పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-615-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రణి సజ్జనసంగంబులఁపనుభయ
మ్మతంబగువారలు లుపునట్టి
రససంభాషణప్రశ్నరణి నిఖిల
నములకు సుఖకరమగు నవరేణ్య!

టీకా:

ధరణిన్ = లోకమున; సత్ = మంచి; జన = వారితో; సంగంబున్ = సంగమము; తలపన్ = ఆలోచించినచో; ఉభయ = ఇద్దరకును; సమ్మతంబున్ = అంగీకారము; అగు = అగును; వారలు = వారు; సలుపున్ = జరిపెడి; అట్టి = అటువంటి; సరస = రసవంతమైన; సంభాషణ = సంభాషణములు; ప్రశ్న = విచారించెడి; సరణి = విధానము; నిఖిల = సమస్తమైన; జనముల్ = లోకుల; కున్ = కు; సుఖ = సుఖమును; కరము = కలిగించెడివి; అగున్ = అగును; జనవరేణ్య = రాజా {జన వరేణ్యుడు - జనులచే వరేణ్యుడు (పూజింపదగినవాడు), రాజు}.

భావము:

జనవరేణ్యా! సాధుసంగమం ఉభయ సమ్మతమై సకలార్థ సాధనం అవుతుంది. ఎందుకంటే సజ్జనుల సరస సంభాషణాలు, సంప్రశ్నలు సమస్త జనులకు మేలు కలిగిస్తాయి.