పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-657.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వీరవరుఁడైన పృథు పృథివీతలేశు
నందు ననుగమనము చేయుట్టి సాధ్వి
ర్చిఁ గనుఁగొని దేవాంగనాళి యప్పు
డాత్మనాథులఁ గూడి నెయ్యంబుతోడ.

టీకా:

మానిత = మన్నింపదగిన; మందర = మందరపర్వత; సాను = కొండచరియ; ప్రదేశంబున్ = ప్రదేశము; అందున్ = లో; చితిన్ = చితిని; ఆరోపమున్ = నిర్మించి; అర్థిన్ = కోరి; చేసి = చేసి; = లలిత = చక్కటి; మహా = పెద్ద; నదీ = నదియొక్క; సలిలన్ = నీటిలో; సు = చక్కగా; స్నాత = స్నానముచేసినది; ఐ = అయ్యి; కలిత = చేసిన; మహా = గొప్ప; ఉదార = విస్త్రుతమైన; కర్ముడు = వేదకర్మలు చేసినవాడు; అయిన = అయిన; నాథున్ = భర్త; కున్ = కి; ఉదకదాన = తర్పణ; క్రియల్ = క్రియలు; కావించి = ఆచరించి; అతి = మిక్కిలి; భక్తిన్ = భక్తితో; సురల్ = దేవతల; కున్ = కి; నతులు = స్తోత్రములు; ఒనర్చి = చేసి; వహ్ని = అగ్ని; కిన్ = కి; ముమ్మాటు = మూడు (3) మార్లు; వలగొని = ప్రదక్షిణచేసి; పతి = భర్తయొక్క; పాద = పాదములు అనెడి; కమల = పద్మముల; యుగమున్ = జంటను; చిత్తమునన్ = మనసులో; నిలిపి = నిలిపికొని.
వీర = వీరులలో; వరుడున్ = ఉత్తముడు; ఐన = అయిన; పృథు = పృథువు అనెడి; పృథివీతలేశు = రాజు {పృథివీతలేశుడు - పృథివీతలము (భూమి)కి ఈశుడు, రాజు}; అందున్ = తోటి; అనుగమనంబున్ = సహగమనము; చేయున్ = చేసెడి; అట్టి = అటువంటి; సాధ్వి = స్త్రీ {సాధ్వి - సాధుస్వభావము కలామె, స్త్రీ}; అర్చిన్ = అర్చిని; కనుగొని = చూసి; దేవ = దేవతా; అంగన = స్త్రీల; ఆళి = సమూహము; అప్పుడు = అప్పుడు; ఆత్మ = తమ; నాథులన్ = భర్తలను; కూడి = కలిసుండి; నెయ్యంబున్ = కూర్మి; తోడన్ = తోటి.

భావము:

ఆ మహాసాధ్వి మందరపర్వతం చరియలలో చితిని సిద్ధపరిచింది. నదీజలాలలో స్నానం చేసి వచ్చింది. పతికి ఉదక తర్పణం కావించింది. మిక్కిలి భక్తితో దేవతలకు నమస్కరించింది. చితికి అగ్ని ముట్టించింది. మండుతున్న అగ్నికి మూడుసార్లు ప్రదక్షిణం చేసింది. మహావీరుడైన పతిదేవుని పాదపద్మాలను మనస్సులో ధ్యానిస్తూ సహగమనం చేసింది. పతితో చితిమీద సహగమనం చేస్తున్న ఆ పరమ సాధ్విని వేలకొలది దేవతాకాంతలు తమ భర్తలతో కూడి తిలకించి పులకించారు.