పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-653.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నందు నాకాశ మాకాశమందుఁ దేజ
మందుఁ దేజంబు నుదకంబునందు నుదక
ర్థిఁ గాయంబు మేదిని యందుఁ గలిపెఁ
బూని వాని యధోచితస్థాములుగ.

టీకా:

కోరి = పూని; మడమల = కాలిమడమల; చేన్ = చేత; గుద = గుదస్థానమును; పీడనము = ఒత్తుట; చేసి = చేసి; పూని = సిద్ధించిన; యుక్త = ఉచిత; ఆసన = యోగాసనమున; ఆసీనుడు = కూరచున్నవాడు; అగుచున్ = అగుచు; తనరున్ = అతిశయించెడి; మూలాధార = మూలాధారచక్రము; నుండి = నుండి; వాయువున్ = వాయువును; ఒయ్యనన్ = శ్రీఘ్రమే; ఎగయించి = పైకి నెట్టి; ఒనరన్ = చక్కగా; నాభిన్ = నాభిని; కలితంబున్ = కలిసినదిగా; కావించి = చేసి; క్రమమున = క్రమముగా; హృత్ = హృదయము (గుండెకాయ); వక్ష = వక్షస్థలము; కంఠ = కంఠము; శిరః = శిరస్సు; కోష్టకములన్ = కపాలములకు; చేర్చి = చేర్చి; = కైకొని = పూని; మూర్థ = మాడు; భాగమున్ = భాగమున; కున్ = కు; ఎగయించి = ఎక్కించి; ప్రాణముల్ = ప్రాణములను; విడిచి = విడిచి; ఆ = ఆ; పవనున్ = ప్రాణవాయువును; పవనున్ = వాయువు; అందున్ = అందు; ఆకాశమున్ = ఆకాశమును; ఆకాశము = ఆకాశము; అందున్ = అందు; తేజము = తేజము; అందున్ = అందు; తేజంబున్ = తేజమును; ఉదకంబున్ = నీటి; అందున్ = అందు; ఉదకమున్ = నీటిని; అర్థిన్ = కోరి; కాయంబున్ = శరీరమును. = = మేదిని = భూమి; అందున్ = అందు; కలిపెన్ = కలిపెను; పూని = ధరించి; వానిన్ = వాటిని; యథా = ఆయా; ఉచిత = తగిన; స్థానములుగా = తావులుగా.

భావము:

చీలమండల చేత గుదస్థానాన్ని పీడించి ముక్తాసనంలో ఆసీను డయ్యాడు. మూలాధారం నుండి వాయువును మెల్లగా పైకి లేపి నాభిస్థానంలోని మణిపూరక చక్రంలో నిలిపాడు. అక్కడి నుండి క్రమంగా హృదయస్థానంలోని అనాహత చక్రంలోనికి, అక్కడి నుండి కంఠానికి దిగువన ఉన్న విశుద్ధ చక్రంలోనికి, అక్కడి నుండి భ్రూమధ్యంలో ఉన్న ఆజ్ఞాచక్రంలోనికి ప్రవేశపెట్టాడు. అనంతరం క్రమంగా మూర్ధభాగంలోని బ్రహ్మరంధ్రం లోనికి చేర్చాడు. ఆ తర్వాత పంచభూతాలను విభజించి ప్రాణవాయువును బాహ్యవాయువు నందు ఏకం చేశాడు.