

అని ఆమె విలాసానికి లొంగి వేడుకోగా విని..

4-797-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కంజాతపత్ర నేత్ర పు
రంను దెస రోష ముడిగి మణీయశ్రీ
మంజుల మృదూక్తుల మనము
రంజించుచుఁ బలికె సదనురాగ మెలర్పన్.

టీకా:

కంజాతపత్రనేత్ర = స్త్రీ {కంజాత పత్ర నేత్ర - కంజాతము (తామర) పత్ర (ఆకులు) వంటి నేత్ర (కన్నులు ఉన్నామె), స్త్రీ}; పురంజను = పురంజనుని; దెసన్ = వైపు; రోషము = ఉక్రోషము; ఉడిగి = చాలించి; రమణీయశ్రీ = మనోజ్ఞమైన శోభతో; మంజుల = వినుట కింపైన; మృదు = మృదువైన; ఉక్తులు = పలుకులతో; మనమున్ = మనసును; రంజించుచున్ = ఆనందింపజేయుచు; పలికెన్ = పలికెను; సత్ = సత్యమైన; అనురాగము = ప్రీతి; ఎలర్పన్ = వికసించగా.

భావము:

రాణి అలుక మాని ప్రేమతో మృదుమధురంగా మాటలాడి పురంజనుని మనస్సును సంతోష పెట్టింది.

4-798-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత.

టీకా:

అంతన్ = అంతట.

భావము:

అప్పుడు…

4-799-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మ్మహాదేవి నెయ్యంబున మంగళ-
స్నాతయై మృదుల వస్త్రములు గట్టి
స్రక్చందనాది భూణములు ధరియించి-
మనీయ మోహనాకార యగుచుఁ
తికడ నిలిచిన తఁడు సంతుష్టాంత-
రంగుఁడై యభ్యంతమున నుండి
న్యోన్య సరస గాఢాలింగనంబులు-
గావించి గోప్య వాక్యముల చేత

4-799.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తఁడు ప్రమదా పరిగ్రహ వ్యసనమునను
డఁక నపకృష్ట ఘన వివేకంబు గలిగి
గలు రే యని ప్రొద్దు లేర్పఱుప రాక
యెనసి యాయుర్వ్యయంబు దా నెఱుఁగఁ డయ్యె.

టీకా:

ఆ = ఆ; మహా = గొప్ప; దేవి = రాణి; నెయ్యంబునన్ = స్నేహముతో; మంగళ = మంగళస్నానములు; స్నాత = స్నానముచేసినది; ఐ = అయ్యి; మృదుల = మృదువైన; వస్త్రములు = బట్టలు; కట్టి = కట్టుకొని; స్రక్ = పూలదండలు; చందన = మంచిగంధము; ఆది = మొదలైన; భూషణములు = అలంకారములు; ధరియించి = ధరించి; కమనీయ = మనోహరమైన; మోహన = మోహింపజేసెడి; ఆకార = ఆకారముకలది; అగుచున్ = అవుతూ; పతి = భర్త; కడన్ = వద్ద; నిలిచినన్ = నిలబడగా; అతడు = అతడు; సంతుష్ట = మిక్కిలి తృప్తిచెందిన; అంతరంగుడు = మనసుగలవాడు; ఐ = అయ్యి; అభ్యంతరమున = అంతఃపురమున; ఉండి = ఉండి; అన్యోన్య = ఒకరినొకరు; సరస = సరసమైన; గాఢ = గట్టి; ఆలింగనములు = కౌగిలింతలు; కావించి = చేసికొని; గోప్య = గూఢార్థముల; వాక్యముల్ = మాటల; చేతన్ = చేత; అతడు = అతడు.
ప్రమద = స్త్రీ; పరిగ్రహ = స్వీకరించెడి; వ్యసనమునను = అభ్యాసములో; కడకన్ = పూని; అపకృష్ట = తొలగిపోయిన; ఘన = గొప్ప; వివేకంబున్ = విచక్షణాజ్ఞానము; కలిగి = కలిగి; = పగలు = పగలు; రేయి = రాత్రి; అని = అని; ప్రొద్దులు = పొద్దులను; ఏర్పఱుపరాక = తేడాతెలిసికొనలేక; ఎనసి = చెందిన; ఆయుర్ = ఆయుష్షు; వ్యయంబున్ = తరగిపోవుటను; తాన్ = తాను; ఎఱుగడు = తెలియనివాడు; అయ్యె = అయ్యెను.

భావము:

ఆ రాణి స్నానం చేసి సన్నని వలువలు కట్టింది. పూలదండలు ధరించింది. గంధం అలదుకొన్నది. నగలు పెట్టుకొన్నది. ఈ విధంగా అలంకరించుకొని మోహనాకారంతో మగనిని సమీపించింది. అతడు పొంగిపోయాడు. వారిద్దరూ అంతఃపుర మందిరంలో ఒకరినొకరు గట్టిగా కౌగలించుకున్నారు. రహస్యపు మాటలు చెప్పుకున్నారు. ఈ విధంగా పురంజనుడు స్త్రీ వ్యసనం చేత వివేకాన్ని కోల్పోయి ఇది పగలని, ఇది రాత్రి అని లేక రాణితో గడుపుతూ తన ఆయుస్సు క్షీణించటం తెలిసికోలేక పోయాడు.

4-800-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నతం డున్నద్ధ మదుండును మహామనుండును నర్హశయ్యా శయనుండును మహిషీ భుజోపధానుండును నై యజ్ఞానాభిభూతుం డగుటంజేసి స్వరూప భూత పరమ పురుషార్థంబు నెఱుంగక నిజ మహిషియె పరమ పురుషార్థంబుగాఁ దలంచుచు రమించుచుం గామ కశ్మలచిత్తుం డైన యతనికి నవయౌవనంబైన కాలంబు క్షణార్ధంబునుం బోలె గతం బయ్యె; అంత.

టీకా:

మఱియున్ = ఇంకను; అతండున్ = అతడు; ఉన్నద్ధ = మిక్కిలి అతిశయించిన; మదుండును = మదము కలవాడును; మహా = గొప్ప; మనుండును = మనసు కలవాడును; అర్హ = తగిన; శయ్యా = పాన్పున; శయనుండును = శయనించెడివాడును; మహిషీ = పట్టపురాణి యొక్క; భుజ = భుజముపైన; ఉపధానుండును = తలగడగా కలవాడు; ఐ = అయ్యి; అజ్ఞాన = అజ్ఞానముచే; అభిభూతుండు = ఓడింపబడిన వాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; స్వ = తన యొక్క; రూపభూతము = రూపము యైనట్టి; పరమ = పరమమైన; పురుషార్థంబున్ = పురుషార్థమును; ఎఱుంగక = తెలియక; నిజ = తన యొక్క; మహిషి = పట్టపురాణియే; పరమ = పరమమైన; పురుషార్థంబున్ = పురుషార్థమును; కాన్ = అగునట్లు; తలంచుచున్ = అనుకొనుచు; రమించుచున్ = క్రీడించుతూ; కామ = కామముతో; కశ్మల = కల్మషము కలిగిన; చిత్తుండు = మనసు గలవాడు; ఐన = అయినట్టి; అతని = అతని; కిన్ = కి; నవ = నవ; యౌవనంబున్ = యౌవనము; ఐన = కలిగిన; కాలంబున్ = కాలము; క్షణ = క్షణములో; అర్ధంబునున్ = సగము; పోలె = వలె; గతంబున్ = అయిపోయినది; అయ్యెన్ = అయ్యెను; అంత = అప్పుడు.

భావము:

ఇంకా అతడు మిక్కిలి మదించి పాన్పుపై శయనించి రాణి భుజమే తలగడగా చేసుకొని స్వరూప భూత రూపమైన పురుషార్థాన్ని తెలిసికొనక ఆమెనే పరమ పురుషార్థంగా భావించాడు. అతని యౌవన కాలమంతా అరక్షణం లాగా గడచిపోయింది. అప్పుడు…

4-801-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విద యశోజలనిధి యా
శిముఖి యగు భార్య వలన మ్మతి నేకా
శత పుత్రుల రణక
ర్క దేహులఁ గాంచి కౌతుకంబున మఱియున్.

టీకా:

విశద = స్వచ్ఛమైన; యశః = కీర్తికి; జలనిధి = సముద్రము వంటి వాడు; ఆ = ఆ; శశిముఖి = చంద్రుని వంటి మోము కలిగిన; అగు = అయినట్టి; భార్య = భార్య; వలన = వలన; సమ్మతి = కోరికతో; ఏకాదశశత = పదకొండు వందల మంది (1100); పుత్రులన్ = కొడుకులను; రణ = యుద్ధకళ యందు ఆరితేరిన; కర్కశ = కఠినమైన; దేహులన్ = శరీరములు కల వారిని; కాంచి = పొంది; కౌతుకంబునన్ = కుతూహలముతో; మఱియున్ = ఇంకను.

భావము:

సముద్రంవలె స్వచ్ఛమైన కీర్తి గలిగిన ఆ పురంజనుడు చంద్రుని వంటి ముఖం కల తన భార్య వలన యుద్ధవీరులైన పదకొండు వందల మంది పుత్రులను పొందాడు. ఇంకా…

4-802-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గురు శీలౌదార్య గుణో
త్తలను సల్లలిత గుణ కదంబలఁ బ్రియలన్
కుల పావనల దశో
త్తశత దుహితలను గాంచెఁ త్సతివలనన్.

టీకా:

గురు = గొప్ప; శీల = మంచినడవడిక; ఉదార = దయగల; గుణ = గుణముచే; ఉత్తరలను = ఉత్తములను; సత్ = సత్యమైన; లలిత = మనోజ్ఞమైన; గుణ = సుగుణముల; కదంబలన్ = కలయికలు కలవారు; ప్రియలన్ = ఇష్టమైనవారిని; వర = ఉత్తమమైన; కుల = వంశ; పావనులన్ = పవిత్రము చేయువారిని; దశోత్తరశత = నూటపది మంది (110); దుహితలనున్ = పుత్రికలను; కాంచెన్ = పొందెను; తత్ = ఆ; సతి = భార్య; వలనన్ = వలన.

భావము:

ఆ భార్య వలన నూటపది మంది కుమార్తెలను కన్నాడు. వారు గొప్ప శీలవంతులు, దయాగుణం కలవారు, సద్గుణవతులు, ప్రీతిపాత్రులను, కులపావనులు.

4-803-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు పుత్ర పుత్రికా జనంబులం గని యున్నంత.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; పుత్ర = పుత్రు; పుత్రిక = పుత్రికలు యైన; జనంబులన్ = వారిని; కని = పొంది; ఉన్నంత = ఉండగా.

భావము:

ఈ విధంగా కొడుకులను, కుమార్తెలను కని ఉన్నంతలో…

4-804-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విను మాతని యాయువులో
ను నర్ధం బరిగె; నంత రపతి కుల వ
ర్ధను లగు సుతులకుఁ బరిణయ
మొరించెన్ సదృశ లయిన యువిదల తోడన్.

టీకా:

వినుము = వినుము; ఆయువు = మొత్తము ఆయుష్షు; లోననున్ = లో; అర్ధంబున్ = సగము; అరిగెన్ = జరిగెను; అంత = అంతట; నరపతి = రాజు; కుల = వంశ; వర్థనులు = ఉద్ధారకులు; అగు = అయినట్టి; సుతుల్ = పుత్రుల; కున్ = కు; పరిణయమున్ = వివాహము; ఒనరించెన్ = చేసెను; సదృశలయిన = తగినవారు; అయిన = అయిన; యువిదల్ = స్త్రీల; తోడన్ = తోటి.

భావము:

విను. అతని ఆయుస్సు సగం తరిగిపోయింది. వంశవర్ధనులైన కొడుకులకు తగిన కన్యలతో వివాహం చేసాడు.

4-805-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాథుఁ డాఁడు బిడ్డల
రూప వయో విలాస వైభవములచేఁ
రఁగిన నిజతనయల సమ
రులకు సంప్రీతితో వివాహము చేసెన్.

టీకా:

నరనాథుడు = రాజు; ఆడుబిడ్డలన్ = ఆడపిల్లలను; వర = ఉత్తమమైన; రూప = సౌందర్యము; వయస్ = వయస్సు; విలాస = సొగసు; వైభవముల్ = వైభవములు; చేన్ = చేత; పరగిన = ప్రసిద్ధమైన; నిజ = తన; తనయలన్ = పుత్రికలను; సమ = సమానమైన; వరుల్ = వరుల; కున్ = కి; సంప్రీతి = ఇష్టముతో; వివాహము = వివాహము; చేసెన్ = చేసెను.

భావము:

ఆ రాజు రూపవతులు, విలాసవతులు, యౌవనవతులు అయిన తన పుత్రికలను తగిన వరులతో వివాహం జరిపించాడు.

4-806-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లు వివాహంబులు గావించి యున్న సమయంబున.

టీకా:

అట్లు = ఆ విధముగ; వివాహంబులున్ = వివాహములు; కావించి = చేసి; ఉన్న = ఉన్నట్టి; సమయంబునన్ = సమయములో.

భావము:

ఈ విధంగా వివాహాలు చేయగా..

4-807-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విను తత్సుతు లొక్కకనికి
యముఁ బాంచాల దేశమందులఁ బౌరం
కులవర్ధను లగుచున్
నియించిరి నూర్వురేసి శౌర్య బలాఢ్యుల్

టీకా:

విను = వినుము; తత్ = ఆ; సుతులున్ = పుత్రులు; ఒక్కొక్కనికిన్ = ఒక్కొక్కరికి; అనయమున్ = ఎల్లప్పుడు; పాంచాల = పాంచాల; దేశము = దేశములు; అందులన్ = అందులోని; పౌరంజన = పురంజనుని; కుల = వంశమును; వర్థనులు = ఉద్దరించెడివారు; అగుచున్ = అవుతూ; = = జనియించిరి = పుట్టిరి; నూర్వురు = వందమంది (100); ఏసి = చొప్పున; శౌర్య = వీరత్వము; బల = శక్తి; ఆఢ్యులు = సమృద్ధిగా కలవారు.

