పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-604.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రమ సంప్రీత మతియునై లికె రాజు
గోరి "యో మంగళాయనులా! పూర్వ
వమునం దెద్ది మంగళప్రద సుకర్మ
మేను జేసితి? మిముఁ జూడ నిపుడు గలిగె."

టీకా:

పూని = పూనుకొని; అర్హ = తగిన; ఆసనా = ఆసనములందు; ఆసీనులన్ = కూర్చొనినవారిని; కావించి = చేసి; కరము = అదికముగ; అర్థిన్ = కోరి; విధివత్ప్రకారము = పద్ధతిప్రకారము; పూజించి = పూజించి; తత్ = వారి; పాద = పాదములు అనెడి; అంభోరుహ = పద్మములు; క్షాళన = కడిగిన; సలిలంబున్ = నీటిని; ఆత్మ = స్వంత; మస్తకంబునన్ = తలపైన; తాల్చి = ధరించి; హాటక = బంగారముతో; కలిత = చేయబడిన; సింహాసన = సింహాసనములందు; ఆసీనులన్ = కూర్చున్నవారు; ఐ = అయ్యి; విహిత = అనుకూలమైన; అగ్నులన్ = అగ్నుల; పోలి = వలె; వెలుగుచున్న = ప్రకాశించుతున్న; శర్వ = శివుని కంటె {శర్వాగ్రజన్ములు - సృష్టాదిని బ్రహ్మదేవుడు సనకాదుల సృష్టించెను. తరువాత అతని కనుబొమముడినుండి రుద్రరూపమున శివుడు జన్మించెను. అందుచేత శివును యగ్రజన్ములు సనకాదులు.}; అగ్రజన్ములన్ = ముందుపుట్టినవారిని; సనక = సనకుడు {సనకాదులు - 1సనకుడు 2సనందనుడు 3సనత్కుమారుడు 4సనత్సుజాతుడు}; ఆదులన్ = మొదలగువారిని; చూచి = చూసి; అతుల = మిక్కిలి; శ్రద్ధా = శ్రద్ధతో; సంయమ = నిగ్రహములతో; సమాన్వితుండు = కూడినవాడు; పరమ = మిక్కిలి; సంప్రీత = ప్రేమకలిగిన; మతియున్ = భావముకలవాడు; ఐ = అయ్యి.
పలికెన్ = పలికెను; రాజు = రాజు; కోరి = కోరి; ఓ = ఓ; మంగళ = శుభ; ఆయనులారా = ప్రదులారా; పూర్వ = ఇంతకుముందటి; భవమునన్ = జన్మములందు; ఎద్ది = ఏదో; మంగళ = శుభమును; ప్రద = కలిగించునదియైన; సు = మంచి; కర్మమున్ = కర్మమును; ఏను = నేను; చేసితిన్ = చేసితిని; మిమున్ = మిమ్ములను; చూడన్ = చూచుట; ఇపుడున్ = ఇప్పుడు; కలిగె = కలిగినది;

భావము:

వారిని తగిన ఆసనాలపై కూర్చుండబెట్టి యథావిధిగా పూజించాడు. వారి పాదపద్మాలను కడిగిన జలాలను తన తలపై చల్లుకున్నాడు. బంగారు గద్దెలమీద ఆసీనులై అగ్నులవలె ప్రకాశిస్తున్న బ్రహ్మ మానస పుత్రులను చూచి పృథుచక్రవర్తి పరమ సంతోషంతో, శ్రద్ధాసక్తులతో ఇలా అన్నాడు. “మంగళమూర్తులైన మహాత్ములారా! పూర్వజన్మలో నేను చేసిన పుణ్యవిశేషం వల్ల మిమ్ములను ఇప్పుడు దర్శింప గలిగాను.”