పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-600-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఘాత్ము లతిధి రూపం
బు రా గృహమేధి ప్రాణములు నుద్గతిచేఁ
రినఁ బ్రత్యుద్గతి వం
ముల మరలం బ్రతిష్ఠిములగు ననుచున్.

టీకా:

అనఘాత్ములు = పుణ్యాత్ములు; అతిథి = అతిథి; రూపంబునన్ = రూపములో; రాన్ = రాగా; గృహమేధి = గృహస్థుని; ప్రాణములున్ = ప్రాణములు; ఉద్గతిన్ = పైకిలేచుట; చేన్ = చేత; తనరినన్ = అతిశయించినను; ప్రత్యుద్గతి = ఎదురు వెళ్లుట; వందనములన్ = నమస్కరించుటలుచే; = మరలన్ = మళ్ళీ; ప్రతిష్ఠితంబులు = చక్కగా నిలబడినవి; అగున్ = అగును; అనుచున్ = అంటూ.

భావము:

పూజ్యులు అతిథులుగా వచ్చినప్పుడు వారిని చూడగానే గృహస్థు ప్రాణాలు లేచి వస్తాయి. వారికి ఎదురేగి నమస్కరించినప్పుడు తిరిగి యథాస్థానంలోనికి వస్తాయి అనే…