పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-643-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఘాత్మక! లోకత్రయ
ము సజ్జన కర్ణరంధ్రముల వినఁబడు నా
వినుత యశోమహనీయుఁడు
వినుతుం డైన రామచంద్రుని మాడ్కిన్.

టీకా:

అనఘాత్మక = పుణ్యాత్మ; లోకత్రయమునన్ = ముల్లోకములలోను; సత్ = మంచి; జన = వారి; కర్ణరంధ్రములన్ = చెవుల రంధ్రముల ద్వారా; వినబడు = వినబడెడి; ఆ = ఆ; వినుత = స్తుతింపబడిన; యశః = కీర్తిగల; మహనీయుడు = గొప్పవాడు; జన = ప్రజలచే; వినుతుండున్ = స్తుతింపబడినవాడు; ఐన = అయిన; రామచంద్రుని = శ్రీరాముని; మాడ్కిన్ = వలె.

భావము:

పుణ్యాత్మా! ముజ్జగాలలోని సజ్జనులకు వీనులవిందు చేసే విశాల యశోవిరాజితుడైన ఆ రాజచంద్రుడు జనులు తన విజయగాథలను గానం చేస్తుండగా ప్రకాశించాడు.