పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రాచీనబర్హి యఙ్ఞములు

  •  
  •  
  •  

4-735-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యీ గతి నుపదేశం
బొరించి సదాశివుండు నొగి వారలచే
ను బూజితుఁడై వారలు
నంతర్ధానుఁ డయ్యెఁ గౌతుక మొప్పన్.

టీకా:

అని = అని; ఈ = ఈ; గతిన్ = విధముగ; ఉపదేశంబున్ = ఉపదేశము; ఒనరించి = చేసి; సదాశివుండున్ = శివుడు {సదాశివుడు - సదా (ఎల్లప్పుడు) శివుడు (శుభమైనవాడు), శివుడు}; ఒగిన్ = వెంటనే; వారల్ = వారి; చేతను = చేత; పూజితుడు = పూజింపబడిన వాడు; ఐ = అయ్యి; వారలు = వారు; కనన్ = చూచుండగా; అంతర్ధానుడు = మాయమైనవాడు; అయ్యెన్ = అయ్యెను; కౌతుకము = కుతూహలము; ఒప్పన్ = ఒప్పుతుండగ.

భావము:

అని ఈ విధంగా ఉపదేశించి ప్రచేతసుల పూజలను గ్రహించి శివుడు అంతర్ధాన మయ్యాడు.