పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-616-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యభినందించి మోక్షసాధనోపదేశ కాముండైన పృథుచక్రవర్తికి వెండియు నిట్లనియె.

టీకా:

అని = అని; అభినందించి = అభినందించి; మోక్ష = మోక్షమును; సాధన = సాధించెడి విధానమును; ఉపదేశ = ఉపదేశమును; కాముండు = కోరెడివాడు; ఐన = అయిన; పృథుచక్రవర్తిన్ = పృథుచక్రవర్తి; కిన్ = కి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అని అభినందించి మోక్షసాధనమైన ఉపదేశాన్ని కోరిన పృథుచక్రవర్తితో సనత్కుమారుడు మళ్ళీ ఇలా అన్నాడు.