పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-621-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పురుషుఁడు నిద్రపోఁ గలలఁ బొందిన యాత్మసుఖైక హేతువై
రఁగిన రాజభృత్యజన భావగుణంబులు సంప్రబోధమం
యఁగ మిథ్య యైనగతి నాంతర బాహ్యగుణప్రభేదముల్
రువడిఁ గానకుండు జనపాలనశీలన! నిత్యఖేలనా!

టీకా:

పురుషుడు = మానవుడు; నిద్రపోన్ = నిద్రించగా; కలలన్ = కలలో; పొందిన = పొందినట్టి; ఆత్మ = తన; సుఖ = సుఖములకు; ఏక = ముఖ్య; హేతువు = కారణము; ఐ = అయ్యి; పరగిన = విలసిల్లిన; రాజ = రాజు; భృత్యుజన = భటులు; భావ = అనెడి భావముల; గుణంబులు = లక్షణములు; సంప్రబోధము = మెలుకవ; అందున్ = కలిగి నప్పుడు; అరయగా = విచారించిన; మిథ్య = అసత్యము; ఐన = అయిన; గతిన్ = విధముగ; అంతర = లోని; బాహ్య = వెలుపలి; గుణ = అనెడి గుణముల; ప్ర = ప్రముఖ; భేదముల్ = భేదములు; పరువడిన్ = శ్రీఘ్రమే; కానకుండున్ = కనబడకుండును; జనపాలన = ప్రజాపరిపాలన; శీలా = స్వభావముగా కలవాడ; నిత్య = శాశ్వతమైన; ఖేలనా = లీల యైనవాడ.

భావము:

ప్రజాపాలనలో నేర్పరివైన ఓ రాజా! మానవుడు నిద్రలో కలగంటాడు. ఆ కలలో తాను రాజై రాజ్యాలను ఏలినట్లు, సిరిసంపదలతో తులదూగినట్లు ఏవేవో ఆనందాలను అనుభవిస్తాడు. కల కరిగిపోయి మేలుకోగానే అన్నీ అసత్యాలు అని తెలుసుకుంటాడు. అదేవిధంగా లింగదేహం నశించి, ఉపాధి రహితుడైన పురుషునికి బాహ్యవిషయాలైన శబ్ద స్పర్శాదులు, అంతర్విషయాలైన శోక మోహాదులు ఏవీ అనుభూతాలు కావు.