భావము:

విను. ఆ పురంజనుని కొడుకులకు ఒక్కొక్కనికి నూరుగురేసి కొడుకులు జన్మించారు. వారంతా మహాశూరులు. వారివల్ల పాంచాల దేశంలో పురంజనుని వంశం వర్ధిల్లింది.

4-808-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నఘ! యట్టి రిక్థహారులు గేహకో
శాను జీవ యుతులు యిన యట్టి
నందనాదులందుఁ జెందిన మమత ని
ద్ధుఁడయ్యె నంతఁ బార్థివుండు.

టీకా:

అనఘ = పుణ్యుడ; అట్టి = అటువంటి; రిక్థహారులు = ఆస్తిపంచుకొనెడివారు; గేహ = గృహములు; కోశ = సంపదలు; అనుజీవయుతులు = ఆశ్రయించి జీవించువారు; అయిన = అయిన; అట్టి = అట్టి; నందన = పుత్రులు; ఆదులు = మొదలగువారు; అందున్ = ఎడల; చెందిన = చెందినట్టి; మమతన్ = నాది అనెడి అభిమానమున; నిబద్ధుడు = బంధింపబడినవాడు; అయ్యెన్ = అయ్యెను; అంతన్ = అంతట; పార్థివుండున్ = రాజు {పార్థివుడు - పృథివికి సంబంధించినవాడు, రాజు};

భావము:

పుణ్యాత్మా! అతని కొడుకులు, మనుమలు ఆస్థి పంచుకొనేవారై ఇంటిలో ఉన్న ధనంమీద ఆధారపడి బ్రతుకుతున్నారు. అయినా వారి మీద పురంజనుడు మమత పెంచుకున్నాడు.

4-809-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తిమగు నిష్ఠతో నతఁడు దీక్షితుఁడై పశుమారకంబులున్
వి భయంకరంబులగు న్మఖముల్ దగఁ బెక్కు చేసి యా
మున నీవునుం బలెను త్తదనూన ఫలాప్తి కాముఁడై
సుపితృ భూత సంఘము నసూయఁ దనర్ప భజించె భూవరా!

టీకా:

తిరము = స్థిరము; అగు = అయిన; నిష్ఠ = దీక్ష; తోన్ = తోటి; అతడున్ = అతడు; దీక్షితుడు = దీక్షపట్టినవాడు; ఐ = అయ్యి; పశు = బలిపశువులను; మారకంబులున్ = సంహరించునవి; సరవిన్ = వరుసగా; భయంకరము = భీకరములు; అగు = అయిన; సత్ = మంచి; మఖముల్ = యజ్ఞములను; తగన్ = అవశ్యము; పెక్కు = అనేకము; చేసి = చేసి; ఆదరముతో = ప్రీతితో; నీవున్ = నీ; వలెనున్ = వలె; తత్తత్త = ఆయా; అనూన = సాటిలేని; ఫల = ఫలితములను; ఫలాప్తి = పొందుటను; కాముడున్ = కోరెడెడువాడు; అయ్యి = అయ్యి; సుర = దేవతలు; పితృ = పితృదేవతలు; భూత = జీవుల; సంఘమున్ = సమూహముల; అసూయన్ = అసూయను; తనర్పన్ = అతిశయించునట్టు; భజించెన్ = పూజించెను; భూవర = రాజా.

భావము:

ఆ పురంజనుడు విషయబద్ధుడై నీవలెనే ఆయా కోరికలను పొందగోరి దీక్షబూని పశుమారకాలు అయిన పెక్కు యజ్ఞాలను చేసి దేవతలను, పితృదేవతలను, భూతగణాలను పూజించాడు.

4-810-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లాత్మహితంబు లైన కర్మంబులయం దనవహితుండును గుటుంబాసక్త మానసుండునై యున్న యతనికి విరోధియై ప్రియాంగనా జనంబులకును నప్రియంబగు కాలంబు సంభవించినం జండవేగ విఖ్యాతుండను గంధర్వాధీశుండు షష్ట్యుత్తర శతత్రయ సంఖ్యాకులైన గంధర్వులును నందఱ గంధర్వీజనంబులును సితాసిత వర్ణంబులు గలిగి మిథునీభూతు లగుచు ననుగమింపం జనుదెంచి స్వపరిభ్రమణంబు చేతనే సర్వకామంబుల నిర్మితంబగు నా పురంబు నిరోధించిన నప్పుడా చండవేగానుచరు లైన గంధర్వు లా పురంజను పురంబు వ్యాకులత్వంబు నొందించుచు నపహరింప నుపక్రమించు సమయంబునఁ బురంజన పురాధ్యక్షుండైన ప్రజాగరుం డనువాడు వింశత్త్యుత్తర సప్తశతంబులైన గంధర్వ గంధర్వీ జనంబుల నివారించి బలవంతుండై సంవత్సరశతంబు యుద్ధంబు గావించి యొక్కరుం డయ్యు నప్పెక్కండ్రతో నిట్లు పోరి క్షీణుండైనం బురంజనుండు దాన నిలిచి తత్పురంబున నల్ప సుఖంబు లనుభవించుచుఁ బాంచాల దేశంబు లందు నిజపార్షదుల చేత నానీతంబు లైన పదార్థంబుల నొందుచుం గామినీ జనసమేతుండై భయపర్యాలోచనంబు చేయ నేరక రాష్ట్ర పుర బాంధవ సమేతుండై యార్తి నొంది చింతాక్రాంతుండై యుండె; నంత.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; ఆత్మ = తనకు; హితంబులు = మేలుకలిగించెడివి; ఐన = అయిన; కర్మంబులు = కర్మములు; అందున్ = అందు; అనవహితుండును = శ్రద్ధ లేనివాడు; కుటుంబ = కుటుంబము నందు; ఆసక్త = ఆసక్తిగల; మానసుండు = మనసు కలవాడు; ఐ = అయ్యి; ఉన్న = ఉన్న; అతని = అతని; కిన్ = కి; విరోధి = శత్రువు; ఐ = అయ్యి; ప్రియాంగనా = భార్య {ప్రియాంగన - ప్రియమైన అంగన (స్త్రీ), భార్య}; జనంబుల్ = కుటుంబములోనివారి; కునున్ = కి; అప్రియంబున్ = అయిష్టము; అగు = అయిన; కాలంబున్ = కాలము; సంభవించినన్ = రాగా; చండవేగా = చండవేగుడు యని; విఖ్యాతుండు = ప్రసిద్ధుడు; అను = అనెడి; గంధర్వ = గంధర్వులకు; అధీశుండు = ప్రభువు; షష్ట్యత్తరశతత్రయ = మూడువందల అరవై (360); సంఖ్యాకులు = మంది; ఐన = అయిన; గంధర్వులును = గంధర్వులు; అందఱన్ = అంతేమంది; గంధర్వీ = గంధర్వస్త్రీ; జనంబులును = జనములు; సితా = తెలుపు; అసిత = నలుపుల; వర్ణంబులున్ = రంగులు; కలిగి = కలిగి; మిథునీభూతంబులున్ = జంటకట్టినవారు; అగుచున్ = అవుతూ; అనుగమింపన్ = అనుసరించుతుండగా; చనుదెంచి = వచ్చి; స్వ = తన; పరిభ్రమణంబున్ = మెలగుట; చేతనే = వలననే; సర్వ = సకల; కామంబులన్ = కోరికలు; నిర్మితంబున్ = తయారగునవి; అగు = అయిన; ఆ = ఆ; పురంబునన్ = పురమును; నిరోధించినన్ = అడ్డగించగా; అప్పుడు = అప్పుడు; ఆ = ఆ; చండవేగా = చండవేగుని {చండవేగ - భయంకరమైన వేగము కలవాడు}; అనుచరులు = అనుచరులు; ఐన = అయిన; గంధర్వులున్ = గంధర్వులు; ఆ = ఆ; పురంజనున్ = పురంజనుని; పురంబున్ = పురమును; వ్యాకులత్వంబున్ = చీకాకు; ఒందించుచున్ = పెట్టుతూ; అపహరింపన్ = తీసుకుపోవ; ఉపక్రమించున్ = ప్రయత్నిస్తున్న; సమయంబునన్ = సమయములో; పురంజన = పురంజనుని; పురాధ్యక్షుండు = పురమునకు అధ్యక్షుడు; ఐన = అయిన; ప్రజాగరుండు = ప్రజాగరుడు {ప్రజాగరుడు - ప్రజల యొక్క మగతనము యైనవాడు}; అను = అనెడి; వాడు = వాడు; వింశత్త్యుత్తర సప్త శతంబులు = ఏడువందలయిరవైమంది 720; ఐన = అయిన; గంధర్వ = గంధర్వులు; గంధర్వీ = గంధర్వస్త్రీలు యైన; జనంబులన్ = వారిని; నివారించి = అడ్డుకొని; బలవంతుండు = శక్తిమంతుండు; ఐ = అయ్యి; సంవత్సర = సంవత్సరములు; శతంబున్ = నూటిని; యుద్ధంబున్ = యుద్ధమును; కావించి = చేసి; ఒక్కరుండున్ = ఒకడే; అయ్యున్ = అయినప్పటికిని; ఆ = ఆ; పెక్కండ్ర = అనేకమంది; తోన్ = తోటి; ఇట్లు = ఈవిధముగా; పోరి = యుద్ధముచేసి; క్షీణుండున్ = చిక్కిపోయినవాడు; ఐనన్ = కాగా; పురంజనుండు = పురంజనుడు; తాన = తనే; నిలిచి = నిలబడి; తత్ = ఆ; పురంబున్ = పురము నందు; అల్ప = అల్పమైన; సుఖంబులన్ = సుఖములను; అనుభవించుచున్ = అనుభవించుతూ; పాంచాల = పాంచాల యనెడి; దేశంబున్ = దేశముల; అందున్ = అందు; నిజ = తన; పార్షదుల్ = పరివారము; చేతన్ = వలన; ఆనీతంబులు = తీసుకురాబడినవి; ఐన = అయిన; పదార్థంబులన్ = వస్తువులు, అంగార్థములు; కామినీ = స్త్రీ {కామిని - ఇచ్ఛగలామె, స్త్రీ}; జన = జనులతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; భయ = భయము గూర్చి; పర్యావలోచనంబున్ = గమనించుటలు; చేయనేరక = చేయలేక; రాష్ట్ర = దేశము, ఉపద్రవము; పుర = పౌరులు; బాంధవ = బంధువులు; సమేతుండు = తో కూడినవాడు; ఐ = అయ్యి; ఆర్తిన్ = బాధను; ఒంది = పొంది; చింతా = దుఃఖముచే; ఆక్రాంతుండు = ఆక్రమించినవాడు; ఐ = అయ్యి; ఉండెన్ = ఉండెను; అంతన్ = అంతట.

భావము:

ఈ విధంగా ఆత్మకు హితం కలిగించే కర్మలపై శ్రద్ధ విడిచి, కుటుంబంపై ఆసక్తి పెంచుకొన్న పురంజనునికి శత్రువై ప్రియకాంతలకు అప్రియమైన కాలం (ముసలితనం) వచ్చింది. అప్పుడు చండవేగుడు అనే గంధర్వరాజు మూడు వందల అరవై మంది గంధర్వులు, అంతే సంఖ్య కల గంధర్వ స్త్రీలు తెలుపు నలుపు రంగులు గలిగి జంటలై వెంటరాగా వచ్చి ఆ పురాన్ని ముట్టడించాడు. ఆ సమయంలో పురంజనుని పురమునకు అధ్యక్షుడైన ప్రజాగరుడు ఏడువందల యిరవై మంది గంధర్వ, గంధర్వీ జనాలను అడ్డుకొని నూరేండ్లు ఒక్కడే యుద్ధం చేసి క్షీణబలు డయ్యాడు. కాని పురంజనుడు పురంలోనే ఉండిపోయి నీచ సుఖాలను అనుభవిస్తూ, స్త్రీలతో వినోదిస్తూ సంభవించిన ఆపదను గురించి ఆలోచించలేదు. అందుచేత రాష్ట్ర పుర బాంధవ సమేతంగా చింతాక్రాంతు డయ్యాడు. అప్పుడు…

4-811-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యంబుఁ గాల పుత్రిక
ను నొక కామిని వరేచ్ఛ ఖిల జగంబుం
యంతఁ గలయఁ దిరుగుచుఁ
నిచని యొకనాడు రాజత్తమ! వింటే.

టీకా:

అనయంబున్ = ఎల్లప్పుడు; కాలపుత్రిక = కాలపుత్రిక {కాలపుత్రిక - అవసాన కాలమున జనించునది}; అను = అనెడి; ఒక = ఒక; కామిని = స్త్రీ; వర = వరుని కొఱకైన; ఇచ్ఛన్ = కోరికతో; అఖిల = సమస్తమైన; జగంబుల్ = లోకములు; తనయంతన్ = తనంతతనే; కలయన్ = కలియ; తిరుగుచున్ = తిరుగుతూ; చనిచని = వెళ్ళి; = ఒక = ఒక; నాడు = దినమున; రాజసత్తమ = రాజులలో మిక్కిలి సత్తువ ఉన్నవాడా; వింటే = విన్నావా.

భావము:

రాజశ్రేష్ఠా! విను. కాలుని పుత్రిక అయిన ఒక కన్య వరుని కోరి తనంత తానే అన్ని లోకాలలోను తిరుగుతూ ఉండేది.

4-812-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నఘాత్మ! రాజర్షి యైన యయాతి కు-
మాకుం డయినట్టి పూరుచేత
రియింపఁగాఁ బడి లనొప్ప నతనికి-
ర మిచ్చి దౌర్భాగ్యశత నొంది
ప్రఖ్యాతి గనుట దుర్భగ యనుపేరను-
రఁగు న క్కాంత నే పురుషవరుఁడు
రియింపఁ డయ్యె; నా రుణియు నొకనాఁడు-
ర మొప్ప బ్రహ్మ లోమున నుండి

4-812.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సుధ కేతెంచి విను బృహద్వ్రతుఁడ నయిన
న్ను వరియింపఁ గోరి మమునఁ గామ
రవిమోహిత యై వేఁడఁ రము నేను
మ్మతింపక యున్న రోమున నలిగి.

