పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రాచీనబర్హి యఙ్ఞములు

  •  
  •  
  •  

4-696-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని వారలు దమ మనముల
నురాగము నద్భుతంబు నయముఁ బొడమన్
వియము దోఁపగఁ దత్పద
జములకు మ్రొక్కి భక్తి శగతు లగుచున్.

టీకా:

కని = చూసి; వారలున్ = వారు; తమ = తమ యొక్క; మనములన్ = మనసు లందు; అనురాగము = ప్రీతి; అద్భుతము = అద్భుతము; పొడమన్ = పొడచూపగ; = వినయమున్ = వినయము; తోపగన్ = కనపడునట్లు; తత్ = అతని; పద = పాదములు అనెడి; వనజముల్ = పద్మముల; కున్ = కి; మ్రొక్కి = మొక్కి; భక్తిన్ = భక్తికి; వశగతులు = వశమైనవారు; అగుచున్ = అగుచూ.

భావము:

ప్రచేతసులు చూచి తమ మనస్సులలో అనురాగం, అద్భుతం కలుగగా భక్తి పరవశులై సవినయంగా ఆయన పాదపద్మాలకు మ్రొక్కారు.