పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-625-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నఘ! యీ సంసార తిశయంబునఁ దరి-
యింపంగ మది నిశ్చయించువాఁడు
గైకొని ధర్మార్థకామమోక్షములకు-
తి విఘాతుక మెద్ది ట్టి దాని
లన సంగము చేయలవ; దా ధర్మాదు-
లందుఁ ద్రివర్గంబు నంతకోగ్ర
యయుతం బగుటను రమమోక్షంబె ము-
ఖ్యార్థమై విలసిల్లు నండ్రు బుధులు;

4-625.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భువి గుణవ్యతికరమునఁ బుట్టినట్టి
బ్జజాతాదులకు నస్మదాదులకును
గాల విధ్వంసితాఖిల క్రమముగల్గుఁ
లుగ దెన్నఁడు సేమంబుగాన వినుము.

టీకా:

అనఘ = పుణ్యుడా; ఈ = ఈ; సంసారమున్ = సంసారమును; అతిశయంబునన్ = అతిశయించి; తరియింపన్ = దాటవలెనని; మదిన్ = మనసున; నిశ్చయించు = నిశ్చయించుకొన్న; వాడు = వాడు; కైకొని = పూని; ధర్మ = ధర్మము; అర్థ = ధనము; కామ = కామము; మోక్షముల్ = మోక్షముల; కున్ = కు; అతి = మిక్కిలి; విఘాతము = అడ్డుతగులునది; ఎద్ది = ఏదైతే; అట్టి = అటువంటి; దాని = దాని; వలన = అందు; సంగము = సహవాసము; చేయన్ = చేయుట; వలవదు = వద్దు; ఆ = ఆ; ధర్మ = ధర్మము {ధర్మాదులు - 1ధర్మ 2అర్థ 3కామ 4మోక్షములు}; ఆదులు = మొదలగువాని; అందున్ = అందలి; త్రివర్గంబున్ = మూటికి {త్రివర్గము - 1ధర్మ 2అర్థ 3కామములు}; అంతక = యముని వలన; ఉగ్ర = మిక్కలి; = భయ = భయముతో; యుతంబున్ = కూడినవి; అగుటన్ = అగుటవలన; పరమమోక్షంబె = అత్యున్నతమోక్షమే; ముఖ్య = ముఖ్యముగా; అర్థము = కోరదగినది; ఐ = అయ్యి; విలసిల్లున్ = ప్రకాశించును; అండ్రు = అంటారు; బుధులు = జ్ఞానులు.
భువిన్ = జగత్తులో; గుణ = గుణముల; వ్యతికరమునన్ = ఘర్షణ వలన; పుట్టిన = జనించిన; అట్టి = అటువంటి; అబ్జజాత = బ్రహ్మదేవుడు; ఆదుల్ = మొదలగువారి; కునున్ = కి; అస్మదాదుల్ = మావంటివారి; కునున్ = కి; కాల = కాలముచేత; విధ్వంసితాఖిల = సర్వనాశన, మరణ; క్రమమున్ = విధానము; కల్గున్ = కలగును; కలుగదు = కలుగదు; ఎన్నడుసేమంబున్ = శాశ్వతక్షేమము; కానన్ = కావున; వినుము = వినుము.

భావము:

“పుణ్యమూర్తివైన పృథుచక్రవర్తీ! సంసార సముద్రాన్ని జాగ్రత్తగా దాటగోరేవాడు ధర్మార్థకామమోక్షాలను నిర్మూలనం చేసే ఎటువంటి దుస్సంగమాన్నీ చేయకూడదు. ధర్మార్థకామమోక్షాలలో ధర్మార్థకామాలు మూడు అనిత్యాలైనందువల్ల యమభయంతో కూడి ఉంటాయి. మోక్ష మొక్కటే పరమ పురుషార్థ మని పండితులు చెపుతారు. గుణ సంబంధం వల్ల సంభవించిన బ్రహ్మాదులకు, మాబోటి వారికి కరాళకాల ప్రభావం చేత ఎప్పటికైనా వినాశమే కాని క్షేమం అనేది ఎప్పుడూ కలుగదు. కనుక ఇది విను…