పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రాచీనబర్హి యఙ్ఞములు

  •  
  •  
  •  

4-739.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భూరి పురుషార్థములు గాఁగ బుద్ధిఁ దలఁచు
తివిహీనుండు సంసార మార్గములను
గఁ బరిభ్రామ్యమాణుఁడై యొగిని మోక్ష
దము నొందగఁజాలఁడు వ్యచరిత!

టీకా:

అనఘ = పుణ్యుడ; ముని = మునులలో; ఇంద్ర = ఇంద్రుని వంటివాడ; మహాభాగ = నిర్మలమనసుకలవాడ; ఏనున్ = నేను; కర్మా = కర్మలచేత; అపహత = గొట్టబడిన; జ్ఞానిన్ = జ్ఞానము గలవానిని; అగుచున్ = అవుతూ; మోక్షమున్ = మోక్షమును; ఎఱుగంగ = తెలియ; లేను = లేనివాడను; ఐతిన్ = అయితిని; ఇట్టి = ఇటువంటి; నా = నా; కున్ = కు; ఇప్పుడున్ = ఇప్పుడు; కడున్ = మిక్కిలి; విమలంబున్ = స్వచ్ఛమైనది; కర్మ = కర్మములవలని; బంధ = బంధనములను; నాశకంబును = పోగొట్టునది; అగున్ = అయిన; జ్ఞానంబున్ = జ్ఞానమును; ఉపదేశంబున్ = ఉపదేశించుట; కావింపుము = చేయుము; అతి = మిక్కిలి; దయాకర = కృపాకర; కూట = కపటమైన; ధర్మంబులున్ = ధర్మములు; అగు = అయిన; గేహ = గృహముల; తతుల్ = సమూహములు; అందున్ = లో; చెంది = చెంది; జాయా = భార్యలు; తనూజాత = పుత్రులు; ధన = ధనములు; ఆదికములో = మొదలగునవే.
భూరి = అత్యధికమైన; పురుషార్థములున్ = ప్రయోజనములు; కాగ = అగునట్లు; బుద్ధిన్ = మనసున; తలచున్ = తలచెడి; మతి = బుద్ది; విహీనుండు = లేనివాడు; సంసార = సంసారము యొక్క; మార్గములను = మార్గములలో; తగన్ = అవశ్యము; పరిభ్రామ్యమాణ్యుడు = తిరుగుతున్నవాడు; ఐ = అయ్యి; ఒగినిన్ = క్రమముగా; మోక్ష = ముక్తి; పదమున్ = మార్గమును; ఒందగజాలడు = పొందజాలడు; భవ్యచరిత = దివ్యమైనవర్తనకలవాడు.

భావము:

“పుణ్యాత్మా! మహానుభావా! నారదమునీంద్రా! కర్మాసక్తి వల్ల నాకు జ్ఞానం నశించింది. అందుచేత నేను మోక్షాన్ని తెలుసుకోలేక పోయాను. కాబట్టి నాకు ఇప్పుడు కర్మబంధాలను నిర్మూలించే నిర్మలమైన జ్ఞానాన్ని ఉపదేశించు. దయామూర్తీ! కపట ధర్మాలకు ఆలవాలమైన గృహాలలో భార్యాపుత్రులు, ధనధాన్యాలే గొప్ప పురుషార్థాలుగా భావించి సంసార బంధాలలో బద్ధుడైన బుద్ధిహీనుడు మోక్షాన్ని పొందలేడు”.