టీకా:

అనఘాత్మా = పుణ్యాత్మా; రాజర్షి = రాజులలో ఋషివంటివాడు; ఐన = అయిన; యయాతి = యయాతి యొక్క {యయాతి - యానము చేయువాడు}; కుమారుండు = కుమారుడు; అయినట్టి = అయిటువంటి; పూరు = పూరుడు {పూరుడు - తండ్రి యైన యయాతి జరాభారమును ధరించిన వాడు}; చేతన్ = చేత; వరియింపగాబడి = వరింపబడి; వలనొప్పన్ = తగినట్లు; అతను = అతను; కిన్ = కి; వరమున్ = వరమును; ఇచ్చి = ఇచ్చి; దౌర్భాగ్యవశతన్ = దుర్భగత్వమునకు వశ మగుటను {దౌర్భాగ్యవశత – దుర్భగత్వమున వశ మగుట, మర్మావయవములు చెడిపోవుట}; ఒంది = చెంది; ప్రఖ్యాతిన్ = ప్రసిద్ధిని; కనుటన్ = పొందుటవలన; దుర్భగ = దుర్భగ; అను = అనెడి; పేరనున్ = పేరుతో; పరగున్ = ప్రసిద్ధిచెందుటవలన; ఆ = ఆ; కాంతన్ = స్త్రీని; ఏ = ఏ ఒక్క; పురుష = పురుషులలో; వరుడున్ = ఉత్తముడును; వరియింపడున్ = వరించనివాడు; అయ్యెన్ = అయ్యెను; తరుణియున్ = ఆమె; ఒక = ఒక; నాడు = దినమున; కరమున్ = మిక్కిలి; ఒప్పన్ = ఒప్పియుండి; బ్రహ్మలోకమున = బ్రహ్మలోకమున; నుండి = నుండి.
వసుధ = భూమి; కిన్ = కి; ఏతెంచి = వెళ్ళి; విను = వినుము; బృహత్ = మిక్కిలి విస్తారమైన; వ్రతుడు = దీక్షగలవాడు; అయిన = అయిన; నన్నున్ = నన్ను; వరియింపన్ = వరించ; కోరి = కోరి; మనమునన్ = మనసులో; కామ = మన్మథుని; శర = బాణముచే; విమోహిత = మిక్కిలి మోహమునపడినది; ఐ = అయ్యి; వేడన్ = వేడగా; కరమున్ = మిక్కిలి; నేనున్ = నేను; సమ్మతింపక = అంగీకరింపకుండగ; ఉన్నన్ = ఉండగా; రోషమునన్ = కోపముతో; అలిగి = అలిగి.

భావము:

పుణ్యాత్మా! రాజర్షి అయిన యయాతి కుమారుడు పూరుడు ఆమెను వరించాడు. ఆమె సంతోషించి అతనికి వరాన్ని ప్రసాదించింది. తన దౌర్భాగ్యవశాన ఆమె దుర్భగ అని పేరు పొందింది. ఆ తరువాత ఆమెను ఏ పురుషుడూ వరించలేదు. ఒకనాడు బ్రహ్మలోకం నుండి భూలోకానికి వచ్చిన నన్ను వరించాలనుకొని మన్మథుని బాణాలకు తాళలేక వేడుకున్నది. నేను అంగీకరించలేదు. అందుకు ఆమె కోపించి . . . .

4-813-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లను “మునీంద్రా! మదీయాశా విముఖుండవైన నీకు నేకత్రావస్థానంబు లేక యుండుంగాక” యని శపించి విహత సంకల్పయై మదుపదేశంబునం జని యవనేశ్వరుండును భయనామకుండును నయిన వానిం గదిసి యిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; అనున్ = అనెను; ముని = మునులలో; ఇంద్రా = ఇంద్రుడా; మదీయ = నా యొక్క; ఆశా = కోరిక; విముఖుండవు = అంగీరించనివాడవు; ఐన = అయిన; నీకున్ = నీకు; ఏకత్రః = ఒకేచోట; అవస్థానంబున్ = వసించుట; లేక = లేకుండగ; ఉండుగాక = అగుగాక; అని = అని; శపించి = శాపము ఇచ్చి; విహత = దెబ్బతిన్న; సంకల్ప = నిశ్చయము కలామె; ఐ = అయ్యి; మత్ = నా యొక్క; ఉపదేశంబునన్ = ఉపదేశము ప్రకారమున; చని = వెళ్ళి; యవన = యవన దేశమునకు; ఈశ్వరుండును = ప్రభువు; భయ = భయుడు అనెడి; నామకుండున్ = పేరు కలవాడు; అయిన = అయిన; వానిన్ = వాని; కదిసి = దగ్గరకు చేరి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

అలా ఆమె కోపించి “మునీంద్రా! నా కోర్కెను నీవు నెరవేర్చలేదు. కాబట్టి ఒకచోట నిలువక నీవు నిత్యమూ తిరుగుతూ ఉంటావు” అని శపించింది. నా ఉపదేశం వల్ల యవనేశ్వరుడైన భయుడు అనేవాని వద్దకు వెళ్ళి ఇలా అన్నది.

4-814-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీపతి! భయనామక
నకులాధీశ్వరుండ గు నినుఁ బతిఁగాఁ
విలి వరింపఁగ వచ్చితి
వినయముగ వినుము భూత సంకల్పమునన్.

టీకా:

అవనీపతి = రాజా {అవనీపతి - భూమికి ప్రభువు, రాజు}; భయ = భయుడు అనెడి; నామకః = పేరు కలవాడు; యవన = యవనుల {యవనులు - యవనిక (తెరచాటు) నందుండు వారు,}; కుల = వంశమునకు; అధీశ్వరుండవు = ప్రభువవు; అగు = అయిన; నినున్ = నిన్ను; పతిగాన్ = భర్తగా; తవిలి = పూని; వరింపగన్ = వరించుటకై; వచ్చితిన్ = వచ్చితిని; సవినయముగ = వినయపూర్వకముగ; వినుము = వినుము; భూత = చేసుకొన్న; సంకల్పమునన్ = నిశ్చయముతో.

భావము:

“రాజా! భయుడనే పేరు కలిగి, యవనవంశానికి అధిపతివైన నిన్ను భర్తగా వరింప వచ్చాను. సవినయంగా విను. భూతసంకల్పం చేత…

4-815-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కలుగు మత్కామితంబు వృథగాదు; లోకంబున వేదంబు లందు దేయగ్రాహ్యరూపం బైన వస్తువు యాచ్యమానం బగుచుండ నెవ్వం డొసంగం; డెవ్వం డిందు దీయమానం బగుచుండం గోరం; డట్టి వీర లిద్దఱును జడస్వభావులని సత్పురుషులు శోకంబు నొందుదురు; కావున నిన్ను భజియించుచున్న నన్నుం గరుణార్ద్రచిత్తుండవై భజియింపు; మిట్టి యార్తానుకంపయుఁ బురుషధర్మం" బని పలికిన యక్కాలపుత్రిక వచనంబులు విని యవనేశ్వరుండు దేవగుహ్యచికీర్షు వగు దానిం గనుంగొని మందస్మిత వదనుం డగుచు నిట్లనియె.

టీకా:

కలుగున్ = కలిగిన; మత్ = నా యొక్క; కామితంబున్ = కోరికలు; వృథ = వ్యర్థము; కాదు = కాదు; లోకంబునన్ = లోకమున; వేదంబుల్ = వేదముల; అందు = లో; దేయ = ఇచ్చుట; గ్రాహ్య = తీసుకొనుట యనెడి; రూపంబున్ = రూపము కలవాడు; ఐన = అయిన; వస్తువున్ = వస్తువును; యాచ్యమానంబున్ = అడగబడినది; అగుచుండన్ = అగుచుండగా; ఎవ్వండు = ఎవరైతే; ఒసంగండు = ఇవ్వడో; ఎవ్వండు = ఎవరైతే; ఇందున్ = దీనిలో; దీయమానంబు = ఇవ్వబడుతున్నది; అగుచుండన్ = అగుచుండగా; కోరండు = కోరడో; అట్టి = అటువంటి; వీరలు = వీరు; ఇద్దఱున్ = ఇద్దరును; జడస్వభావులు = మూర్ఖులు; అని = అని; సత్ = మంచి; పురుషులు = వారు; శోకంబున్ = దుఃఖమును; ఒందుదురు = పొందెదరు; కావునన్ = అందుచేత; నిన్నున్ = నిన్ను; భజియించుచున్న = వేడుకొంటున్న; నన్నున్ = నన్ను; కరుణ = దయతో; అర్ధ్ర = తడసిన; చిత్తుండను = మనసు కలవాడవు; ఐ = అయ్యి; భజియింపుము = అవధరింపుము; ఇట్టి = ఇటువంటి; ఆర్తిన్ = బాధలో నున్నవారికి; అనుకంపయున్ = జాలిచూపుట; పురుష = పురుషుల యొక్క; ధర్మంబు = ధర్మము; అని = అని; పలికినన్ = పలుకగా; ఆ = ఆ; కాలపుత్రిక = కాలపుత్రిక; వచనంబులు = మాటలు; విని = విని; యవన = యవనులకు; ఈశ్వరుండును = ప్రభువు; దేవగుహ్య = దేవరహస్యమును; చికీర్షువు = ఆచరింప గోరుతు న్నామెవు; అగు = అయిన; దానిన్ = దానిని; కనుంగొని = చూసి; మందస్మిత = చిరునవ్వు గల; వదనుండు = మోము కలవాడు; అగుచున్ = అగుచూ; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

నాకు కలిగిన కోరిక వ్యర్థం కాదు. ఇవ్వదగిన వస్తువును అడిగినప్పుడు ఇవ్వనివాడు, గ్రహింప దగిన వస్తువును ఇచ్చినప్పుడు కోరుకొననివాడు మందబుద్ధులు. కాబట్టి నన్ను దయతో గ్రహించు. దీనులపై దయ చూపటం పురుషధర్మం” అని వేడుకున్నది. అప్పుడు యవనేశ్వరుడు దేవరహస్యాన్ని (మరణం) చేయ సిద్ధపడిన ఆ కాలకన్యను చూచి చిరునవ్వుతో ఇలా అన్నాడు.

4-816-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"విను; తరుణి! యాచ్యమానం
నఁదగు నీ లోకమందు త్యశుభవు స
జ్జముల కసమ్మతవు నగు
నిను నభినందింపకుండ్రు నెఱి నెవ్వారున్.

టీకా:

విను = వినుము; తరుణి = స్త్రీ {తరుణి - తరుణమైన వయసు గలామె, స్త్రీ}; యాచ్యమానంబున్ = కోరబడినది; అనన్ = అనుటకు; తగున్ = తగినయట్టి; ఈ = ఈ; లోకమున్ = లోకము; అందున్ = లో; అతి = మిక్కిలి; అశుభవున్ = అశుభము యైనదానవు; సత్ = మంచి; జనముల్ = వారల; కున్ = కి; అసమ్మతవున్ = అంగీకారము కానిదానవు; అగు = అయిన; = నినున్ = నిన్ను; అభినందింపకుండ్రు = అభినందించరు; నెఱిన్ = చక్కగా; ఎవ్వారున్ = ఎవరూ కూడ.

భావము:

“తరుణీ! విను. ఈ లోకంలో నీవు కోరినవారు అందరూ నీవు అశుభమైన దానివి కనుక నిన్ను మెచ్చుకొనడం లేదు.

4-817-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున నేను జ్ఞానదృష్టిం జేసి నీకుం బతినిరూపణంబు చేసెద; నది యెట్లనిన మదీయసేనా సాహాయ్యంబు బడసి ప్రజానాశం బొనరించు నట్టి నీ వవ్యక్తగతివై కర్మనిర్మితంబైన లోకంబు ననుభవింపు; మీ ప్రజ్వారుం డనువాఁడు నాకు సహోదరుండు; నీవు మదీయ భగినివి; మీరిద్దఱం గూడి యీ లోకంబునందు నవ్యక్తుండును భీమసైనికుండును నై యేను వర్తింతు"ననిన నా భయనామకుం డయిన యవనేశ్వరుని దిష్టకారులైన సైనికులు ప్రజ్వార కాలకన్యా యుక్తులై భూమండలం బెల్లఁ దిరుగుచు నొక్కనాఁ డతివేగంబున భౌమ భోగాఢ్యంబును జరత్పన్నగ పాలితంబును నయిన పురంజను పురంబు నావరించి యున్నంత స్వాభిభూతుండయిన పురుషునకు నిస్సారత్వంబు గలిగించు నట్టి కాలకన్యక బలాత్కారంబున నా పురంజను పురంబు ననుభవించె; నట్లు కాలకన్య కోపభుజ్యమానం బైన పురంబు సర్వ ద్వారంబు లందును సర్వతోధికంబుగా నయ్యవనులు ప్రవేశించి తత్పురంబు సమస్తంబును బీడింప నిట్లు పురంబు ప్రపీడ్యమానం బగుచుండ నభిమానియైన పురంజనుండు.

