పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

 •  
 •  
 •  

4-669-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

బ్రాహ్మణుఁ డంచిత క్తిఁ బఠించిన-
బ్రహ్మవర్చసము సంప్రాప్త మగును;
క్షత్రియుం డర్థిమైఁ దివిన విన్నను-
గతీ విభుత్వంబు సంభవించు;
వైశ్యుండు విని ధనవంతుఁడై యొప్పును-
శూద్రుండు వినిన సుశ్లోకుఁ డగును;
ఱియును భక్తి ముమ్మాఱు పఠించిన;-
విత్తవిహీనుండు విత్తపతియు

4-669.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ప్రసిద్ధుఁడు ప్రఖ్యాత శుఁడుఁ బ్రజలు
లేని యధముఁడు వితత సంతాయుతుఁడు
మూర్ఖచిత్తుండు విజ్ఞాన బోధమతియు
గుచు నుతి కెక్కుదురు మహితాత్మ! మఱియు.

టీకా:

"బ్రాహ్మణుడు = బ్రహ్మణుడు; అంచిత = చక్కటి; భక్తిన్ = భక్తితో; పఠించినన్ = చదివినచో; బ్రహ్మ = వేదజ్ఞాని కుండెడి వంటి; వర్చసమున్ = తేజస్సు; సంప్రాప్తము = చక్కగా లభించినది; అగునున్ = అగును; క్షత్రియుండు = రాజు; అర్థిమై = పూని; చదివినన్ = చదివినను; విన్నను = వినినను; జగతీ = లోకమునకు; విభుత్వంబున్ = ప్రభుత్వము; సంభవించున్ = కలుగును; వైశ్యుండున్ = వైశ్యుడు; విని = వినుటవలన; ధనవంతుడు = ధనము కలవాడు; ఐ = అయ్యి; ఒప్పును = ఒప్పి యుండును; శూద్రుండున్ = శూద్రుడు; వినినన్ = విన్నచో; సు = గొప్పగా; శ్లోకుండు = స్తుతింపబడువాడు; అగునున్ = అగును; మఱియున్ = ఇంకను; భక్తిన్ = భక్తితో; మూడు = మూడు (3); మాఱున్ = సార్లు; పఠించినన్ = చదివినన్; విత్త = ధనము; విహీనుండు = బొత్తిగ లేనివాడు; విత్తపతియున్ = ధనవంతుడును; అప్రసిద్దుడు = పేరులేనివాడు, ఖ్యాతిలేనివాడు.
ప్రఖ్యాత = ప్రసిద్ది పొందిన; యశుడు = కీర్తి కలవాడు; ప్రజలు = సంతానము; లేని = లేనట్టి; అధముడు = అధముడు; వితత = విస్తారమైన; సంతాన = సంతానము; యుతుడు = కలవాడు; మూర్ఖ = తెలివితక్కువ; చిత్తుండు = మనస్సు కలవాడు; విజ్ఞాన = మంచి జ్ఞానము; బోదమతియున్ = తెలిసినవాడు; అగుచున్ = అవుతూ; నుతి = కీర్తి; కిన్ = తో; ఎక్కుదురు = అతిశయించురు; మహితాత్మ = గొప్పస్వభావము కలవాడ; మఱియున్ = ఇంకను."

భావము:

మహానుభావా! ఈ పుణ్యకథను భక్తితో పఠించిన బ్రాహ్మణుడు బ్రహ్మ వర్చస్సును, క్షత్రియుడు అఖండ రాజ్యాన్ని, వైశ్యుడు అపార ధనాన్ని, శూద్రుడు అత్యంత కీర్తిని పొందుతారు. ఈ పుణ్యచరిత్రను భక్తితో ముమ్మారు చదివితే దరిద్రుడు ధనవంతు డౌతాడు. అప్రసిద్ధుడు సుప్రసిద్ధు డవుతాడు. సంతానహీనుడు సంతానవంతు డౌతాడు. అజ్ఞాని విజ్ఞానవంతుడై విశేష ఖ్యాతిని ఆర్జిస్తాడు. ఇంకా…