పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రాచీనబర్హి యఙ్ఞములు

  •  
  •  
  •  

4-731-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున నాకును సూరి జ
నాళికిని సర్వసంశయంబులు వాపం
గాను బ్రోవను దగు గతి
నీ ని వినుతించి నట్టి యీ స్తవ మెలమిన్.

టీకా:

కావునన్ = అందుచేత; నాకున్ = నాకు; సూరి = జ్ఞానులు యైన; జన = వారి; ఆవళి = అందరు; కిని = కిని; సర్వ = సకల; సంశయంబులున్ = సంశయములును; వాపన్ = పోగొట్టుట; కావన్ = కాపాడుటకు; ప్రోవన్ = పోషించుటకు; తగు = తగిన; గతిన్ = దిక్కు; నీవున్ = నీవే; అని = అని; వినుతించిన్ = స్తుతించిన; అట్టి = అటువంటి; ఈ = ఈ; స్తవమున్ = స్తవమును; ఎలమిన్ = కుతూహలముతోటి.

భావము:

కావున నాకు, పండితులకు సర్వ సందేహాలను పోగొట్టి, కాపాడి, పోషించేవాడవు నీవే” అని స్తుతించిన ఈ స్తవమును కోరి రుద్రుడు ప్రచేతసులకు ఉపదేశించాడు.