పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని రాజ్యపాలన

  •  
  •  
  •  

4-595-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పురుషవరేణ్య! హేమకశిపుండు రమా లలనేశు నిందచే
కమునొందఁ గోరియు గుజ్ఞుఁడు భాగవతుండునైన యా
తనయప్రభావమున వాసికి నెక్కి విధూత పాపుఁడై
నియముఁ బొందఁ డయ్యె; నతి నిర్మల కీర్తిఁ దనర్చెఁ గావునన్."

టీకా:

పురుష = పురుషులలో; వరేణ్య = ఉత్తముడ; హేమకశిపుండు = హిరణ్యకశిపుండు; రమాలలనేశున్ = విష్ణుమూర్తిని; నింద = నిందించుట; చేన్ = చేత; నరకమున్ = నరకమును; ఒందగోరియున్ = పొందవలసియుండియు; గుణజ్ఞుడు = సుగుణములు కలవాడు; భాగవతుండున్ = బాగవతుడును; ఐన = అయిన; ఆ = ఆ; వర = శ్రేష్ఠమైన; తనయ = పుత్రుని; ప్రభావమున = ప్రభావము వలన; వాసి = ప్రసిద్ది; కిన్ = ని; ఎక్కి = చెంది; విధూత = పోగొట్టబడిన; పాపుడు = పాపముకలవాడు; ఐ = అయ్యి; నిరయమున్ = నరకమును; పొందడు = పొందనివాడు; అయ్యెన్ = అయ్యెను; అతి = మిక్కిలి; నిర్మల = స్వచ్ఛమైన; కీర్తిన్ = యశస్సుయందు; తనర్చెన్ = అతిశయించెను; కావునన్ = అందుచేత.

భావము:

పురుషోత్తమా! హిరణ్యకశిపుడు శ్రీహరిని నిందించి నరకాన్ని పొందడానికి అర్హుడయ్యాడు. కాని సుగుణయుక్తుడు, విష్ణుభక్తుడు అయిన తన కొడుకు ప్రహ్లాదుని ప్రభావం చేత పాపాలన్నీ తొలగి నరకానికి పోకుండా మిక్కిలి స్వచ్ఛమైన కీర్తితో విరాజిల్లాడు.”