పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-661-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్చింప నిట్టి యాశ్చర్య మెందేనియుఁ-
నుఁగొంటిరే యర్చి ను లతాంగి
న్యాత్మురాల్ గదా న విభుతోఁ గూడి-
యిందిరా రమణి యజ్ఞేశుఁ గూడి
వెనుచను కైవడి నుగమనము చేసె-
ని య్యమ నిజహృదయేశుఁ యిన
ను వైన్యు నూర్ధ్వలోమ్మును బొందును-
నేఁ డింతపట్టును నిశ్చితంబు

4-661.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రమ యోగీంద్రులకు దుర్విభావ్యమైన
దృఢ సుకర్మమువలన నతిక్రమించి
వైన్య భూమీశు వెనుచని రుస నూర్ధ్వ
గామినియు నయ్యె నీ యింతి నత నొంది.

టీకా:

చర్చింపన్ = చర్చించిచూసినచో; ఇట్టి = ఇటువంటి; ఆశ్చర్యము = విచిత్రము; ఎందేనియున్ = ఎక్కడయినను; కనుగొంటిరే = చూసేరా; అర్చి = అర్చి; అను = అనెడి; లతాంగి = స్తీ {లతాంగి - లతవలె సన్నని అంగి (దేహము కలామె)}; ధన్యాత్మురాలు = సార్థకమైనామె; కదా = కదా; తన = తన యొక్క; విభున్ = భర్త; తోన్ = తోటి; కూడి = కలిసి; ఇందిరారమణి = లక్ష్మీదేవి; యజ్ఞేశున్ = విష్ణుమూర్తిని; కూడి = కలసి; వెను = వెనకనే; చను = వెళ్ళెడి; కైవడి = విధముగ; అనుగమనము = సహగమనము; చేసెన్ = చేసెను; ఈ = ఈ; అమ = అమ్మ; నిజ = తన యొక్క; హృదయ = హృదయమునకు; ఈశుడు = ప్రభువు; అయిన = అయిన; ఘనున్ = గొప్పవానిని; వైన్యున్ = పృథువును; ఊర్థ్వలోకమ్మునున్ = పైలోకములను; పొందును = పొందును; నేడు = నేడు; ఇంత = ఇది; పట్టును = మట్టుకు, మాత్రము; నిశ్చితంబు = తప్పదు.
పరమ = అత్యుత్తమ; యోగి = యోగులలో; ఇంద్రుల్ = ఇంద్రినివంటివారి; కిన్ = కి; దుర్విభావ్యము = భావింపరాని; ఐన = అయిన; దృఢ = గట్టి; సుకర్మము = పుణ్యకార్యము; వలనన్ = వలన; అతిక్రమించి = అతిశయించి; వైన్య = పథు; భూమీశున్ = చక్రవర్తిని; వెను = వెంట; చని = వెళ్లి; వరుసన్ = క్రమముగా; ఊర్థ్వగామినియున్ = పైలోకములుపోవునామె; అయ్యెన్ = అయ్యెను; ఈ = ఈ; ఇంతి = స్త్రీ; ఘనతన్ = గొప్పదనమును; ఒంది = పొంది.

భావము:

ఇంతటి వింత మనం ఎక్కడా చూడలేదు. ఈ అర్చి పుణ్యాత్మురాలు. లక్ష్మీదేవి విష్ణుదేవుని అనుసరించినట్లు తన పతిని ఈ మహాసాధ్వి అధిగమించింది. తన భర్తతో పాటు పుణ్యలోకాలకు ఈమె తప్పకుండా వెళ్ళుతుంది. ఇది ముమ్మాటికి నిజం. పరమ యోగీంద్రులకు కూడా సాధ్యం కాని పవిత్ర ప్రవర్తనం వల్ల ఈ వధూమణి పృథు చక్రవర్తిని అనుసరించి అనన్య సామాన్యంగా ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నది.