పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-658-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మోత్కంఠను నమ్మం
గిరి సానుప్రదేశలమున వరుసం
గురియించిరి నవ సురభిత
మందారప్రసూన ర్షము లంతన్.

టీకా:

పరమ = అత్యధికమైన; ఉత్కంఠను = ఉత్సుకతతో; ఆ = ఆ; మందరగిరి = మందరపర్వతము యొక్క; సాను = కొండచరియల; ప్రదేశ = ప్రాంత; తలంబునన్ = స్థలములు అందు; వరుసన్ = వరుసగా; కురియించిరి = కురిపించిరి; నవ = సరికొత్త; సురభిత = సువాసనలుకలిగిన; వర = మంచి; మందార = మందార; ప్రసూన = పువ్వుల; వర్షములు = వర్షములు; అంతన్ = అంతట.

భావము:

అతిశయించిన కుతూహలంతో మందరపర్వత సానుప్రదేశాల నిండా క్రొత్త నెత్తావులు వెదజల్లే మందార పుష్ప వర్షాన్ని ఎడతెగకుండా కురిపించారు.