పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-619-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నఘ! సాక్షాత్కార గు భక్తి యోగాగ్నిఁ-
డఁగి జీవాధారమును బంధ
భూతాత్మకంబునై పొలుచు హృద్గ్రంథిని-
బూని స్వకారణభూత మయిన
రణి దహించు హుతాశను కైవడి-
నిర్దహించిన నిట్లు నెఱసి దగ్ధ
చిత్తుఁడై ముక్తనిశ్శేషాత్మ గుణుఁడు స-
ద్ధర్ముఁడు నైన యతండు మిగుల

4-619.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్థి బాహ్యంబు లయిన ఘటాదికములు
నాంతరము లైన సౌఖ్యదుఃఖాదికములు
ను విభేదము లాత్మ భేనము లగుట
య్యుపాధి వినాశంబు నందగలఁడు.

టీకా:

అనఘ = పుణ్యుడ; సాక్షాత్కారము = సాక్షాత్కారము {సాక్షాత్కారము - స (కలియుట) అక్ష (చూపునందు) కారము (అగుట), కంటపడుట}; అగు = అయిన; భక్తియోగ = భక్తియోగము యొక్క; అగ్నిన్ = అగ్ని యందు; కడగి = పూని; జీవ = జీవుడు; ఆధారకమునున్ = ఆధారముగకలది; బంధభూతాత్మకంబున్ = ముడిపడుట; ఆత్మకంబున్ = తానైనది; ఐ = అయ్యి; పొలుచు = కనబడెడి; హృత్ = హృదయము అనెడి {హృద్గ్రంథి - హృదయమునందలి యజ్ఞానము యనెడి ముడి}; గ్రంథినిన్ = ముడిని; పూని = ధరించి; స్వ = తనకి; కారణభూతము = కారణమైనది; అయిన = అయిన; అరణిన్ = అరణిన్ {అరణి - అగ్నిని చేయు కర్రతోచేసిన సాధనము}; దహించున్ = కాల్చివేయును; హుతాశనుని = అగ్నిదేవుని {హుతాశనుడు - హుతములను అశనుడు (భుజించువాడు), అగ్నిదేవుడు}; కైవడి = వలె; నిర్దహించినన్ = మిక్కిలి కాల్చేయగా; ఇట్లు = ఈ విధముగ; నెఱసి = పూర్తిగా; దగ్ద = కాలిపోయిన; చిత్తుడు = చిత్తవృత్తులుకలవాడు; ఐ = అయ్యి; ముక్త = విడువబడిన; నిశ్శేష = సమస్తమైన; ఆత్మ = ఆత్మ యొక్క; గుణుడు = గుణములుకలవాడు; సత్ = సత్యమే; ధర్ముడు = ధర్మముగాకలవాడు; ఐన = అయిన; అతండు = అతడు; మిగులన్ = మిక్కిలిగా; అర్థిన్ = కోరి.
బాహ్యంబులున్ = (దేహమునకు) వెలుపలివి; అయిన = అయిన; ఘట = కుండ; ఆదికములున్ = మొదలగునవి; ఆంతరములు = లోనివి; ఐన = అయిన; సౌఖ్యదుఃఖ = సుఖదుఃఖ; ఆదికంబులున్ = మొదలగునవి; అను = అనెడి; విభేదముల్ = విభేదములు; ఆత్మ = భావనలలోని; భేదనములు = విభేదములు; అగుటన్ = అగుటవలన; ఆ = ఆ; ఉపాధివినాశంబున్ = శరీరస్పురణ నశించుటను; అందగలడు = చెందగలడు;

భావము:

పుణ్యాత్మా! సాక్షాత్కరించిన భక్తియోగమనే అగ్నితో పంచభూతాత్మకమైన అహంకారాన్ని తన పుట్టుకకు కారణమైన అరణిని అగ్ని దహించినట్లు దహిస్తాడు. ఈ విధంగా హృదయగ్రంధిని దహించడం వల్ల ఉపాధి గుణాలైన కర్తృత్వ భోక్తృత్వాలనుండి విముక్తుడై బాహ్యాలైన ఘటాదికాలకు, అంతరాలైన సుఖదుఃఖాదులకు అతీతు డౌతాడు.