టీకా:

కావునన్ = అందుచేత; నేనున్ = నేను; జ్ఞాన = జ్ఞానముగల; దృష్టిన్ = దృష్టి; చేసి = తో; నీకున్ = నీకు; పతి = భర్తను; నిరూపణంబున్ = నిర్ణయించుట; చేసెదన్ = చేసెదను; అది = అది; ఎట్టు = ఏ విధము; అనిన్ = అనగా; మదీయ = నా యొక్క; సేవా = సేవలు; సాహాయంబున్ = సహాయమును; పడసి = పొంది; ప్రజా = ప్రజలను; నాశంబున్ = నాశనము; ఒనరించు = చేసెడి; అట్టి = అటువంటి; నీవు = నీవు; అవ్యక్త = అంతుపట్టని; గతివి = గమనము కలామెవు; ఐ = అయ్యి; కర్మ = కర్మఫలితములచే; నిర్మితంబున్ = ఏర్పరుపబడినది; ఐన = అయిన; లోకంబున్ = లోకమును; అనుభవింపుము = ఆక్రమించుము; ఈ = ఈ; ప్రజ్వారుండు = ప్రజ్వారుడు {ప్రజ్వారుడు - పెద్ద జ్వరమైనవాడు}; అను = అనెడి; వాడు = వాడు; నాకున్ = నాకు; సహోదరుండు = తోడబుట్టినవాడు; నీవు = నీవు; మదీయ = మదీయ; భగినివి = తోబుట్టువవు; మీరున్ = మీరు; ఇద్దఱున్ = ఇద్దరు (2); ఈ = ఈ; లోకంబున్ = లోకము; అందున్ = లో; అవ్యక్తుండును = తెలియరాక యుండువాడను; భీమ = భయంకరమైన; సైనికుండను = సైనికులు కలవాడను; ఐ = అయ్యి; ఏను = నేను; వర్తింతున్ = ప్రవర్తింతును; అనిన = అనగా; ఆ = ఆ; భయ = భయుడు; నామకుండున్ = అనెడి పేరు కలవాడు; అయిన = అయిన; యవన = యవనులకు {యవనులు - యవనిక (తెరచాటు) నందుండువారు}; ఈశ్వరుని = ప్రభువు యొక్క; దిష్టకారులు = ఆజ్ఞను పాలించువారు; ఐన = అయిన; సైనికులు = సైనికులు; ప్రజ్వార = ప్రజ్వారుడు; కాలకన్య = కాలకన్య; యుక్తులు = కూడినవారు; ఐ = అయ్యి; భూమండలంబున్ = భూలోకము; ఎల్లన్ = అంతయు; తిరుగుచున్ = తిరుగుతూ; ఒక్క = ఒక; నాడు = దినమున; అతి = మిక్కిలి; వేగంబునన్ = త్వరితముగ; భౌమ = భౌతికమైన; భోగా = భోగములలో; ఆఢ్యంబునున్ = శ్రేష్ఠమైనది; జరత్ = ముసలి; పన్నగ = సర్పముచే; పాలితంబునున్ = పరిపాలింపబడుతున్నది; అయిన = అయిన; పురంజను = పురంజనుని; పురంబున్ = పురమును; ఆవరించి = చుట్టుముట్టి; ఉన్నన్ = ఉన్నట్టి; అంతన్ = సమయమున; స్వ = తమచే; అభిభూతుండు = ఓడింపబడినవాడు; అయిన = అయిన; పురుషున్ = మానవుని; నిస్సారత్వంబున్ = శక్తి శూన్యమును; కలిగించు = కలిగించెడి; అట్టి = అటువంటి; కాలకన్యక = కాలకన్యక {కాలకన్యక - కాలము వలన జన్మించెడియామె, ముసలితనము}; బలాత్కారంబునన్ = బలాత్కరించుట వలన; ఆ = ఆ; పురంజను = పురంజనుని; పురంబున్ = పురమును; అనుభవించెన్ = ఆక్రమించెను; అట్లు = ఆ విధముగ; కాలకన్యక = కాలకన్యకచే; ఉపభుజ్యమానంబున్ = అనుభవింపబడుతున్నది; ఐన = అయిన; పురంబున్ = పురమును; సర్వ = సకల; ద్వారంబుల్ = ద్వారములు; అందున్ = అందును; సర్వతః = అంతటను; అధికంబుగాన్ = ఎక్కువగా; ఆ = ఆ; యవనులు = యవనులు {యవనులు - యవనిక (తెరచాటు)నందుండువారు}; ప్రవేశించి = చేరి; తత్ = ఆ; పురంబున్ = పురమును; సమస్తంబును = అంతటిని; పీడింపన్ = పీడిస్తుండగా; ఇట్లు = ఈ విధముగ; పురంబున్ = పురము; ప్రపీడ్యమానంబు = మిక్కిలి పీడింపబడు తున్నది; అగుచుండన్ = అవుతుండగా; అభిమాని = అభిమానము కలవాడు {అభిమాని - అభిమానము (సంరక్షణ ప్రేమ) కలవాడు}; ఐన = అయిన; పురంజనుండు = పురంజనుడు.

భావము:

కాబట్టి నేను జ్ఞానదృష్టితో నీకు భర్తను నిర్ణయిస్తాను. నీవు అవ్యక్తగతివై లోకమంతటా తిరుగుతూ కర్మనిర్మితమైన లోకాన్ని అనుభవించు. నా సేనను నీకు తోడుగా పంపిస్తాను. దాని సాయంతో నీవు ప్రజానాశనం చేయగలవు. ఈ ప్రజ్వారుడు నాకు సోదరుడు. నీవు నాకు చెల్లెలివి. మీ ఇద్దరితో కూడి నేను అవ్యక్తుడనై, భీమ సైనికుడనై ఈ లోకంలో సంచరిస్తాను” అని అన్నాడు. ఆ యవన రాజు ఆజ్ఞను నేరవేర్చడానికి సైనికులు ప్రజ్వారునితోను, కాలకన్యకతోను కూడి లోకమంతా తిరుగుతూ ఒకనాడు లౌకిక సంపదలతో నిండి, ముసలి పాముచేత రక్షింపబడుతున్న పురంజనుని పురాన్ని ముట్టడించారు. తనచేత ఆక్రమింపబడిన పురుషునికి నిస్సారత్వం కలిగించే కాలకన్యక బలవంతంగా ఆ పురంజనుని పురాన్ని అనుభవించింది. కాలకన్యక చేత అనుభవింపబడుతున్న పురంలో యవనులందరూ అన్ని ద్వారాలలో నుండి ప్రవేశించి ఆ పురాన్ని పీడింపసాగారు. ఈ విధంగా పురం పీడింపబడుతుండగా అభిమానవంతుడైన పురంజనుడు….

4-818-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నఘ! యెంతయు మమతాకుల చిత్తుఁడై-
హువిధ భూరితాములఁ బొందె;
నకుటుంబియుఁ గాలన్యోపగూఢుండు-
ష్టసంపదుఁడు విష్టమతియు
విషయాత్మకుండును వినిహతైశ్వర్యుండుఁ-
గృపణుండు చాల నకించనుండు
గు పురంజనుఁడు శోకావిలభావుఁడై-
గంధర్వ యవన సంములచేత

4-818.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నో చెడి వికలత నొందు నైపురముఁ
విలి ప్రతికూలురును ననారణయుతులు
యిన పుత్రులఁ బౌత్రుల నుచరులను
చివ పౌరోహితుల నిజతినిఁ జూచి.

టీకా:

అనఘా = పుణ్యుడా; యెంతయున్ = మిక్కలి; మమతా = మమకారము వలన {మమత - మమకారము (నాది యనెడి భావము)}; ఆకుల = చీకాకుపడుతున్న; చిత్తుడు = మనసుకలవాడు; ఐ = అయ్యి; బహు = అనేక; విధ = రకములైన; భూరి = అత్యధికమైన; తాపములన్ = బాధలను; పొందెన్ = చెందెను; ఘన = పెద్ద; కుటుంబియున్ = కుటుంబము కలవాడును; కాలకన్య = కాలకన్యచే; ఉపగూఢుండున్ = కౌగిలింపబడినవాడు; నష్ట = పోయిన; సంపదుడున్ = సంపదలు (దంతాది) కలవాడు; వినష్టమతియున్ = మిక్కలిమతిమరపు కలవాడు; విషయాత్మకుండునున్ = ఇంద్రియార్థములకు మిక్కలి చెందినవాడు; వినిహత = బాగాదెబ్బతిన్న; ఐశ్వర్యుండున్ = సామర్థ్యములుకలవాడు; కృపణుండున్ = దీనుడు; చాలన్ = మిక్కిలి; అకించనుండు = నీచవర్తనుడు; అగు = అయిన; పురంజనుడు = పురంజనుడు; శోకా = దుఃఖముచే; ఆవిల = మలిన్యమును; భావుడు = చెందినవాడు; ఐ = అయ్యి; గంధర్వ = గంధర్వులు; యవన = యవనులు; సంఘముల్ = సమూహముల; చేతన్ = వలన; ఓజన్ = తేజస్సు; చెడి = చెడిపోయి.
వికలతన్ = కలవరము; ఒందు = పొందెడి; నైజ = తన యొక్క; పురమున్ = పురమును; తవిలి = తగుల్కొని; ప్రతికూలురు = వ్యతిరిక్తులు; అనాదరణయుతులు = తిరస్కారబుద్ధికలవారు; అయిన = ఐన; పుత్రులన్ = కుమారులను; పౌత్రులన్ = మనుమలను; అనుచరులనున్ = అనుచరులను; సచివ = మంత్రులు; పౌరోహితులన్ = పురోహితులైనవారిని; నిజ = తన యొక్క; సతినిన్ = భార్యను; చూచి = చూసి.

భావము:

పుణ్యాత్మా! (పురంజనుడు) మమకారం చేత వ్యాకులపాటు చెంది దుఃఖించాడు. గొప్ప కుటుంబం కలవాడై కూడా పురంజనుడు కాలకన్య కౌగిలిలో చిక్కి, సంపదలు పోగొట్టుకొని, బుద్ధిమాంద్యుడై, విషయాలకు లొంగి దరిద్రుడై, దీనుడై, నీచవర్తనుడై వాపోయాడు. గంధర్వ యవనులు ఆక్రమించటం చేత కాంతిని కోల్పోయిన తన పురాన్ని, ఎదురు తిరిగి అవమానిస్తున్న కొడుకులను, మనుమలను, పరిజనాన్ని, మంత్రులను, పురోహితులను, భార్యను చూచి…

4-819-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియుం గాలకన్యాగ్రస్తుం డయిన తన్నును నరిదూషితంబు లైన పాంచాల బలంబునుం జూచి యపారచింత నొంది తత్ప్రతీకారంబు చేయ నెఱుంగక కాలకన్యాపహృతవీర్యంబు లయినం గామంబుల నభిలషించుచు దీనుండును విగతాత్మ గతికుండును స్నేహంబునం జేసి పుత్రదారోపలాలన పరుండునునై కాలకన్యోపమర్దితంబును గంధర్వ యవనాక్రాంతంబును నైన పురంబు విడువ నిచ్చ లేకయు విడువ నుపక్రమించె; నప్పుడు.

టీకా:

మఱియున్ = ఇంకను; కాలకన్య = కాలకన్యచే; గ్రస్తుండు = మింగబడినవాడు; అయిన = ఐన; తన్నున్ = తనను; అరి = శత్రువులచే; దూషితంబులున్ = దుష్టము చేయబడినవాడు; ఐన = అయిన; పాంచాల = పాంచాల {పాంచాల - పంచేంద్రియములు ప్రసరించగలుగు ప్రదేశములు}; బలంబులను = సైనికులను, శక్తులను; చూచి = చూసి; అపార = విస్తారమైన; చింతన్ = బాధలను; ఒంది = పొంది; తత్ = దానికి; ప్రతీకారంబున్ = విరుగుడును; చేయన్ = చేయు మార్గమును; ఎఱుంగక = తెలియక; కాలకన్యా = కాలకన్యచే; అపహృతంబులు = అపహరింపబడిన; వీర్యంబులున్ = సామర్థ్యములు; అయినన్ = కలిగినను; కామంబులన్ = కోరికలను; అభిలషించుచున్ = కోరుతూ; దీనుండును = దర్పము ఉడిగినవాడు; విగత = నష్టపోయిన; ఆత్మ = ఆత్మ; గతికుండును = కలవాడును; స్నేహంబునన్ = ప్రీతి; చేసి = వలన; పుత్ర = పుత్రులు; దార = భార్యలను; ఉపలాలనపరుండును = బుజ్జగించెడివాడు; ఐ = అయ్యి; కాలకన్య = కాలకన్యచే; ఉపమర్థితంబునున్ = నలుగగొట్టబడినది; గంధర్వ = గంధర్వులు {గంధర్వులు - గంధ (వాసనలు) మోసుకొచ్చెడివారు (అహోరాత్రులు)}; యవన = యవనులచే {యవనులు - యవనిక (తెరచాటు) నందుండువారు}; ఆక్రాంతంబున్ = ఆక్రమింపబడినది; ఐన = అయిన; పురంబున్ = పురమును {పురము - దేహము}; విడువన్ = విడిచి వెళ్ళుటకు; ఇచ్చ = ఇష్టము; లేకయున్ = లేకుండగ; విడువన్ = విడుచుటకు; ఉపక్రమించెన్ = సిద్దపడెను; అప్పుడు = అప్పుడు.

భావము:

ఇంకా కాలకన్యచేత కబళింపబడిన తనను, శత్రువులచేత ధ్వంసం చేయబడ్డ పాంచాల సైన్యాలను చూచి అంతులేని శోకంతో అలమటించాడు. అతనికి ప్రతిక్రియ తోచలేదు. కాలకన్య కారణంగా నిస్సారాలైనప్పటికీ కామాలను కోరుకుంటూ, ప్రేమబంధాన్ని త్రెంచుకోలేక పుత్రులను, భార్యను బుజ్జగించాడు. గంధర్వులు, యవనులు ముట్టడించిన పురాన్ని విడవటం ఇష్టం లేకపోయినా విడవడానికి పూనుకున్నాడు. అప్పుడు…

4-820-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఘా! భయనామాగ్రజుఁ
నఁగల ప్రజ్వారుఁ డపుడ రుదెంచి పురం
బును సకలంబును భయనా
మునికిం బ్రీతిగ దహించె మునుకొని యంతన్.

టీకా:

అనఘా = పుణ్యుడా; భయ = భయుడు; నామ = అనెడి పేరు గల వానికి; అగ్రజుడు = అన్నగారు {అగ్రజుడు – ముందు పుట్టినవాడు, అన్నగారు}; అనన్ = అనుటకు; కల = తగిన; ప్రజ్వారుడు = ప్రజ్వారుడు {ప్రజ్వారుడు - పెద్దదైన జ్వరము యైనవాడు}; అపుడు = అప్పుడు; అరుదెంచి = వచ్చి; పురంబునున్ = పురమును; సకలంబునున్ = సమస్తమును; భయ = భయుడు యనెడి; నామున్ = పేరు గల వాని; కిన్ = కి; ప్రీతిగన్ = కోరి; దహించెన్ = ఆహుతి చేసెను; మునుకొని = పూనుకొని; అంతన్ = అంతట.

