పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రాచీనబర్హి యఙ్ఞములు

  •  
  •  
  •  

4-740-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వుఁడు నతనికి నతఁ డను
ఘా! యీ యధ్వరంబులందును గృపమా
లి నీచే విశసింపం
ని కూలిన పశుల వేల సంఖ్యలఁ గనుమా

టీకా:

అనవుడు = అనగా; అతని = అతని; కిన్ = కి; అతడు = అతడు; అను = అనెను; అనఘా = పుణ్యుడా; ఈ = ఈ; అధ్వరంబుల్ = యజ్ఞముల; అందునున్ = లో; కృప = దయ; మాలిన = లేని; నీ = నీ; చేన్ = చేత; విశసింపన్ = సంహరింప; చని = బడి; కూలిన = మరణించిన; పసులన్ = పశువులను; వేల = వేల; సంఖ్యన్ = సంఖ్యలకొలది; కనుమా = చూడుము.

భావము:

అని చెప్పగా ఆ ప్రాచీనబర్హితో నారదుడు ఇలా అన్నాడు. “పుణ్యాత్మా! ఈ యజ్ఞాలలో నిర్దయుడవైన నీచేత సంహరింపబడ్డ వేలకొద్ది పశువుల సంఖ్యను గమనించు.