పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రాచీనబర్హి యఙ్ఞములు

  •  
  •  
  •  

4-688-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శిమున వహించి ప్రాగ్దిశ
రిగెడి సమయమున నెదుర నంబుధికంటెం
పగు నొక సరసి మనో
నిర్మల సలిల పూర్ణయై యది మఱియున్.

టీకా:

శిరమునన్ = తలపై; వహించి = ధరించి, స్వీకరించి; ప్రాక్ = తూర్పు; దిశన్ = దిక్కు; కున్ = కి; అరిగెడి = వెళ్ళెడి; సమయమునన్ = సమయములో; ఎదురన్ = ఎదురుగా; అంబుధి = సముద్రము; కంటెన్ = కంటె; పఱపు = విస్తారము; అగు = అయిన; ఒక = ఒక; సరసిన్ = సరస్సును; మనోహరము = అందమైన {మనోహరము - మనసును దొంగిలించెడిది, అందమైనది}; నిర్మల = స్వచ్ఛమైన; సలిల = నీటితో; ఆపూర్ణ = నిండినది; ఐ = అయ్యి; అది = అది; మఱియున్ = ఇంకను.

భావము:

తలదాల్చి తపస్సు చేయటానికి పశ్చిమదిశగా వెళ్తూ సముద్రం కంటే విశాలమైన ఒక పెద్ద సరస్సును చూచారు. ఆ చక్కని సరస్సు స్వచ్ఛమైన నీటితో నిండి వారి మనస్సుకు ఆనందం కలిగించింది. ఇంకా…