పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రాచీనబర్హి యఙ్ఞములు

  •  
  •  
  •  

4-700-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జాసనుఁ డాత్మజు లగు
కాదులఁ జూచి పలికె మ్మతితోడన్
వినుఁడు కుమారకులారా!
జోదరు మంగళస్తవం బెఱిఁగింతున్.

టీకా:

వనజాసనుడున్ = బ్రహ్మదేవుడు {వనజాసనుడు - వనమున (నీట) జము పుట్టినది (పద్మము) ఆసనముగా కలవాడు, బ్రహ్మదేవుడు}; ఆత్మజులు = పుత్రులు; అగు = అయిన; సనక = సనకుడు; ఆదులన్ = మొదలగు వారిని; చూచి = చూసి; పలికెన్ = పలికెను; సమ్మతి = అంగీకారము; తోడన్ = తోటి; వినుడు = వినండి; కుమారకులారా = పిల్లలు; వనజోదరున్ = విష్ణుమూర్తి యొక్క {వన జోదరుడు - వనజము (పద్మము)న పుట్టినవాడు, విష్ణువు}; మంగళ = శుభకరమైన; స్తవంబున్ = స్తోత్రమును; ఎఱిగింతున్ = తెలిపెదను.

భావము:

బ్రహ్మదేవుడు తన కుమారులైన సనకాదులను చూచి ఇలా అన్నాడు “కుమారులారా! వినండి. శుభప్రదమైన విష్ణు స్తోత్రాన్ని చెప్తాను”.