పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-666-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునివరుఁడగు మైత్రేయుఁడు
వియంబున నెఱుఁగఁ జెప్పి వెండియుఁ దగ ని
ట్లను "నమ్మహానుభావుం
ఘుఁడు భగవద్వరుండు గుఁ బృథుఁ డనఘా!

టీకా:

ముని = మునులలో; వరుడున్ = ఉత్తముడు; అగు = అయిన; మైత్రేయుడు = మైత్రేయుడు; వినయంబునన్ = వినయముతో; ఎఱుగన్ = తెలియ; చెప్పి = చెప్పి; వెండియున్ = ఇంకను; తగన్ = అవశ్యము; ఇట్లు = ఈ విధముగ; అనున్ = అనెను; ఆ = ఆ; మహానుభావుండు = గొప్పవాడు; అనఘుడు = పుణ్యుడు; = భగవత్ = భగవంతునికి; వరుండున్ = ఇష్ఠుడు; అగు = అయిన; పృథుడు = పృథుచక్రవర్తి; అనఘా = పుణ్యుడా.

భావము:

మైత్రేయ మహర్షి వివరించి చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు “పృథుచక్రవర్తి మహానుభావుడు, పాపరహితుడు, పరమ భాగవతుడు.