పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రాచీనబర్హి యఙ్ఞములు

  •  
  •  
  •  

4-685.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పుమిఁ బ్రత్యక్షమునఁ గానఁడఁడు; మఱియు
నంచితాత్మ సదారాముఁ ఖిల లోక
క్షణార్థంబుగా విరూపాక్షుఁ డాత్మ
క్తితోఁ గూడి జగతిపై సంచరించు.

టీకా:

తాపస = తాపసులలో; ఉత్తమ = ఉత్తముడా; ప్రచేతసుల్ = ప్రచేతసుల; కున్ = కి; ఆ = ఆ; వన = ఆడవి; మార్గంబున్ = దారిలో; అందున్ = లో; ఆ = ఆ; భర్గున్ = శివుని; తోడన్ = తోటి; సంగము = సాంగత్యము; ఎట్లు = ఏ విధముగ; అయ్యెన్ = కలిగెను; ప్రసన్నుడు = ప్రసన్నమైనవాడు; ఐ = అయ్యి; హరుడు = శివుడు; ఎద్ది = దేనిని; తివుటన్ = కోరి; వారల్ = వారి; కిన్ = కి; ఉపదేశము = ఉపదేశము; ఇచ్చెన్ = ఇచ్చెను; జీవ = ప్రాణుల; రాశుల్ = సమూహముల; కున్ = కు; ఆ = ఆ; శివు = శివుని; తోడి = తోటి; సంగంబున్ = సాంగత్యము; కడు = మిక్కిలి; దుర్లభంబు = పొందరానిది; ఈ = ఈ; జగంబున్ = భువనము; అందున్ = లో; చర్చింపన్ = విచారించిచూసిన; ఆ = ఆ; మేటి = గొప్పవాడు; సత్ = సత్యమైన; ముని = మునులులో; ఇంద్రుల్ = ఇంద్రును వంటివారి; కునున్ = కి; సంచిత = చక్కగా; ధ్యాన = ధ్యానమున; గోచరుడు = కనిపించెడివాడు; కాని = కాని.
పుడమిన్ = భూమిమీద; ప్రత్యక్షమునన్ = కంటికి ఎదురుగా; కానబడడు = కనిపించడు; మఱియున్ = ఇంకను; అంచితాత్మ = శివుడు {అంచితాత్మ - పూజింపదగిన ఆత్మ (వాడు), శివుడు}; సదారాముడు = శివుడు {సదారాముడు - సదా (ఎల్లప్పుడును) ఆరాముడు (ఆనందమున యుండువాడు), శివుడు}; అఖిల = సమస్తమైన; లోక = లోకములను; రక్షణ = రక్షించు; విరూపాక్షుడు = శివుడు {విరూపాక్షుడు - విరూపమైన కన్నులుకలవాడు, శివుడు}; ఆత్మ = తన; శక్తి = శక్తి, భార్య; తోన్ = తో; కూడి = కలిసి; జగతిన్ = భూమి; పైనే = మీద; సంచరించున్ = తిరుగును.

భావము:

“మునీంద్రా! ప్రచేతసులు వనమార్గంలో శివుని ఎలా కలుసుకున్నారు? శివుడు ప్రసన్నుడయి వారికి ఏమి ఉపదేశించాడు? ప్రాణులకు శివసాక్షాత్కారం ఈ లోకంలో దుర్లభం కదా! గొప్ప గొప్ప మునీంద్రులకు కూడా ఆయన ధ్యానంలోనే తప్ప ప్రత్యక్షంగా కనిపించడు కదా! అంతేకాక ఆత్మారాముడైన ఆ విరూపాక్షుడు అఖిలలోక సంరక్షణార్థమై స్వయంశక్తి సంపన్నుడై సర్వత్ర సంచరిస్తూ ఉంటాడు.