పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రాచీనబర్హి యఙ్ఞములు

  •  
  •  
  •  

4-683-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సురుచిర భంగి నా సతి కిశోర వయఃపరిపాకయై రణ
ద్వమణి హేమనూపురరవంబు చెలంగఁగ నాడుచున్ దివా
రుచి రేఖ నొప్పెసఁగఁ గాంచి వినిర్జితు లైరి దేవ కి
న్న నర సిద్ధ సాధ్య ముని నాగ నభశ్చర ముఖ్యు లందఱున్.

టీకా:

సు = మిక్కిలి; రుచిర = ప్రకాశవంతమైన; భంగిన్ = విధముగా; ఆ = ఆ; సతి = స్త్రీ; కిశోర = కిశోర; వయః = వయస్సు; పరిపాక = నిండినది; ఐ = అయ్యి; రణత్ = ధ్వనిస్తున్న; వర = ఉత్తమమైన; మణి = మణులు పొదిగిన; హేమ = బంగారపు; నూపుర = కాలి యందెల; రవంబున్ = శబ్దము; చలంగగన్ = చెలరేగగా; ఆడుచున్ = అడుతూ; దివాకర = సూర్యుని; రుచి = కాంతి; రేఖన్ = కిరణము వలె; ఒప్పు = చక్కదనము; ఎసగన్ = పెచ్చుమీరగ; కాంచి = చూసి; వినిర్జితులు = మిక్కిలి ఓడిపోయినవారు; ఐరి = అయ్యిరి; దేవ = దేవతలు; కిన్నర = కిన్నరులు; నర = నరులు; సిద్ధ = సిద్ధులు; సాధ్య = సాధ్యులు; ముని = మునులు; నాగ = సర్పములు; నభశ్చర = గగనయానము చేసెడి వారు; ముఖ్యులు = మున్నగు వారు; అందఱున్ = అందరూ.

భావము:

సుర్యకాంతి వలె మెరిసిపోతూ కాళ్ళయందలి బంగారు అందెలు ఘల్లుఘల్లుమని మనోహరంగా మ్రోగుతుండగా తిరుగుతున్న నవయౌవనవతియైన శతధృతి సౌందర్య వైభవం దేవతలు, కిన్నరులు, నరులు, సిద్ధులు, సాధ్యులు, మునులు, నాగులు, ఖేచరులు మున్నగు వారి నందరినీ మంత్ర ముగ్ధులను చేసింది.