భావము:

పుణ్యాత్మా! యవనేశ్వరుడైన భయనాముని అన్న ప్రజ్వారుడు వచ్చి పురంజనుని పురాన్ని పూర్తిగా కాల్చి భయునికి ప్రీతి కలిగించాడు.

4-821-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లు పురంబు దహ్యమానం బగుచుండఁ బౌర భృత్యవర్గాది సమన్వితుండును, గౌటుంబికుండును, బుత్రాది సమన్వితుండును, యవనోపరుద్ధాలయుండును, గాలకన్యాగ్రస్తుండును నయిన పురంజనుం డప్పురంబునందుఁ బ్రజ్వార సంస్పృష్టుండై యనుతాపంబు నొంది తత్పురపాలనంబు నందు సమర్థుండు గాక పురుకృచ్చ్రోరువేపథుం డయి యందుండ నశక్తుం డయ్యె; నంత.

టీకా:

అట్లు = ఆ విధముగ; పురంబున్ = పురము; దహ్యమానంబున్ = కాలిపోవుట; అగుచుండన్ = జరుగుతుండగా; పౌర = పౌరులు; భృత్య = సేవకులు; వర్గ = సమూహములు; ఆది = మొదలగునవి; సమన్వితుండును = కూడినవాడు; కౌటుంబికుడును = కుటుంబవంతుడును; పుత్ర = పుత్రులు; ఆది = మొదలగువారు; సమన్వితుండును = కూడినవాడు; యవన = యవనులుచే; ఉపరుద్ధ = ముట్టడిచేయబడిన; ఆలయుండును = పురము కలవాడును; కాలకన్యా = కాలకన్యచే; గ్రస్తుండునున్ = ఆక్రమింపబడినవాడు; అయిన = అయిన; పురంజనుండు = పురంజనుడు {పురంజనుడు - పురమున వసించెడివాడు}; ఆ = ఆ; పురంబున్ = పురమున; ప్రజ్వార = ప్రజ్వారునిచే; సంస్పృష్టుండు = మిక్కిలిగా తగుల్కొన్నవాడు; ఐ = అయ్యి; = అనుతాపంబున్ = వగపు; ఒంది = పొంది; తత్ = ఆ; పుర = పురమును; పాలనంబున్ = పరిపాలనము; అందున్ = చేయుటకు; సమర్థుండు = నేర్పరి; కాక = కాలేక; పురు = అధికమైన; కృచ్ఛ = కష్టములచే; ఉరు = మిక్కిలి; వేపథుండు = వణకిపోవుతున్నవాడు; అయి = అయ్యి; అందున్ = దానిలో; ఉండన్ = ఉండుటకు; అశక్తుండు = శక్తిచాలనివాడు; అయ్యెన్ = అయ్యెను; అంతన్ = అంత.

భావము:

ఆ విధంగా పురం కాలిపోతుండగా పౌరులతోను, సేవకులతోను, కుటుంబంతోను, పుత్రులతోను కూడుకొనినవాడై, కాలకన్యకు పట్టుబడినవాడై, యవనుల చేత ఆక్రమింపబడిన పురాన్ని రక్షించుకొనడానికి అశక్తుడయ్యాడు. అప్పుడు…

4-822-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శిఖియుత తరుకోటర
నిసిత పన్నగము పగిది నిజపురి వెడలం
దివురుచు నతఁడు శిథిల దవ
వుఁడును గంధర్వ గణ విత శౌర్యుండున్.

టీకా:

దవశిఖి = దావానలము; యుత = కలిగిన; తరు = చెట్టు; కోటర = తొఱ్ఱ యందు; నివసిత = వసించి యుండు; పన్నగము = పాము; పగిదిన్ = వలె; నిజ = తన; పురిన్ = పురమును; వెడలన్ = వెలువడుటకు; తివురుచున్ = ప్రయత్నిస్తూ; అతడు = అతడు; శిధిల = శిధిలమైన; అవయవుండును = అవయవములు కలవాడు; గంధర్వ = గంధర్వుల; గణ = సమూహముచే; విహత = మిక్కిలి నష్టపరుపబడిన; శౌర్యుండున్ = శౌర్యము కల వాడును.

భావము:

పురంజనుడు దావాగ్ని చుట్టుముట్టిన చెట్టు తొఱ్ఱలో ఉన్న పామువలె పురంనుండి వెలువడటానికి ప్రయత్నిస్తూ గంధర్వుల దాడి చేత బలం కోల్పోయినవాడు (అయి)….

4-823-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యి చాల ఘురఘుర ను శబ్ద మడరంగ-
నమునఁ జింతా నిగ్నుఁ డగుచుఁ
గొడుకులఁ గోడండ్రఁ గూతుల నల్లుర-
నుమల నాప్తుల నుచరాళి
నయంబు నల్పమాత్రావశిష్టం బైన-
గృహకోశనివహ పరిచ్ఛదముల
సలు నహంకార మకారములఁ జేసి-
తిహీనుఁ డగుచు నెమ్మనములోనఁ

4-823.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డఁకఁ దలఁచుచు విప్రయోమునఁ దాను
టకటా! యిట్లు పరలోక తుఁడ నైన
యిట్టి భార్య యనాథయై యీ కుమార
రుల నేరీతిఁ బ్రోచునో రసి యనుచు.

టీకా:

అయి = అయ్యి; చాలన్ = పెద్దగా; ఘురఘురము = గురగుర; అను = అనెడి; శబ్దము = శబ్దము; అడరంగ = వ్యాపించుతుండగా; మనమునన్ = మనసులో; చింతన్ = దుఃఖమున; నిమగ్నుడు = ములిగినవాడు; అగుచున్ = అవుతూ; కొడుకులన్ = కుమారులను; కోడండ్రన్ = కోడళ్ళను; కూతులన్ = కుమార్తెలను; అల్లురన్ = అల్లుళ్ళను; = మనుమలన్ = మనుమలను; ఆప్తులన్ = దగ్గరవారిని; అనుచర = అనుచరుల; ఆళిన్ = సమూహమును; అనయంబున్ = ఎల్లప్పుడు; అల్ప = కొద్దిగా; మాత్ర = మాత్రమే; అవశిష్టంబున్ = మిగిలినది; ఐన = అయిన; = గృహ = ఇళ్ళు; కోశ = ధనము; నివహ = సమూహముల; పరిచ్చదములన్ = పరివారములయందు; మసలు = తిరిగెడి; అహంకార = నేను యనెడి భావన; మమకారముల్ = నాది అనెడి భావములు; చేసి = వలన; మతి = మతి; విహీనుండు = పోయినవాడు; అగుచున్ = అవుతూ; నెఱిన్ = నిండు; మనమునన్ = మనసు; లోనన్ = లో; కడకన్ = పూని; తలచుచున్ = తలచుకొనుచు.
విప్రయోగమునన్ = ఎడబాటున; తానున్ = తను; ఇట్లు = ఈ విధముగ; పరలోకగతుడను = మరణించినవాడను {పరలోకగతుడు - పరలోకమునకు పోవువాడు, మరణించినవాడు}; ఐన = అయినచో; ఇట్టి = ఇటువంటి; భార్య = భార్య; అనాథ = దిక్కులేనిది; ఐ = అయ్యి; ఈ = ఈ; కుమార = పుత్ర; వరులన్ = ఉత్తములను; ఏరీతిన్ = ఏ విధముగ; ప్రోచునో = కాపాడునో; అరసి = పూని; అనుచున్ = అనుకొనుచు.

భావము:

అతని గొంతులో గురగురమనే శబ్దం బయలుదేరింది. దుఃఖంలో మునిగి పోయాడు. కొడుకులను, కోడండ్రను, కూతుండ్రను, అల్లుండ్రను, మనుమలను, చుట్టాలను, సేవకులను తలచుకున్నాడు. తన మందిరంలో కొద్దిగా మిగిలిన ధనాన్ని, వస్త్రాలను తలచుకున్నాడు. అహంకారం వల్ల మమకారం వల్ల అతని బుద్ధి చెడింది. “అయ్యో! తన ఎడబాటు వల్ల అనాథగా మారే తన భార్య కొడుకులను కాపాడగలదో లేదో అని విలపించాడు.”

4-824-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నిట్లని తలంచు.

టీకా:

మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అని = అని; తలంచు = భావించును.

భావము:

ఇంకా ఇలా ఆలోచించాడు.

4-825-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డఁతి యే మును భుజింక భుజింపదు; నేను-
నిద్ర పోవక మఱి నిద్ర పోదు;
నేను నీళ్ళాడక నీళ్ళాడ నొల్లదు-
దరి యేఁ గోపింప యము నొందు;
ర్జించినను మాఱులుకక వాయోడు-
బుద్ధిహీనుఁడనైన బుద్ధి చెప్పు;
లి మీఱ నిట్టి కత్రంబుతో నేను-
డఁగి దేహాంతరతుఁడ నైన

4-825.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నయమును దాను బుత్రిణి గుటఁ జేసి
యాత్మశోచిని యగుచు గృస్థ ధర్మ
మాచరించుచు నుండునో? నుగమనము
చేయునో? యని మనమునఁ జింత నొంది.

టీకా:

పడతిన్ = స్త్రీని; ఏన్ = నేను; మును = ముందుగా; భుజింపక = తినక; భుజింపదు = తినదు; నేను = నేను; నిద్ర = నిద్ర; పోవక = పోకుండగ; మఱి = మరి; నిద్ర = నిద్ర; పోదు = పోదు; నేను = నేను; నీళ్ళాడక = స్నానము చేయక; నీళ్ళాడన్ = స్నానము చేయుటకు; ఒల్లదు = ఒప్పుకొనదు; పదరి = కోపించి; ఏన్ = నేను; కోపింపన్ = కోపపడిన; భయమున్ = భయమును; ఒందున్ = పొందును; భర్జించిననున్ = బెదిరించినను; మాఱుపలుకక = మారుమాట్లాడక; వాయున్ = నోరు విప్ప; ఓడున్ = భయపడును; బుద్దిహీనుడన్ = తెలివితక్కువవాడను; ఐనన్ = అయినచో; బుద్ధి = సలహాలు; చెప్పున్ = చెప్పును; లలిన్ = క్రమము; మీఱని = తప్పని; ఇట్టి = ఇటువంటి; కళత్రంబు = భార్య; తోన్ = తోటి; నేను = నేను; కడగి = పూని; దేహాంతరగతుడను = మరణించినవాడను {దేహాంతరగతుడు - మరియొకదేహమునకు పోవువాడు, మరణించిన వాడు}; ఐనన్ = అయినచో; అనయమును = అవశ్యము; తానున్ = తను; పుత్రిణి = పుత్రులుకలది.
అగుటన్ = అగుట; చేసి = వలన; ఆత్మ = తన గురించి; శోచిని = శోకించునది; అగుచున్ = అవుతూ; గృహస్థ = గృహ నిర్వహించెడి; ధర్మము = పద్దతి; ఆచరించునో = నడచునో; అనుగమనమున్ = (సతీ) సహగమనము; చేయునో = చేయునో; అని = అని; మనమునన్ = మనసులో; చింతన్ = విచారమును; ఒంది = పొంది.

భావము:

“నా భార్య నాకంటే ముందు భుజింపదు, స్నానం చేయదు. నేను కోపిస్తే భయపడుతుంది. అదలిస్తే బెదరి ఎదురాడదు. నేను తెలివితక్కువతో ఏ పనికైనా పూనుకుంటే నాకు బుద్ధి చెపుతుంది. ఇటువంటి అనుకూలవతి అయిన భార్య నేను మరణించిన తరువాత బిడ్డలను రక్షించడానికి బ్రతికి ఉంటుందో లేక సహగమనం చేస్తుందో” అని మనస్సులో చింతించి…

4-826-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పుత్రులుఁ దన పౌత్రులు
యముఁ దాఁ జనినయెడ నిరాశ్రయు లగుచున్
నిధి మధ్యంబున నవి
సి కలముం బోలె నెట్లు జీవించెదరో ?

టీకా:

తన = తన యొక్క; పుత్రులు = కుమారులు; తన = తన; పౌత్రులు = మనుమలు; అనయమున్ = తప్పక; తాన్ = తను; చనిన = చనిపోయిన; ఎడన్ = చో; నిరాశ్రయులు = దిక్కు లేనివారు; అగుచున్ = అగుతూ; వననిధి = సముద్రము {వననిధి - వనము (నీరు)నకు నిధివంటిది, సముద్రము}; మధ్యంబునన్ = మధ్యలో; అవిసిన = పగిలిన; కలమున్ = ఓడ; పొలెన్ = వలె; ఎట్లు = ఏ విధముగ; జీవించెదరో = బతికెదరో.

భావము:

తన మరణానంతరం తన పుత్రులు, మనుమలు దిక్కులేనివారై నడి సముద్రంలో పగిలిపోయిన ఓడలాగా ఎలా జీవిస్తారో…

4-827-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యివ్విధమునఁ గృపణుని
నువున ఘనదుఃఖ విహ్వలానర్హుం డ
య్యును దుఃఖించు పురంజను
యముఁ గొనిపోవ నిశ్చితాత్ముం డగుచున్.

టీకా:

అని = అని; ఇవ్విధమునన్ = ఈ విధముగ; కృపణున్ = దీనుని; అనువుననన్ = వలె; ఘన = అతి మిక్కిలి; దుఃఖ = దుఃఖమువలన; విహ్వల = విలవిలలాడుటకు; అనర్హుండు = అర్హత లేనివాడు; అయ్యును = అయినప్పటికిని; దుఃఖించు = దుఃఖించెడి; పురంజనున్ = పురంజనుని; అనయమున్ = అవశ్యము; కొనిపోవన్ = తీసుకొనిపోవ; నిశ్చితాత్ముడు = నిశ్చయించుకొనినవాడు; అగుచున్ = అగుచూ.

భావము:

అని ఈ విధంగా దీనునివలె దుఃఖించే పురంజనుని తీసికొని పోవటానికి నిశ్చయించుకొని….

