పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-607-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని మఱియు “ననఘాత్ములార! లోకంబుల నీక్షించుచుం బర్యటనంబు చేయు మిమ్ము సర్వదర్శనుం డయిన యాత్మం గనుంగొనఁజాలని సర్వదృశ్యంబు చందంబున నీ లోకంబు గనుంగొనజాలకుం; డట్టి మహాత్ముల రయిన మీ దర్శనంబునం జేసి యేను ధన్యుండ నైతి; నదియునుం గాక.

టీకా:

అని = అని; మఱియున్ = ఇంకను; అనఘాత్ములులారా = పుణ్యాత్ములులారా; లోకంబులన్ = లోకములను; ఈక్షించుచున్ = వీక్షించుతూ; పర్యటనంబున్ = తిరుగుట; చేయు = చేసెడి; మిమ్మున్ = మిమ్ములను; సర్వ = సమస్తమును; దర్శనుండు = చూడగలిగెడివాడు; అయిన = అయినను; ఆత్మన్ = ఆత్మను; కనుగొనజాలని = పొడగనలేని; సర్వ = సర్వసామాన్యమైన; దృశ్యంబు = దృశ్యము; చందంబునన్ = వలె; ఈ = ఈ; లోకంబున్ = లోకమున; కనుంగొనజాలకుండు = పొడగనలేకుండును; అట్టి = అటువంటి; మహాత్ములరు = గొప్పవారు; అయిన = అయిన; మీ = మీ యొక్క; దర్శనంబునన్ = దర్శనము; చేసి = వలన; ఏను = నేను; ధన్యుండన్ = ధన్యుడను; ఐతి = అయితి; అదియునున్ = అంతే; కాక = కాకుండ.

భావము:

అని చెప్పి మళ్ళీ “పుణ్యాత్ములారా! సర్వదర్శనుడైన ఆత్మను సర్వదృశ్యం చూడలేనట్లు లోకాలన్నింటినీ చూస్తూ సంచరించే మిమ్ము లోకులు చూడలేరు. అటువంటి మహానుభావులైన మీ దర్శనం వల్ల నేను కృతార్థుణ్ణి అయినాను. అంతేకాక…