పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-665-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని వారలు దన్నర్థిని
వినుతింపఁగ నర్చి యాత్మవిభు వెనువెంటం
ని యచ్యుతలోకంబున
నుపమ విభవమును బొందె" ని విదురునకున్.

టీకా:

అని = అని; వారలు = వారు; తన్నున్ = తనను; అర్థిన్ = కోరి; వినుతింపన్ = స్తుతించగా; అర్చి = అర్చి; ఆత్మ = తన; విభున్ = భర్త; వెనువెంటన్ = వెనువెంట; చని = వెళ్ళి; అచ్యుతలోకంబున్ = వైకుంఠమున {అచ్యుత లోకము - అచ్యుతుని (వైకుంఠుని) లోకము, వైకుంఠము}; అనుపమ = సాటిలేని; విభవమునున్ = వైభవములను; పొందెన్ = పొందెను; అని = అని; విదురున్ = విదురుని; కున్ = కి.

భావము:

అని ఈ విధంగా దేవతలు తనను కొనియాడుతుండగా అర్చి మహాదేవి తన పతియైన పృథుచక్రవర్తి పొందిన విశేష వైభవోపేతమైన విష్ణులోకాన్ని పొందింది” అని విదురునకు….