4-828-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుదెంచెను భయనాముం
నువాఁ డప్పుడు పురంజనాఖ్యుఁడు పెలుచన్
వినుతాత్మ! పశువు భంగిని
ము గలఁగ యవన నీయమానుం డయ్యెన్.

టీకా:

చనుదెంచెను = వచ్చెను; భయనాముండు = భయనాముడు; అను = అనెడి; వాడున్ = వాడు; అప్పుడున్ = అప్పుడు; పురంజన = పురంజనుడు; ఆఖ్యుడు = అని పేరు గలవాడు; పెలుచన్ = కాఠిన్యముతో; వినుతాత్మ = స్తుతింబడువాడ; పశువున్ = పశువును; భంగిన్ = వలె; మనమున్ = మనసులో; కలగన్ = కలతచెందగా; యవన = యవనునిచే; ఈయమానుండున్ = కొనిపోబడినవాడు; అయ్యెన్ = అయ్యెను.

భావము:

భయనాముడు వచ్చాడు. పురంజనుని పట్టుకొని పశువును కట్టినట్లు కట్టి ఈడ్చుకొనిపోయాడు.

4-829-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనుచర వర్గంబు భృశాతురులును దుఃఖితులునై వెనుచనుచుండ నుపరుద్ధంబగు భుజంగమం బప్పురంబు నెప్పుడు వాసె నప్పు డా పురంబు పురంజను బాసి విశీర్ణంబై ప్రకృతిం బొందె; బలవంతుండయిన యవనునిచేత బలాత్కారంబున వికృష్యమాణుండైన పురంజనుండు దమఃపిహితుం డై పూర్వ సుహృత్తగు సఖు నీశ్వరు నెఱుంగకుండె; నంతం బరలోకగతుండైన పురంజనుం గదిసి పూర్వంబున నదయుం డైన యతనిచేత హింసింప బడిన యజ్ఞపశువులు క్రోధోద్రేకంబునఁ గుఠారంబులనతని నఱకె; నివ్విధంబునఁ బ్రమదాసంగదోష దూషితుండును, నపార తమోనిమగ్నుండును, నష్టజ్ఞానుండును నయి పురంజనుం డనేక కాలంబు పరలోకంబున నార్తి ననుభవించి తద్భార్యయైన ప్రమదోత్తమం జిత్తంబున నశ్రాంతంబును దలంచుచుండం దదీయ సంస్మరణంబునం జేసి తరవాతి జన్మంబున విదర్భరాజ గృహంబునం బ్రమదోత్తమ యై జన్మించె; నంత.

టీకా:

అనుచర = అనుచరుల; వర్గంబున్ = సమూహములు; భృశ = మిక్కిలిగా; ఆతురులును = ఆదుర్ధాపడెడివారు; దుఃఖితులున్ = దుఃఖిండెడివారు; ఐ = అయ్యి; వెను = వెంట; చనుచుండన్ = పోవుచుండగా; ఉపరుద్దంబున్ = అడ్డగించునది; అగు = అయిన; భుజంగమమున్ = పాము {పాము - శ్వాసకు గుర్తు}; ఆ = ఆ; పురంబున్ = పురమును; ఎప్పుడున్ = ఎప్పుడైతే; వాసెను = విడిచెనో; అప్పుడున్ = అప్పుడే; ఆ = ఆ; పురంబున్ = పురము; పురంజనున్ = పురంజనునికి; పాసి = దూరమై; విశీర్ణంబున్ = శిథిలమైనది; ఐ = అయ్యి; ప్రకృతిన్ = ప్రకృతిని; పొందెన్ = చెందెను; బలవంతుండు = బలశాలి; అయిన = ఐన; యవనునిన్ = యవనుని; చేతన్ = చేత; బలాత్కారంబునన్ = బలవంతముగా; వికృష్యమానుండు = లాగబడినవాడు; ఐన = అయిన; పురంజనుండు = పురంజనుడు; తమః = చీకటిచే; పిహితుండున్ = కప్పబడినవాడు; ఐ = అయ్యి; పూర్వ = మునుపటి; సుహృత్ = స్నేహితుడు; అగు = అయిన; సఖున్ = సఖుడు; ఈశ్వరున్ = భగవంతుని; ఎఱుంగకుండె = తెలియకుండెను; అంతన్ = అంతట; పరలోకగతుండున్ = మరణించినవాడు {పరలోకగతుడు - పరలోకమునకు పోవువాడు, మరణించినవాడు}; ఐన = అయిన; పురంజనున్ = పురంజనుని; కదిసి = దగ్గరకుచేరి; పూర్వంబునన్ = మునుపు; అదయుండు = దయలేనివాడు; ఐన = అయిన; అతనిన్ = అతని; చేతన్ = చేత; హింసింపబడిన = సంహరింపబడిన; యజ్ఞ = యజ్ఞమునకైన; పశువులున్ = పశువులు; క్రోధ = కోపము యొక్క; ఉద్రేకంబునన్ = ఉద్రేకముతో; కుఠారంబులన్ = గొడ్డళ్ళతో; అతనిన్ = అతనిని; నఱకెన్ = నఱికెను; ఇవ్విభంబునన్ = ఈ విధముగ; ప్రమదా = స్త్రీలతోటి; సంగ = సాంగత్య; దోష = దోషము వలన; దూషితుడునున్ = చెడిపోయినవాడు; అపార = అంతులేని; తమః = తమోగుణమున, చీకటిలో; నిమగ్నుండును = మునిగినవాడు; నష్ట = పోయిన; జ్ఞానుండునున్ = జ్ఞానము కలవాడు; అయి = ఐ; పురంజనుండు = పురంజనుడు; అనేక = చాలా; కాలంబున్ = కాలము; పరలోకంబునన్ = పరలోకమున; ఆర్తిన్ = బాధను; అనుభవించి = అనుభవించి; తత్ = అతని; భార్య = భార్య; ఐన = అయిన; ప్రమద = స్త్రీలలో; ఉత్తమన్ = ఉత్తమురాలిని; చిత్తంబునన్ = మనసులో; అశ్రాంతంబున్ = విసుగులేక; తలంచుచుండన్ = తలచుకొనుచుండగా; తదీయ = ఆమెను; సంస్మరణంబునన్ = తలచుకొనుట; చేసి = వలన; తరువాతి = తరువాతి; జన్మంబునన్ = పుట్టుకలో; విదర్భ = విదర్భదేశపు {విదర్భ - విశిష్టమైన దర్భలుగల దేశము, కర్మప్రధానమని భావించెడివాడు}; రాజ = రాజుయొక్క; గృహంబునన్ = ఇంటిలో; ప్రమద = స్త్రీ లలో; ఉత్తమన్ = ఉత్తమురాలు; ఐ = అయ్యి; జన్మించెన్ = పుట్టెను; అంతన్ = అంత.

భావము:

అప్పుడు పురంజనుని పరిజనులు దుఃఖిస్తూ వెంబడించారు. పురాన్ని రక్షించే పాము విడిచిపోగానే ఆ పురం పురంజనుని విడిచి పంచభూతాలలో కలిసిపోయింది. శక్తిశాలి అయిన యవనుని చేత బలవంతంగా లాగుకొని పోబడుతున్న పురంజనుడు అజ్ఞానంతో తన మిత్రుడైన ఈశ్వరుని తెలిసికొనలేకపోయాడు. పరలోకంలో పూర్వం అతడు దయమాలి చంపిన యజ్ఞపశువులు మహాకోపంతో గొడ్డళ్ళతో అతనిని నరికివేశాయి. స్త్రీ సంగ దోషం చేత దూషితుడై జ్ఞానం కోల్పోయిన పురంజనుడు చాలకాలం పరలోకంలో దుఃఖాన్ని అనుభవించాడు. భార్యను మనస్సులో ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండటం చేత తరువాతి జన్మలో విదర్భరాజు కుమార్తెగా జన్మించాడు.

4-830-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వనీశ! వీర్యపణాత్త యైనట్టి వై-
ర్భిని మలయకేనుఁ డనంగఁ
రపురంజయుఁ డైన పాండ్యభూమీశుండు-
దారుణ సంగర స్థలమునందు
క్తి ననేక రాన్యుల నిర్జించి-
రిణయం బయ్యె; నా గురుభుజుండు
నా విదర్భాత్మజయం దసితేక్షణ-
యైన కూఁతును ద్రవిడాధినాథు

4-830.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లైన కొడుకుల నేడ్వుర ర్థిఁ గనియె
వారలకు నెల్ల నొక్కొక్క రుస నర్బు
దార్బుద సుతులు సంజాతు లైరి; యతని
సుత ధృతవ్రత నా యగస్త్యుఁడు వరించె.

టీకా:

అవనీశ = రాజా {అవనీశుడు - అవని (భూమి)కి ఈశుడు, రాజు}; వీర్య = పరాక్రమమే; పణా = వెలగా; ఆత్త = కొనబడినది; ఐన = అయిన; అట్టి = అటువంటి; వైదర్భిని = విదర్భరాజుకూతురును; మలయకేతనుడు = మలయకేతనుడు {మలయకేతనుడు - మలయ (విష్ణుభక్తి ప్రధానముగా కల దక్షిణ దేశము) అందు కేతనుడు (శ్రేష్టుడు)}; అనంగన్ = అనెడి; పర = శత్రువుల, ఇతరుల; పురన్ = పురములను; జయుడు = జయించెడివాడు; ఐన = అయిన; పాండ్య = పాండ్యదేశపు {పాండ్యభూమీశుడు - పండా (నిశ్చయబుద్ధి) కలవాడు (పాండ్యుడు) వారిదేశము పాండ్యము, పాండ్యదేశపురాజు, మలయకేతనుడు}; భూమీశుండు = రాజు {భూమీశుడు - భూమికి ప్రభువు, రాజు}; దారుణ = దారుణమైన; సంగర = యుద్ద; స్థలమున్ = భూమి; అందున్ = లో; శక్తిన్ = బలముతోటి; అనేక = అనేకమైన; రాజ = రాజులు; అన్యులన్ = ఇతరులను; నిర్జించి = ఓడించి; పరిణయంబున్ = వివాహము; అయ్యెన్ = చేసికొనెను; ఆ = ఆ; గురు = మిక్కిలి; భుజుండున్ = భుజబలముకలవాడు; ఆ = ఆ; విదర్భ = విదర్భుని; ఆత్మజన్ = పుత్రికను; అందున్ = అందు; అసిత = నల్లని {అసితేక్షణ - నల్లని కన్నులుకలామె, అసిత (నల్లనివాడైన కృష్ణుని యందు) ఈక్షణ చూపుకలామె), కృష్ణునిసేవించుట యందు రుచికలామె}; ఈక్షణ = కన్నులుకలామె; ఐన = అయిన; కూతున్ = పుత్రికను; ద్రవిడ = ద్రవిడదేశపు {ద్రవిడాధినాథులైననేడ్వురు వీర్యుని కొడుకులు - శ్రవణము కీర్తనము మొదలైన ఏడువిధములైన భక్తిమార్గములు}; అధినాథులు = రాజులు; ఐన = అయినట్టి.
కొడుకులన్ = కుమారులను; ఏడ్వురన్ = ఏడుగురిని (7); అర్థిన్ = కోరి; కనియెన్ = పుట్టించెను; వారల్ = వారి; కున్ = కి; ఎల్లన్ = అందరకు; ఒక్కొక్క = ఒక్కొక్కరికి; వరుసన్ = వరుసగా; అర్బుదార్భుద = అనేకమైన {అర్బుదార్బుదములు - క్షితి (1 తరవాత 20సున్నాలు) అర్బుదము (1 తరువాత 10సున్నాలు, వేయికోట్లు) అనేకము}; సుతులు = కుమారులు; సంజాతులు = పుట్టినవారు; ఐరి = అయిరి; అతనిన్ = అతనియొక్క; సుత = కుమార్తె (లోపాముద్ర); ధృతవ్రతన్ = వ్రతదీక్షకలామెను; ఆ = ఆ; అగస్త్యుడు = అగస్త్యుడు {అగస్త్యుడు - మనస్సునకు సంకేతము}; వరించెన్ = వివాహమాడెను.

భావము:

రాజా! పాండ్యరాజైన మలయధ్వజుడు యుద్ధంలో ఎందరో రాజులను గెలిచి ఆ విదర్భరాజు పుత్రికను వీర్యశుల్కంగా పొందాడు. ఆమెవల్ల అతనికి ఒక కుమార్తె, ఏడుగురు కుమారులు కలిగారు. ఆ కుమారులకు ఒక్కొక్కరికి పదికోట్లమంది కొడుకులు జన్మించి ద్రవిడ దేశాన్ని నేర్పుతో పరిపాలించారు. మలయధ్వజుని కుమార్తె ధృతవ్రత (లోపాముద్ర) అగస్త్యుని వరించింది.

4-831-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తఁ డా కన్యక వలనను
తురుండై యిధ్మవాహనకుఁ డగు దృఢ
చ్యుతుఁడను మునీంద్రుఁ గనియెను
తి నంత విరక్తుఁ డగుచు లయధ్వజుఁడున్.

టీకా:

అతడున్ = అతడు; ఆ = ఆ; కన్యక = స్త్రీ; వలనను = అందు; చతురుండు = నేర్పరి; ఐ = అయ్యి; ఇధ్మవాహ = ఇధ్మవాహకుని {ఇధ్మవాహకుడు - ఇధ్మము (సమిధ)లను వాహకుండు (మోసెడివాడు), సమిత్పాణి}; జనకుడున్ = తండ్రి; అగు = అయిన; దృఢచ్యుతుడు = దృఢచ్యుతుడు {దృఢచ్యుతుడు - దృఢ అచ్యుతుడు, జారనట్టి దీక్షకలవాడు, సత్యలోకాది భోగములనుండి చ్యుతుడు (జారినవాడు), ఐహికాముష్మిక భోగముల ఎడ విరాగము కలవాడు}; అను = అనెడి; ముని = మునులలో; ఇంద్రునిన్ = ఇంద్రుని వంటివానిని; కనియెన్ = పుట్టించెను; మతిన్ = మనసున; అంతన్ = అంతట; విరక్తుడు = వైరాగ్యభావము చెందినవాడు; అగుచున్ = అవుతూ; మలయకేతనుడు = మలయకేతనుడు.

