పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-655.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

య్యుఁ బ్రియనాథ కృత కరుణావలోక
రతలస్పర్శనాది సత్కారములను
బల సుఖవృత్తిఁ జెంది య య్యడవులందుఁ
గృశత మదిఁ దోఁపకుండఁ జరించు నపుడు.

టీకా:

అంతన్ = అంతట; ఆ = ఆ; పృథునిన్ = పృథువు యొక్క; భార్యామణి = రత్నమువంటి భార్య; అగు = అయిన; అర్చి = అర్చి; పుడమి = భూమి; పైన్ = మీద; వడిన్ = వేగముగ; అడుగిడినన్ = అడుగులేస్తే; కందు = కందిపోయే; సుకుమార = సుకుమారమైన; పాద = పాదములు అనెడి; అబ్జన్ = పద్మములు కలామెను; సుందరీ = సుందరిలయందు; రత్నంబున్ = రత్నమువంటిది; అతుల = సాటిలేని; పతివ్రత = పతివ్రత; అగుటన్ = అగుట; చేసి = వలన; ఆత్మ = తన; ఈశ = భర్త; కృత = చేయబడిన; సు = చక్కటి; వ్రత = దీక్షల; ఆచరణంబునున్ = ఆచరించుట; సు = మంచి; మహిత = గొప్ప; భక్తిన్ = భక్తి; శుశ్రూషణమును = పరిచర్యలు; ఆర్షేయము = ఋషులమార్గము; అగు = వంటి; దేహయాత్రయున్ = జీవనశైలి; అను = అనెడి; వీని = వీటి; చేతన్ = వలన; మిక్కిలిన్ = మిక్కిలిగా; కృశీభూత = చిక్కపోయిన; దేహ = శరీరముకలది.
అయ్యున్ = అయినప్పటికిని; ప్రియ = కూర్మికల; నాథ = భర్తచే; కృత = చేయబడిన; కరుణ = దయతో; అవలోక = చూచుట; కరతల = అరచేత; స్పర్శ = తాకుట; ఆది = మొదలగు; సత్కారములను = గౌరవములవలన; అబల = స్త్రీ {అబల - బలము లేనిది, స్త్రీ}; సుఖ = సుఖముగనున్న; వృత్తిన్ = భావమును; చెంది = చెంది; ఆ = ఆ; అడవుల్ = అడవుల; అందున్ = లో; కృశతన్ = చిక్కిపోవుటను; మదిన్ = మనసులో; తోపకుండన్ = తలచుకొనకుండగ; చరించున్ = తిరుగును; అపుడున్ = అప్పుడు.

భావము:

పృథుచక్రవర్తి భార్య అయిన అర్చిమహాదేవి పుడమిపై అడుగు ఉంచితే కందిపోయే పాదారవిందాలు, సౌందర్య సౌకుమార్యాలు కల ముద్దరాలు. సాటిలేని మహాపతివ్రత. భర్త యొక్క వ్రత నియమాలతో, పతి శుశ్రూషతో, తపోమయ జీవనంతో ఆమె కోమల శరీరం కృశించిపోయింది. అయినప్పటికీ ప్రాణనాథుని ప్రసన్న వీక్షణాలు, అనురాగమయ కరస్పర్శలు మొదలైన ఆదరాభిమానాల వల్ల ఆనందపడుతూ ఆ అడవిలో కష్టాలన్నీ మరచిపోయి కాలం గడిపింది. అప్పుడు…