పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-612-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రమ పావనులార! బాల్యంబునందుండి-
మానిత శ్రద్ధా సన్వితులును
గుణనిధుల్ ధైర్యయుక్తులు ముముక్షువులునై-
ధిక వ్రతంబుల నాచరింతు
ట్టి పుణ్యులు భవదాగమనంబు స్వా-
తమయ్య! సత్కృపాలితులార!
నివారితవ్యసనార్ణవం బయినట్టి-
భూరి దుర్లంఘ్య సంసామందు

4-612.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తివిహీన స్వకీయ కర్మములఁ జేసి
డరి మగ్నులమై యింద్రియార్థములనె
తివిరి పురుషార్థములుఁగాగఁ దెలియు మాకుఁ
గుశల మున్నదె లోకైక కుశలులార!

టీకా:

పరమ = మిక్కలి; పావనులారా = పవిత్రమైనవారా; బాల్యంబున్ = చిన్నతనము; అందుండి = నుండి; మానిత = మన్నింపదగిన; శ్రద్ధా = శ్రద్ధతో; సమన్వితులును = కూడినవారు; గుణ = సగుణములకి; నిధుల్ = నిధులవంటివారు; ధైర్య = ధైర్యము; యుక్తులు = కలవారు; ముముక్షువులున్ = మోక్షార్థులు; ఐ = అయ్యి; అధిక = పెక్కు; వ్రతంబులన్ = వ్రతములను; ఆచరింతురు = ఆచరిస్తుండెదరు; అట్టి = అటువంటి; పుణ్యులు = పుణ్యాత్ములు; భవత్ = మీ యొక్క; ఆగమనంబున్ = రాకకు; స్వాగతము = స్వాగతము; అయ్య = తండ్రి; సత్ = మంచి; కృపా = దయ; కలితులారా = కలవారా; అనివారిత = వారింపరాని; వ్యసన = ఆపదల; ఆర్ణవంబు = సముద్రము; అయిన = అయిన; అట్టి = అటువంటి; భూరి = అత్యంత; దుర్లంఘ్య = దాటరాని; సంసారము = సంసారము; అందున్ = లో.
మతి = బుద్ది; విహీన = లేని; స్వకీయ = మాచే చేయబడిన; కర్మములన్ = కర్మములు, పనులు; చేసి = వలన; అడరి = అతిశయించి; మగ్నులము = మునిగినవారము; ఐ = అయ్యి; ఇంద్రియార్థములనె = విషయములనె, కోరికలనె; తివిరి = పూని; పురుషార్థములు = కర్తవ్యములు; కాగన్ = అయినట్లు; తెలియు = భావించెడి; మాకున్ = మాకు; కుశలము = క్షేమము; ఉన్నదె = ఉన్నదా ఏమి; లోక = లోకములకు; ఏక = ముఖ్యమైన; కుశలులార = క్షేమకరులారా.

భావము:

“పరమపవిత్ర చరిత్రులారా! మీరు బాల్యంనుండి మోక్షాన్ని కాంక్షించి శ్రద్ధతో పట్టుదలతో గొప్ప వ్రతాలు చేస్తున్న పుణ్యాత్ములు. మీ రాక మాకు శుభప్రదం. మీకు స్వాగతం. కృపానిధులారా! మీరు లోక క్షేమంకరులు. స్వకర్మల వల్ల దుఃఖమయమై దాటరాని సంసార సాగరంలో మునిగిపోయి ఇంద్రియార్థాలనే పురుషార్థాలుగా భావించే మాకు ఈ లోకంలో కుశల మెక్కడిది?