పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-664-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి యపవర్గ సాధనమైన మనుజ
భావ మొందియు విషయ సంద్ధుఁ డగుచు
సుధ నెవ్వఁడు వర్తించు వాఁడు ధరణి
నయము నిజాత్మవంచకుఁ నఁగ బరఁగు.

టీకా:

అట్టి = అటువంటి; అపవర్గ = మోక్షమును పొందుటకు; సాధనమున్ = పరికరము వంటిది; ఐన = అయిన; మనుజ = మానవ; భావము = జన్మము; ఒందియున్ = పొందినప్పటికిని; విషయ = ఇంద్రియార్థములకు; సంబద్ధుడు = మిక్కిలి బంధింపబడినవాడు; అగుచున్ = అవుతూ; వసుధన్ = లోకమున; ఎవ్వడు = ఎవడైతే; వర్తించున్ = ప్రవర్తించునో; వాడు = వాడు; ధరణిన్ = లోకమున; అనయమున్ = అవశ్యము; నిజ = తను; ఆత్మన్ = తననే; వంచకుడు = వంచించుకొనెడివాడు; అనన్ = అనగా; పరగున్ = ప్రసిద్ద మగును.

భావము:

అటువంటి మోక్షానికి సాధనమైన మనుష్య జన్మ ఎత్తి కూడా విషయ బంధాలలో తగుల్కొని ప్రవర్తించేవాడు తనను తాను మోసగించుకొని ఆత్మవంచకు డౌతున్నాడు”