భావము:

అగస్త్యుడు ఆ మలయధ్వజుని కుమార్తె ధృతవ్రత (లోపాముద్ర) వల్ల దృఢచ్యుతుడు అనే పుత్రుని పొందాడు. అ దృఢచ్యుతునకు ఇధ్మవాహుడు జన్మించాడు. అప్పుడు మలధ్వజుడు విరక్తి చెంది….

4-832-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్ష్మాతలంబెల్ల నిజతనూజాతులకును
బంచి యిచ్చి సరోజాక్ష పాదపంక
జార్చనాయత్తుఁ డగుచుఁ గులాద్రి కరుగ
నంత మదిరాక్షి సతి యగు నా విదర్భి.

టీకా:

క్ష్మాతలంబు = భూమండలము; ఎల్లన్ = అంతటిని; నిజ = తన; తనూజాతుల్ = పుత్రుల; కున్ = కి; పంచి = పంచి, భాగించి; ఇచ్చి = ఇచ్చి; సరోజాక్ష = నారాయణుని {సరోజాక్షుడు - సరోజము (పద్మము)ల వంటి కన్నులు కలవాడు, విష్ణువు}; పాద = పాదములు అనెడి; పంకజ = పద్మముల {పంకజము - పంకము (బురద, నీరు)యందు జ (జన్మించినది), పద్మము}; అర్చనా = పూజించుట యందు; ఆయత్తుడు = మెలకువగా యుండెడివాడు; అగుచున్ = అగుచూ; కులాద్రి = కులపర్వతము; కిన్ = కి; అరుగన్ = వెళ్ళగా; అంతన్ = అప్పుడు; = మదిరాక్షిసతి = స్త్రీ {మదిరాక్షిసతి - మదిర (మత్తుగా యుండెడి) అక్షి(కన్నులు కలిగిన) సతి (స్త్రీ)}; అగు = అయిన; ఆ = ఆ; విదర్భి = విదర్భరాకుమారి.

భావము:

భూమినంతటినీ తన కొడుకులకు పంచియిచ్చి, శ్రీహరిని కొలువాలనుకొని కులపర్వతం వద్దకు వెళ్ళాడు. మలయధ్వజుని భార్య వైదర్భి…

4-833-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డఁక గృహములు నఖిల భోములు విడిచి
చంద్రు వెనుచను చంద్రిక చందమునను
క్తి దళుకొత్తఁ బాండ్యభూపాలుఁ డయిన
లయకేతను వెనుకొని గువ చనియె.

టీకా:

కడకన్ = పూని; గృహములున్ = ఇండ్లు; అఖిల = సర్వ; భోగములున్ = సిరిసంపదలను; విడిచి = విడిచిపెట్టి; చంద్రున్ = చంద్రుని; వెనుచను = వెనకాతలే వెళ్ళెడి; చంద్రిక = వెన్నెల; చందముననున్ = వలె; భక్తిన్ = భక్తి; తళుకొత్తన్ = మిక్కిలి ప్రకాశించునట్లుగా; పాండ్య = పాండ్యదేశపు; భూపాలుడు = రాజు {భూపాలుడు - భూమిని పాలించెడివాడు, రాజు}; అయిన = అయినట్టి; మలయకేతనున్ = మలయకేతనుని; వెనుకొని = కూడా; మగువ = స్త్రీ; చనియెన్ = వెళ్ళెను.

భావము:

గృహాలను, సర్వభోగాను విడిచిపెట్టి చంద్రుని వెన్నంటి వెళ్ళే వెన్నెల లాగా భక్తితో భర్తను అనుసరించింది.

4-834-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లు ధర్మపత్ని వెంటరాఁ జని యందుఁ జంద్రమసా తామ్రపర్ణీ నవోదక లను నదుల పుణ్యజలంబుల సుస్నాతుం డయి ప్రక్షాళిత బాహ్యాభ్యంతర మలుండును గందమూల ఫల బీజ పుష్ప పర్ణ తృణ తోయాహారుండునై కాయకర్శనంబైన తపం బాచరించుచు శీతోష్ణ వర్ష వాతంబులు క్షుత్పిపాసలుఁ బ్రియాప్రియంబులు సుఖదుఃఖంబులు నను ద్వంద్వంబుల సమదర్శనుండై జయించి తపోవిద్యాయమ నియమంబులం జేసి పక్వకషాయుండై బ్రహ్మంబునందు నిజాత్మ ననుసంధించి విజితేంద్రియ ప్రాణ చిత్తుండై స్థాణువుం బోలె దివ్యవర్ష శతంబు దపంబు చేసి భగవంతుం డయిన వాసుదేవుని యందుఁ బ్రీతి వహించుచు నన్యం బెఱుంగక వర్తించుచుఁ దన్ను స్వప్నమందు ‘మమేదం శిరశ్ఛిన్నమితి’ యను ప్రతీతియందుం బోలె వ్యతిరిక్తునిఁగా వ్యాపకునిఁగా నంతఃకరణవృత్తిసాక్షినింగా నెఱింగి.

టీకా:

అట్లు = ఆ విధముగ; ధర్మపత్ని = భార్య {ధర్మపత్ని - అగ్నిసాక్షిగా పెండ్లాడిన భార్య}; వెంటన్ = కూడా; రాన్ = రాగా; చని = వెళ్ళి; అందున్ = అక్కడ; చంద్రమసా = చంద్రమస; తామ్రపర్ణి = తామ్రపర్ణి; నవోదకలున్ = నవోదకలు; అను = అనెడి; నదుల = నదులలోని; పుణ్య = పుణ్యవంతమైన; జలంబులన్ = నీటిలో; సుస్నాతుండు = చక్కగా స్నానము చేసినవాడు; అయిన్ = అయ్యి; ప్రక్షాళిత = చక్కగా శుభ్రపరచబడిన; బాహ్య = వెలుపలి; అభ్యంతర = లోపలి; మలుండు = మలములు కలవాడు; కందమూల = కంద దుంపలు; ఫల = ఫలములు; బీజ = గింజలు; పుష్ప = పూలు; పర్ణ = ఆకులు; తృణ = గడ్డి; తోయ = నీరు; ఆహారుండున్ = ఆహారముగా కలవాడు; ఐ = అయ్యి; కాయ = దేహమును; కర్శనంబున్ = కృశింపజేయునది; ఐన = అయిన; తపంబున్ = తపస్సును; ఆచరించుచున్ = చేయుచూ; శీత = చల్లదనము; ఉష్ణ = వేడిమి; వర్ష = వర్షము; వాతంబులు = వాయువులు; క్షుత్ = ఆకలి; పిపాసలు = దప్పులు; ప్రియ = ఇష్టమైనవి; అప్రియంబులున్ = అయిష్టమైనవి; సుఖ = సుఖములు; దుఃఖ = దుఃఖములు; అను = అనెడి; ద్వంద్వంబులన్ = ద్వంద్వభావములను; సమ = సమానమైన; దర్శనుండు = చూచెడివాడు; ఐ = అయ్యి; జయించి = లొంగదీసుకొని; తపః = తపస్సు; విద్యా = జ్ఞానము; యమ = యమము; = నియమంబులన్ = నియమములను; చేసి = వలన; పక్వకషాయుండు = పరిపక్వుడు {పక్వకషాయుడు – పరిపక్వము చెందిన విషయాభిలాషములు కలవాడు, విషయములపై కోరికలు లేనివాడు}; ఐ = అయ్యి; బ్రహ్మంబున్ = పరబ్రహ్మము; అందున్ = అందు; నిజ = తన యొక్క; ఆత్మన్ = ఆత్మను; అనుసంధించి = లగ్నముచేసి; విజిత = జయించిన; ఇంద్రియ = ఇంద్రియములు; ప్రాణ = ప్రాణములు; చిత్తుండు = మనసు కలవాడు; ఐ = అయ్యి; స్థాణువున్ = కదలికలేనిదాని, రాయి; పోలెన్ = వలె; దివ్యవర్ష = దివ్యసంవత్సరముల; శతంబున్ = నూటిని; తపంబున్ = తపస్సు; చేసి = చేసి; భగవంతుండు = విష్ణుమూర్తి {భగవంతుడు - మహిమాన్వితుడు, విష్ణువు}; అయిన = అయిన; వాసుదేవుని = విష్ణుమూర్తి {వాసుదేవుడు - వసించెడివాడు, విష్ణువు}; అందున్ = ఎడల; ప్రీతి = ఆసక్తి; వహించున్ = కలిగియుండెను; అన్యంబున్ = ఇతరమును; ఎఱుంగక = తెలియక; వర్తించుచున్ = ప్రవర్తిస్తూ; తన్నున్ = తనను; స్వప్న = కల; అందున్ = లో; మమ = నాది; ఇదమ్ = ఇదిగో; శిరస్ = తల; ఛిన్నమ్ = తెగగొట్టబడినది; ఇతి = అయ్యెన్; అను = అనెడి; ప్రతీతి = నానుడి; అందున్ = లో; పోలెన్ = వలె; వ్యతిరిక్తునిన్ = దేహమునకు భిన్నమైనవాని; తన = అగునట్లు; వ్యాపకునిన్ = సర్వ వ్యాపకుని; కాన్ = అగునట్లు; అంతఃకరణ = మనస్సు యొక్క; వృత్తి = ప్రవర్తనలకు; సాక్షినిన్ = సాక్షి; కాన్ = అగునట్లు; ఎఱింగి = తెలిసి.

భావము:

ఈ విధంగా భార్య తన వెంట రాగా మలయధ్వజుడు చంద్రమస, నవోదకం అనే నదులలో తీర్థమాడి మనసులోని మాలిన్యాన్ని, దేహంలోని మాలిన్యాన్ని తొలగించుకున్నాడు. కందమూలాలను, పండ్లను, విత్తనాలను, పువ్వులను, ఆకులను, గడ్డిని, నీళ్ళను ఆహారంగా తీసుకొంటూ గొప్ప తపస్సు చేసాడు. శీతోష్ణాలు, వర్షపాతాలు, ఆకలి దప్పులు, ప్రియాప్రియాలు, సుఖదుఃఖాలు అనే ద్వంద్వాలను సమానంగా భావించాడు. తపోవిద్యల చేత, యమ నియమాల చేత కామాది వాసనలను దహించి బ్రహ్మంలో తన ఆత్మను కూర్చి, ఇంద్రియాలను, ప్రాణాన్ని, మనస్సును గెలిచాడు. మ్రోడులాగా నిలిచి నూరు దివ్య సంవత్సరాలు తపస్సు చేసాడు. భగవంతుడైన వాసుదేవునిపై ప్రీతి తప్ప మరొకటి తెలియక ప్రవర్తించాడు. తనను కలలో ‘మమేదం శిర శ్ఛిన్న మిత్యాది’ (నా యీ శిరస్సు తెగగొట్ట బడినది) అన్న నానుడికి తగినట్లు తనను దేహానికి భిన్నంగా, సాక్షిగా తెలిసికొని…

4-835-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సాక్షాత్కృతుండును ర్వేశ్వరుండును-
గవంతుఁడును గృపారుఁడు నైన
రి యను లోకైక గురునిచే నుక్తమై-
ర్వతోముఖమును స్వప్రకాశి
ము నగు మహిత శుద్ధజ్ఞానదీపప్ర-
భాతతిచేఁ బరబ్రహ్మమందు
న్నును, దనయందుఁ గఁ బరబ్రహ్మంబు-
నెనయఁ గన్గొనుచు దగ్ధేంధనాగ్ని

4-835.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భంగి నీషణములఁ; బెడఁబాసి భూరి
వ్యసన సాగర సంసృతి లనఁ జాల
నుపరతుం డయ్యె; నా మహితోన్నతుండు
వని నాయక! విను మప్పు తని భార్య

టీకా:

సాక్షాత్కృతుండునున్ = స్వయముగా తానే కర్త యైన వాడును; సర్వేశ్వరుండునున్ = అఖిలమునకును ఈశ్వరుండును; భగవంతుండు = మహాత్మ్యము కలవాడును; కృపాపరుడునున్ = దయయే తానైన వాడును; ఐన = అయిన; హరి = విష్ణుమూర్తి; అను = అనెడి; లోక = లోకములకు; ఏక = ఒకడే యైన; గురుని = గురువు; చేన్ = చేత; ఉక్తమున్ = చెప్పబడినది; ఐ = అయ్యి; సర్వతః = అన్ని; ముఖమునున్ = వైపులకును ప్రసరించునది; స్వ = తనంతతానే; ప్రకాశితమున్ = వెల్లడి యగునది; అగు = అయిన; మహిత = గొప్పదియైన; శుద్ధ = స్వచ్ఛమైన; జ్ఞాన = జ్ఞానము అనెడి; దీప = దీపము యొక్క; ప్రభా = కాంతుల; తతిన్ = పుంజముల; చేన్ = చేత; పరబ్రహ్మము = పరబ్రహ్మము; అందున్ = లోను; తన్నున్ = తనను; తన = తన; అందున్ = అందును; పరబ్రహ్మంబున్ = పరబ్రహ్మమును; ఎనయన్ = సంపూర్ణముగా; కన్గొనుచున్ = దర్శించుతూ; = = దగ్ధ = కాలుతున్న; ఇంధన = కర్రలలోని; అగ్ని = నిప్పు.
భంగిన్ = వలె; ఈషణములన్ = కోరికలు; ఎడబాసి = తొలగి; భూరి = అత్యధికమైన; వ్యసన = బాధల; సాగర = సముద్రము యైన; సంసృతిన్ = సంసారము; వలనన్ = వలన; చాలన్ = మిక్కిలి; ఉపరతుండు = ఉడుగుట కలవాడు; అయ్యెన్ = అయ్యెను; ఆ = ఆ; మహిత = గొప్ప; ఉన్నతుండు = ఉన్నతమైనవాడు; అవనినాయక = రాజా {అవనినాయకుడు - భూమికి నాయకుడు, రాజు}; వినుము = వినుము; అప్పుడు = అప్పుడు; అతనిన్ = అతని యొక్క; భార్య = భార్య.

