పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రాచీనబర్హి యఙ్ఞములు

  •  
  •  
  •  

4-691-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శికరంబులుఁ బోలి విదము లగుచు
రికథలఁ బోలి కల్మషరము లగుచు
హ్నులును బోలి భువన పానము లగుచుఁ
బొగడఁ దగు నీరములచేఁ బ్రపూర్ణ మగుచు.

టీకా:

శశి = చంద్రుని; కరంబున్ = కిరణములను; పొలి = వలె; విశదము = తెల్లనివి; అగుచున్ = అగుచూ; హరి = విష్ణు; కథలన్ = కథలను; పోలి = వలె; కల్మష = పాపము, మకిలి; హరములు = పోగొట్టునవి; అగుచున్ = అగుచూ; వహ్నులు = అగ్నులను; పోలి = వలె; భువన = జగములను; పావనములు = పవిత్రము, పరిశుద్ధము చేయునవి; అగుచున్ = అగుచూ; పొగడదగు = ప్రశస్తమైన; నీరములు = నీటి; చేన్ = చేత; ప్రపూర్ణము = నిండినది; అగుచున్ = అగుచూ.

భావము:

ఆ కొలనులోని నీళ్ళు చంద్రకిరణాల వలె తెల్లనివి. హరికథల వలె కల్మషాలను హరించేవి. అగ్నుల వలె భువనపావనాలైనవి. అటువంటి ప్రశస్తాలైన జలాలతో పరిపూర్ణమైనట్టి…