పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-648-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మెండుగా మిటమిట మండు వేసవి యందుఁ-
ప్త పంచాగ్ని మధ్యమున నిలిచి
మానక జడిగొన్న వానకాలంబునఁ-
బైఁ గోక వేయక యట నిలిచి
నులు హూహూయను లివేళఁ గుత్తుక-
బంటి తోయముల లోల వసించి
శిశిరంబు చాల నల్దిశలఁ బర్వినవేళ-
వెలయ భూశయనుఁడై విశ్రమించి

4-648.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హిత నియతిఁ దితిక్షా సన్వితుండు
నియత పరిభాషణుఁడు జితానిలుఁడు దాంతుఁ
డిద్ధమతి యీశ్వరార్పిత బుద్ధి యనఘుఁ
డూర్ధ్వరేతస్కుఁడునునై క్రమోచితముగ.

టీకా:

మెండుగ = మిక్కిలి; మిటమిట = మిటమిటమని; మండు = మండెడి; వేసవి = వేసంకాలము; అందున్ = లో; తప్త = మండుతున్న; పంచాగ్ని = పంచాగ్నుల {పంచాగ్నులు - 1దక్షిణాగ్ని కామాగ్ని వెన్నెముక దిగువ భాగమునకు (దక్షిణము)నకు చెందినది 2గార్హపత్యము ఆకలి ఉదరస్థానమైనది 3ఆహవనీయము జ్ఞానాగ్ని తలలోనుండును 4సథ్యము ప్రాణాగ్ని వక్షముననుండును 5అవసథ్యము ఆత్మాగ్ని ప్రకృతి నుండి తనను వేరుగ గుర్తింపజేయునది}; మధ్యమునన్ = మధ్యన; నిలిచి = నిలబడి; మానక = వదలక; జడిగొన్న = జడివాన పడుతున్న; వానకాలంబునన్ = వానాకాలామునందు; పైగోక = పైపంచ; వేయక = ధరించకుండ; బయటన్ = బయలుప్రదేశమున; నిలిచి = నిలబడి; జనులు = లోకులు; హూహూయను = హూహూ అనుచువణకెడి; చలివేళన్ = చలికాలములో; కుత్తుకబంటి = గొంతులోతు; తోయముల = నీటి; లోపల = లోపల; వసించి = ఉండి; శిశిరంబున్ = ఆకురాలుకాలము; చాల = మిక్కిలి; నల్దిశలన్ = నాలుగుదిక్కుల; పర్విన = వ్యాపించిన; వేళ = సమయములో; వెలయన్ = ప్రసిద్దముగ; భూశయనుండు = నేలపైపండుకొనినవాడు; ఐ = అయ్యి; విశ్రమించి = నిద్రించి.
మహిత = గొప్ప; నియతిన్ = నియమములతో; తితిక్షా = ఓర్పు; సమన్వితుండు = కలవాడు; నియత = నియమింపబడిన; పరిభాషణుండున్ = సంభాషణుండు; జిత = జయించిన; అనిలుడున్ = (ప్రాణ) వాయువులు కలవాడు; దాంతుడున్ = ఇంద్రియనిగ్రహముకలవాడు; ఇద్ద = ప్రశస్తమైన; మతి = మనసుకలవాడు; ఈశ్వర = భగవంతునికి; అర్పిత = అర్పించబడిన; బుద్ధి = బుద్ధికలవాడు; అనఘుడు = పుణ్యుడు; ఊర్థ్వరేతస్కుడు = బ్రహ్మచర్యమునున్నవాడు {ఊర్థ్వరేతస్కుడు - పైకిప్రసరించినరేతస్సుకలవాడు, బ్రహ్మచర్యమునున్నవాడు}; ఐ = అయ్యి; క్రమ = క్రమముగా; ఉచితముగ = తగినట్లు.

భావము:

పృథుచక్రవర్తి ప్రచండమైన మండు వేసవిలో పంచాగ్నుల మధ్యలో నిలబడి తపస్సు చేశాడు. జోరున వర్షించే వానకారులో మీద బట్ట లేకుండా బయట నిలిచి తడుస్తూ తపస్సు చేశాడు. వడవడ వణికించే చలిలో కుత్తుకబంటి నీటిలో నివసించి తపించాడు. శిశిర ఋతువులో ముదిరిన చలిలో కటిక నేలమీద పరుండి ధ్యాననిమగ్ను డైనాడు. గొప్ప నియమంతో, ఓర్పుతో జితేంద్రియుడై మౌనవ్రతం అవలంభించి ఊర్ధ్వరేతస్కుడై వాయువును నిరోధించి ఈశ్వరార్పిత బుద్ధితో…