భావము:

స్వయంకర్త అయినవాడు, సర్వేశ్వరుడు, భగవంతుడు, దయామయుడు అయిన శ్రీహరి అనే ఆచార్యుడు అనుగ్రహించిన జ్ఞానం అనే దీపపు కాంతిచేత పరబ్రహ్మలో తనను, తనలో పరబ్రహ్మను దర్శించాడు. కాలిన కట్టెలను అగ్ని విడిచినట్లు ఈషణత్రయాన్ని విడిచిపెట్టాడు. దుఃఖసముద్రమైన సంసారం నుండి వైదొలగాడు. రాజా! విను. అప్పు డతని భార్య…

4-836-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తిదైవత శీల సమం
చి వేణీ భూత చికుర చీరాంబర సు
వ్ర చర్యా క్షామాంగి వి
దోష విదర్భరాజ న్యక యచటన్.

టీకా:

పతిదైవత శీల సమంచిత = పతివ్రత {పతిదైవత శీల సమంచిత - పతియే దైవముగ భావించెడి శీలము గలామె, పతివ్రత}; వేణీభూత = జడ అల్లబడిన; చికుర = ముంగురులు కలామె; చీరాంబర = నారచీరలు కలామె; సు = చక్కటి; వ్రత = వ్రతములు; చర్యా = చేయుటచే; క్షామ = చిక్కిన; అంగి = దేహము కలామె; విగత = పోయిన; దోష = దోషములు కలామె; విదర్భ = విదర్భ; రాజకన్యక = రాకుమారి; అచటన్ = అక్కడ.

భావము:

విదర్భరాజు కుమార్తె వైదర్భి పతినే దైవంగా భావించి, జడలు తాల్చి, నారవస్త్రాలు కట్టి, వ్రతనియమాల చేత బాగా చిక్కిపోయి అక్కడ…

4-837-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మలలోచన నిఖిలభోములఁ దొఱఁగి
లయ కేతనుఁ బరమ ధర్మజ్ఞుఁ జేరి
నిరుపమైక పతివ్రతా నియమ మొప్ప
సాధ్వియై భక్తిఁ బరిచర్య లుపు చుండె.

టీకా:

కమలలోచన = స్త్రీ {కమలలోచన – పద్మముల వంటి కన్నులు కలామె, స్త్రీ}; నిఖిల = అఖిలమైన; భోగములన్ = సౌఖ్యముల నుండి; తొఱగి = తొలగి; మలయకేతనున్ = మలయకేతనుని; పరమ = ఉన్నతమైన; ధర్మ = ధర్మము; జ్ఞ = జ్ఞానములు కలవాని; చేరి = దగ్గరకుచేరి; నిరుపమ = సాటిలేని; ఏక = ఏకాగ్రమైన; పతివ్రతా = పతివ్రతల యొక్క {పతివ్రత – పతిదైవత శీల సమంచిత, పతియే దైవతముగా ధరించెడి శీలము (స్వభావము)తో చక్క నామె}; నియమమున్ = నియమములు; ఒప్పన్ = ఒప్పియుండ; సాధ్వి = సాధుస్వభావము కలామె; ఐ = అయ్యి; భక్తిన్ = భక్తితో; పరిచర్యన్ = సేవలు; సలుపుచుండె = చేయుయుండెను.

భావము:

పద్మనయన అయిన ఆ వైదర్భి అన్ని సుఖాలను వదలి, మలయధ్వజుని చేరి పతివ్రతా ధర్మాన్ని పాటిస్తూ నియమంతో భక్తితో సేవలు చేస్తున్నది.

4-838-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విలమతి నిజేశు సమీ
మునన్ సతి ధూమరహిత వమానసఖా
గ్రమున వెలుఁగొందు కీల వి
మునఁ బ్రకాశించు చుండెఁ ద్దయు వేడ్కన్.

టీకా:

విమల = స్వచ్ఛమైన; మతిన్ = మనసుతో; నిజ = తన; ఈశున్ = భర్తకు; సమీపమునన్ = దగ్గరకు; సతి = పతివ్రత; ధూమ = పొగ; రహిత = లేని; పవమానసఖ = అగ్ని {పవమాన సఖుడు - పవమాన (వాయుదేవుని) సఖుడు (స్నేహితుడు), అగ్నిదేవుడు}; అగ్ర = పైభాగమున; వెలుగొందు = ప్రకాశించెడిది; కీల = మంట; విధమునన్ = విధముగ; ప్రకాశించుచుచున్ = కాంతివంత మగుచు; ఉండెన్ = ఉండెను; తద్దయున్ = మిక్కిలి; వేడ్కన్ = వేడుకగా.

భావము:

మంచి మనస్సుతో పొగలేని అగ్నిని శుద్ధమైన జ్వాల విడువనట్లు పతిని ఎడబాయక పరిచర్యలు చేసింది.

4-839-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తి దన ప్రాణేశ్వరుఁ డుప
తుఁ డగుట మనంబులో నయకయె పూర్వ
స్థితి నుపచారక్రియ లం
చిమతిఁ గావింపఁ దలఁచి చిరతర భక్తిన్.

టీకా:

సతి = పతివ్రత; తన = తన యొక్క; ప్రాణేశ్వరుడు = భర్త; ఉపరతుడు = మరణించినవాడు; అగుటన్ = అగుటను; మనంబున్ = మనసు; లోన్ = లో; అరయకయె = తెలియకయె; పూర్వ = ఇదివరకు; స్థితిన్ = విధముగనే; ఉపచార = సేవా; క్రియలన్ = కార్యక్రమములను; అంచిత = పూజనీయ; మతిన్ = భావముతో; కావింపన్ = చేయవలెనని; తలచి = అనుకొని; చిరతర = అతి మిక్కిలి {చిరము - చిరతరము - చిరతమము}; భక్తిన్ = భక్తితో.

భావము:

భర్త మరణించటం తెలియని వైదర్భి పూర్వంలాగా భక్తితో అతనిని సేవించాలనుకొని…

4-840-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుపమ సుస్థిర నియమా
నుఁ డగు నిజనాథు డాయఁ ని పూర్వగతిన్
విమిత యై సతి తత్పద
జము లర్చించు నపుడు రుపాదములన్.

టీకా:

అనుపమ = సాటిలేని; నియమ = నియమముతో; ఆసనుడు = యోగాసనమున ఉన్నవాడు; అగు = అయిన; నిజ = తన; నాథున్ = పతిని; డాయన్ = దగ్గరకు; చని = వెళ్ళి; పూర్వ = ముందటి; గతిన్ = వలెనే; వినమిత = వినయముతో వంగినది; ఐ = అయ్యి; సతి = పతివ్రత; తత్ = అతని యొక్క; పద = పాదములు అనెడి; వనజములన్ = పద్మములను; అర్చించున్ = పూజించెడి; అప్పుడున్ = సమయములో; వరున్ = భర్త; పాదములన్ = పాదములను.

భావము:

కదలకుండా కూర్చున్న భర్తను చేరి పూర్వంలాగా అతని పాదాలకు నమస్కరించింది. భర్త పాదాలలో…

4-841-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విను మూష్మత లేకున్నను
ని యూథభ్రష్ట హరిణి కైవడి సతి నె
మ్మమున బెగడుచు దీనత
యంబును బంధురహిత యై శోకించెన్.

టీకా:

విను = వినుము; ఊష్మతన్ = వేడి; లేకున్ననున్ = లేకపోవుటను; కని = చూసి; యూథ = గుంపునుండి; భ్రష్ట = చెదిరిపోయిన; హరిణి = ఆడులేడి; కైవడి = వలె; సతి = స్త్రీ; నెఱి = అత్యధికముగ; మనమునన్ = మనసు; బెగడుచున్ = బెదిరిపోతూ; దీనతన్ = దీనత్వమునందు; అనయంబునున్ = మరలమరల; బంధు = బంధువులు; రహిత = (దగ్గర) లేనిది; ఐ = అయ్యి; శోకించెన్ = దుఃఖించెను.

భావము:

వేడి లేకపోవటం గమనించి గుంపునుండి తప్పిపోయిన లేడిలాగా భయపడుతూ విలపించింది.

4-842-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యము నిట్లు శోకవిపులాశ్రు పయఃకణ సిక్త మానిత
స్తయుగయై వియోగపరి తాపమునన్ హృదయంబు మాఁడ శో
లలితాధరోష్ఠ నవద్మము గందఁగ సుస్వరంబుగా
జదళాక్షి యేడ్చె ననివారణఁ దద్విపినాంతరంబునన్.

టీకా:

అనయమున్ = అత్యంతము; ఇట్లు = ఈ విధముగ; శోక = దుఃఖము; విపుల = విస్తారమైన; అశ్రు = కన్నీటి; కణ = బిందువులు; సిక్త = తడయుటచే; మానిత = పవిత్రమైన; స్తన = కుచ; యుగ = ద్వయము కలామె; ఐ = అయ్యి; వియోగ = భర్తృ వియోగ; పరితాపమునన్ = సంతాపమువలన; హృదయంబున్ = హృదయమును; మాఁడ = మండగా; శోభన = శుభకరమైన; లలిత = మృదువైన; అధర = కింది; ఓష్ఠ = పెదవి అనెడి; నవ = కొత్త; పద్మము = పద్మము; గందన్ = కందిపోగా; సు = చక్కటి; స్వరంబుగాన్ = స్వరముతో; వనజదళాక్షి = స్త్రీ {వనజదళాక్షి - వనజము (తామర) దళ (ఆకు) వంటి అక్షి (కన్నులు) కలవారు, స్త్రీ}; ఏడ్చెన్ = దుఃఖించెను; అనివారణన్ = ఆపుకోలేనంతగా; తత్ = ఆ; విపిన = అరణ్యము; అంతరంబునన్ = లోపల.

భావము:

చనుదోయి కన్నీటితో తడిసిపోగా, విరహ వేదనతో హృదయం దహించుకొని పోగా, సుకుమారమైన పద్మంవంటి పెదవి కందిపోగా నిర్జనమైన అడవిలో వైదర్భి ఎలుగెత్తి ఏడ్చింది.

4-843-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"హా! రనాథ! హా! సుమహితాత్మక! హా! గుణశాలి! యింక నం
భోనిధి మేఖలాకలిత భూమి యధార్మిక రాజ చోర పీ
డా నిరతిం గృశింప నకటా! తగునయ్య యుపేక్షచేయ; శో
భాయశాలి! నీవు పరిపాలన చేయుదు, లెమ్ము భూవరా!"

టీకా:

హా = అయ్యో; నరనాథ = రాజా; హా = అయ్యో; సు = మంచి; మహిత = గొప్ప; ఆత్మక = మనసు కలవాడ; హా = అయ్యో; గుణశాలి = సుగుణ స్వభావములు కలిగినవాడ; ఇంకన్ = మరి; అంభోనిధి = సముద్రము; మేఖల = సరిహద్దులుగా; కలిత = కలిగిన; భూమిన్ = నేలను; అధార్మిక = వేదధర్మ విరుద్దులైన; రాజ = రాజుల; చోర = దొంగల; పీడన్ = బాధవలన; నిరతిన్ = నిరంతరము; కృశింపన్ = చిక్కిపోగా; అకటా = అయ్యో; తగునా = తగినదా; అయ్యా = నాయనా; ఉపేక్షన్ = అలక్ష్యము; చేయన్ = చేయుట; శోభానయశాలి = శుభకరమైన నేర్పరితనము కలవాడ; నీవున్ = నీవు; పరిపాలన = చక్కగ పాలించుట; చేయుదు = చేసెదవుగాని; లెమ్ము = లే; భూవర = రాజ.

భావము:

“ఓ రాజా! ఓ మహాత్మా! ఓ సద్గుణమూర్తీ! దొంగలైన క్షత్రియాధముల పీడచేత కృశించిన భూమండలాన్ని రక్షించకుండా ఉపేక్షించడం నీకు తగదు. లేచి వచ్చి రక్షించు”

4-844-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని విలపించుచున్ సరసిజాక్షి నిజేశు పదారవిందముల్
నిటలంబు సోఁకఁ బరితాపమునంబడి బిట్టు చాల రో
మొనరించుచుం దగిలి దారువులం జితిఁబేర్చి యందులోఁ
బెనుపగు తత్కళేబరముఁ బెట్టి శిఖిం దరికొల్పి యిమ్ములన్.

టీకా:

అని = అని; విలపించుచున్ = దుఃఖించుతూ; సరసిజాక్షి = స్త్రీ {సరసిజాక్షి - సరసిజము (పద్మముల) వంటి అక్షి (కన్నులు కల వాడు), స్త్రీ}; నిజ = తన; ఈశున్ = భర్త; పద = పాదములు అనెడి; అరవిందముల్ = పద్మములు; తన = తన యొక్క; నిటలతలంబున్ = నుదుటి భాగము; సోకన్ = తగులునట్లు; పరితాపమున్ = సంతాపము; పడి = పడి; బిట్టున్ = గట్టిగా; చాలన్ = గట్టిగా; రోదనమున్ = ఏడ్చుట; ఒనరించుచున్ = చేయుచూ; తగిలి = పూని; దారువులన్ = కఱ్ఱలతో; చితిన్ = పోగును, చితిని {చితి - శవదహనార్థమైన కట్టెల పోగు}; పేర్చి = పోగుచేసి; అందులోన్ = దానిపైన; పెనుపు = పెద్దది; అగు = అయిన; తత్ = అతని యొక్క; కళేబరమున్ = కళేబరము {కళేబరము - ప్రాణరహితమైన దేహము, శవము}; పెట్టి = పెట్టి; శిఖిన్ = మంటలను; తరికొల్పి = రగుల్కొలపి; ఇమ్ములన్ = యుక్తముగా.

భావము:

అని పతి పాదపద్మాలపై తన నుదురు మోపి విలపించింది. కట్టెలు తెచ్చి, చితి పేర్చి, ఆ చితిలో పతి కళేబరాన్ని పెట్టి నిప్పు ముట్టించింది.