పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-678-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తఁ డాత్మదర్శనుం డయి
తురతఁ బరమాత్ము హంసు ర్వేశ్వరుఁ ద
త్క్రతువున యజించి కుశలా
ద్భు యోగసమాధి ముక్తిఁ బొందె మహాత్మా!

టీకా:

అతడు = అతడు; ఆత్మ = ఆత్మను; దర్శనుండు = దర్శించిన వాడు; ఐ = అయ్యి; చతురతన్ = నేర్పరితనముతో; పరమాత్మున్ = పరమాత్మను; హంసు = పరమహంసను; సర్వేశ్వరున్ = భగవంతుని; తత్ = ఆ; క్రతువునన్ = యాగములో; యజించి = యజ్ఞము చేసి; కుశల = నేర్పరితనము కలిగిన; అద్భుత = అద్భుతమైన; యోగసమాధిన్ = యోగసిద్ధి ద్వారా; ముక్తిన్ = మోక్షమును; పొందెన్ = పొందెను; మహాత్మ = గొప్పవాడ.

భావము:

మహాత్మా! విజితాశ్వుడు ఆ యజ్ఞంలో సర్వేశ్వరుడు, హంసస్వరూపుడు అయిన భగవంతుణ్ణి ఆరాధించి అత్యద్భుతమైన యోగసమాధి ద్వారా ముక్తిని పొందాడు.