పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-674-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వారలు పావకుండుఁ బవమానుండు శుచియు నను నామంబుల మనుష్య యోనిం బుట్టియు నాత్మప్రభావంబునం గ్రమ్మఱ నగ్నులయి చనిరి; తదనంతరంబ.

టీకా:

వారలు = వారు; పావకుండన్ = పావకుడు; పవమానుండు = పవమానుడు; శుచియున్ = శుచి; అను = అనెడి; నామంబులన్ = పేర్లతో; మనుష్య = మానవ; యోనిన్ = గర్భమున; పుట్టియున్ = జనించినను; ఆత్మ = తమ; ప్రభావంబునన్ = ప్రభావము వలన; క్రమ్మఱన్ = మరల; అగ్నులు = అగ్నులు; ఐ = అయ్యి; చనిరి = వెళ్ళిపోయిరి; తదనంతరంబ = తరువాత.

భావము:

వాళ్ళు పావకుడు, పవమానుడు, శుచి అనే పేర్లతో మనుష్యులై పుట్టి కూడా తమ ప్రభావం చేత మళ్ళీ అగ్నులుగా రూపొంది యథాస్థానాలకు వెళ్ళిపోయారు. ఆ తరువాత…