పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-663-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

‘పరికింపఁగనే మనుజుఁడు
రి పదమును బొందఁ జేయుట్టి వివేక
స్ఫుణం దనర్చు వానికిఁ
రువడి నిలఁ బొందరాని దముం గలదే?

టీకా:

పరికింపన్ = విచారించిన; ఏ = ఏ; మనుజుడు = మానవుడు {మనుజుడు - మనువు యొక్క వంశము వారు}; హరి = విష్ణుమూర్తి; పదమునున్ = పాదములను; పొందజేయున్ = పోందజేసెడిది; అట్టి = అయినట్టి; వివేక = జ్ఞానమును; స్ఫురణన్ = తోచటచే; తనర్చు = అతిశయించు; వానికిన్ = వానికి; పరువడిన్ = క్రమముగ; పొందరాని = పొందరాని; పదమున్ = స్థానము; కలదే = కలదా ఏమి (లేదు).

భావము:

“శ్రీహరి స్థానాన్ని అందించే ఉత్తమ జ్ఞానాన్ని సంపాదించిన పుణ్యాత్ములకు పొందరాని స్థానం అంటూ లేదు