పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-639.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మందిరోద్యాన వనభూములందు రాజ్య
రిమ వర్తింపఁగా నహంకార రహితుఁ
గుచుఁ దన చిత్తమున నింద్రియార్థములను
గులకయ యుండె సన్మహోదారుఁ డగుచు.

టీకా:

కర్మంబులనున్ = వేదకర్మములను; యథా = తగిన; కాల = కాలము; దేశ = ప్రదేశములకు; ఉచిత = ఉచితమైన; బల = బ్రాహ్మణ సేవకాది బలము; విత్తములున్ = ధనములు; కాగన్ = ఉండగ; పరగు = ప్రసిద్దమగు; ధర్మములనున్ = ధర్మములను; బ్రహ్మా = పరబ్రహ్మమునకు; అర్పణ = అర్పించెడి; బుద్ధినిన్ = భావము; చేసి = చేసికొని; కర్మ = వేదకర్మములుయందు; ఆసక్తుండు = ఆసక్తికలవాడు; అగుచున్ = అవుతూ; సమాహితుండున్ = సిద్దమైనవాడు; ప్రకృతి = ప్రకృతి; కంటెనున్ = కంటె; తన్నున్ = తనను; పరమైన = ఇతరమైనవాడు; ఆత్మనున్ = మనసున; కర్మ = కర్మల; సంచయ = సమూహమునకు; సాక్షి = సాక్షిమాత్రము; కాగన్ = అయినట్లు; బుద్ధిన్ = విచారించుతూ; అర్తిన్ = కోరి; తలంచుచున్ = భావించుతూ; ఆచరించుచున్ = ఆచరించుతూ; అట్ల = ఆ విధముగ; = మెఱసి = విలసిల్లుతూ; సామ్రాజ్య = సామ్రాజ్యము అనెడి; లక్ష్మీ = సంపదలతో; సమేత = కూడిన.
మందిర = భవనములు; ఉద్యానవన = తోటలు; భూములు = పొలములు; అందున్ = అందు; రాజ్య = రాజ్యము యొక్క; గరిమన్ = గొప్పదనము; వర్తింపగా = వర్తిస్తుండగా; అహంకార = అహంకారము; రహితుండు = లేనివాడు; అగుచున్ = అవుతూ; తన = తన యొక్క; చిత్తమునన్ = మనసున; ఇంద్రియార్థములనున్ = వియములను; తగులకయ = సక్తుడుకాకుండగ; ఉండెన్ = ఉండెను; సత్ = సత్యమైన; మహా = గొప్ప; ఉదారుడు = ఉదారబుద్ధికలవాడు; అగుచున్ = అవుతూ.

భావము:

దేశ కాల బల విత్తాలకు తగినట్లు బ్రహ్మార్పణ బుద్ధితో సత్కర్మలను, ధర్మాలను ఆచరించాడు. ఫలాన్ని బ్రహ్మార్పణం చేసి కర్మలందు అనాసక్తు డయ్యాడు. ప్రకృతి కంటె పరమైన తనను కర్మసాక్షిగా భావించి కర్మలను ఆచరించాడు. సామ్రాజ్య లక్ష్మీ సమేతుడై సుందర మందిరోద్యాన భూములలో తిరుగుతూ ఉన్నప్పటికీ అహంకార రహితుడై తన చిత్తం ఇంద్రియార్థాలలో చిక్కుకొనకుండా సూర్యునిలాగా ప్రవర్తించాడు.