పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రాచీనబర్హి యఙ్ఞములు

  •  
  •  
  •  

4-734-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కాగ్రచిత్తులును సు
శ్లోకులునై జపము చేయుచును ఘనతపముం
గైకొని చేసిన మీకును
జేకుఱు మహితేప్సితార్థ సిద్ధి గడంకన్.

టీకా:

ఏకాగ్ర = ఏకాగ్రత కలిగిన; చిత్తలును = మనసు కలవారు; సుశ్లోకులున్ = చక్కగా స్తుతింపబడువారు; ఐ = అయ్యి; జపమున్ = జపము; చేయుచున్ = చేస్తూ; ఘన = గొప్ప; తపమున్ = తపస్సు; కైకొని = పూని; చేసిన = చేసిన; మీ = మీ; కునున్ = కు; చేకూఱున్ = కలుగును; మహిత = గొప్ప; ఈప్సిత = కోరికలలో; అర్థన్ = కోరెడివానిని; సిద్ధిన్ = తీరుట; కడంకన్ = తప్పక.

భావము:

మీరు ఏకాగ్రచిత్తంతో ఈ స్తోత్రాన్ని జపిస్తూ తపస్సు చేయండి. మీ కోరికలు తప్పక సిద్ధిస్తాయి”