పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-672-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విను మంతర్ధాన గతిం
రు సునాసీరు వలనఁ గ విజితాశ్వుం
డును మఱి యంతర్ధానుం
నుపేరఁ బ్రసిద్ధుఁ డయ్యె తి చతురుండై.

టీకా:

వినుముa = వినుము; అంతర్ధాన = మాయ మయ్యెడి; గతిన్ = విధముగ; తనరు = అతిశయించెడి; సునాసీరున్ = ఇంద్రుని; వలనన్ = వలన; తగ = చక్కగా; విజితాశ్వండును = విజితాశ్వుడు; మఱి = ఇంకా; అంతర్ధానుండున్ = అంతర్ధానుడు; అను = అనెడి; పేరన్ = పేర్లతో; ప్రసిద్ధుడు = ప్రసిద్ధుడు; అయ్యెన్ = అయ్యెను; అతి = మిక్కిలి; చతురుండు = నేర్పరి; ఐ = అయ్యి;

భావము:

ఇంద్రుడు అంతర్ధానం చెంది అశ్వాన్ని అపహరించిన సందర్భంలో తానుకూడా అంతర్ధాన విద్యతో ఇంద్రుణ్ణి జయించినందువల్ల విజితాశ్వుడు అంతర్ధానుడు అన్న బిరుదనామంతో ప్రసిద్ధుడైనాడు.