పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రాచీనబర్హి యఙ్ఞములు

  •  
  •  
  •  

4-698.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్థి నెవ్వరు భజియింతు ట్టివారు
నాకుఁ బ్రియతముల్; వారికి యచరిత్రు
లా! యేను బ్రియుండనై భూరిమహిమ
వెలయు చుండుదు; నది గాక వినుఁడు మీరు.

టీకా:

వినుడు = వినండి; నృపాలనందనులారా = రాకుమారులారా; మీ = మీ యొక్క; మదిన్ = మనసున; కల = ఉన్నట్టి; తలంపున్ = ఆలోచన; ఎల్లన్ = సమస్తము; కానవచ్చెన్ = తెలిసినది; మీ = మీ; కున్ = కు; భద్రంబున్ = శుభము; అగున్ = కలుగును; మీ = మీ; ఎడన్ = అందు; నేన్ = నేను; అనుగ్రహ = అనుగ్రహించెడి; బుద్ధి = ఉద్దేశ్యము; చేన్ = చేత; ఇటున్ = ఇలా; కనబడితిన్ = కనిపించితిని; కైకొని = పూని; ఇపుడు = ఇప్పుడు; సూక్ష్మమున్ = సూక్ష్మమైనది; త్రిగుణాత్మకమున్ = త్రిగుణములుకలది; అగు = అయిన; నా = నా యొక్క; ప్రకృతి = స్వభావము; కంటెనున్ = కంటె; ధరణినిన్ = భూమిమీద; పరగు = ప్రసిద్ధమగు; జీవుని = మానవుని; కంటెన్ = కంటె; పరుడు = పరమైనవాడు; ఐన = అయిన; వాసుదేవునిన్ = విష్ణుని; చరణ = పాదములు అనెడి; అబ్జముల్ = పద్మములను; తనరు = అతిశయించెడి; భక్తిన్ = భక్తితో; అర్థిన్ = కోరి; ఎవ్వరున్ = ఎవరైతే.
భజియింతురు = పూజింతురో; అట్టి = అటువంటి; వారు = వారు; నాకున్ = నాకు; ప్రియతముల్ = అత్యంతప్రీతికలవారు {ప్రియలు - ప్రియతరులు - ప్రియతములు}; వారికిన్ = వారికి; నయ = చక్కటి; చరిత్రులారా = చరిత్రకలవారా; ఏను = నేను; ప్రియుండను = ప్రీతి కల వాడను; ఐ = అయ్యి; భూరి = అత్యధికమైన; మహిమన్ = మహిమతో; వెలయుచుండుదున్ = విలసిల్లుతుండుదును; అది = అంతే; కాక = కాకుండ; వినుడు = వినండి; మీరు = మీరు.

భావము:

“రాకుమారులారా! వినండి. మీ మనస్సులోని అభిప్రాయం తెలిసింది. మీకు శుభం కలుగుతుంది. మిమ్మల్ని అనుగ్రహించడానికి ఇలా దర్శన మిచ్చాను. సూక్ష్మమూ, త్రిగుణాత్మకమూ అయిన నా స్వభావం కంటే, జీవులలో ప్రసిద్ధుడైన మానవుని కంటే పరమైనవాడు అయిన వాసుదేవుని పాదపద్మాలను ఎవరైతే భక్తితో పూజిస్తారో అటువంటివారు నాకు మిక్కిలి ఇష్టమైనవారు. వారికి నేను ఇష్టుడనై మహిమాన్వితుడనై విలసిల్లుతాను. సుచరిత్రులారా! ఇంకా వినండి.